అబ్బాయ్గారి అబ్బాయికి మొండిచేయి | TDP Denied Palakol Assembly Ticket to CH Satyanarayana Murthy | Sakshi
Sakshi News home page

అబ్బాయ్గారి అబ్బాయికి మొండిచేయి

Published Fri, Apr 18 2014 3:27 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

అబ్బాయ్గారి అబ్బాయికి మొండిచేయి - Sakshi

అబ్బాయ్గారి అబ్బాయికి మొండిచేయి

పాలకొల్లు: అసెంబ్లీ టిక్కెట్ ఆశించిన పలువురు టీడీపీ సీనియర్ నాయకులకు పార్టీ నాయకత్వం మొండిచేయి చూపింది. పశ్చమగోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ నేత సిహెచ్‌ సత్యనారాయణమూర్తి(బాబ్జీ)కి టిక్కెట్ నిరాకరించింది. తనకే టిక్కెట్ వస్తుందన్న నమ్మకంతో బాబ్జీ ఇప్పటికే నామినేషన్ వేశారు. మీకే టికెట్‌ అంటూ చెప్పిన చంద్రబాబు చివరకు ఆయనకు హ్యాండ్ ఇచ్చారు. చివరి నిమిషంలో నిమ్మల రామానాయుడికి సీటు కేటాయించి బాబ్జీకి షాక్ ఇచ్చారు. మంచి హస్తవాసి గల వైద్యునిగా పేరున్న బాబ్జీని స్థానికంగా అబ్బాయ్గారి అబ్బాయి అని పిలుస్తుంటారు.

చింతలపూడి స్థానాన్ని ఆశించిన కర్రా రాజారావు, కొయ్యే మోషేన్‌రాజు, జయరాజులకు కూడా చంద్రబాబు రిక్తహస్తం చూపించారు. స్థానికేతురాలైన పీతల సుజాతకు టికెట్‌ కేటాయించి తనదైన రాజకీయం ప్రదర్శించారు చంద్రబాబు. పీతల సుజాత గతంలో ఆచంట ఎమ్మెల్యేగా పనిచేశారు. కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావుకూ చంద్రబాబు షాక్ ఇచ్చారు. కొవ్వూరు టిక్కెట్ను మోచర్ల జవహార్‌వతికి కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement