Pitala Sujatha
-
ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య వెనుక మహిళా ప్రజాప్రతినిధి: పీతల సుజాత
సాక్షి, అమరావతి: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వెనక ఉన్న అదృశ్య శక్తిగా ఒక మహిళా ప్రజాప్రతినిధి ఉన్నారని టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు పీతల సుజాత ఆరోపించారు. ఆమె ఎవరో, ఆమెకు అనంతబాబుకి ఉన్న సంబంధమేమిటో, ఎందుకు హత్య జరిగిందనే వివరాలను త్వరలోనే బయటపెడతామని చెప్పారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలు, అతన్ని కాపాడటానికి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. -
తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట!
సాక్షి, జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి) : ఎన్నికలకు పట్టుమని పదిరోజులు లేవు.. పచ్చతమ్ముళ్లేమో వర్గపోరుతో కుమ్ములాడుకుంటున్నారు. దీంతో జంగారెడ్డిగూడెంలో మంగళవారం జరిగిన టీడీపీ ఆర్యవైశ్య సభ రసాభసగా మారింది. మాజీమంత్రి పీతల సుజాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ వ్యాఖ్యానించడంతో చింతలపూడి నియోజకవర్గ టీడీపీలోవర్గపోరు భగ్గుమంది. మంత్రిగా ఉండి సూజాత నియోజకవర్గంలో చేసిందేమి లేదని, అభివృద్ధి శూన్యమని అంబికా కృష్ణ ఘాటుగా వ్యాఖ్యనించారు. దీంతో సుజాత వర్గం ఎదురు దాడికి దిగింది. రూ.100ల కోట్ల నిధులు ఏమయ్యాయో చెప్పాలని ఒకరికొకరు నిందించుకున్నారు. దీంతో కార్యకర్తల మధ్య తోపులాటతో వాగ్విదాం చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో నియోజకవర్గం అభివృద్ధి లేదంటూ సొంతపార్టీ నేతలే ఆరోపిస్తే ప్రచారానికి ఎలా వెళ్లాలంటు అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు. పార్టీ పరువును రోడ్డున పడేసారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంతో చింతలపూడి టీడీపీ అభ్యర్ధి కర్రా రాజారావుకు ఓటమి తప్పదని తెలుస్తోంది. ఇటీవలే ఆయన ఓ గ్రామానికి ప్రచారానికి వెళ్లగా.. అక్కడ ఒక్కరు లేకున్నా.. కనీసం కార్యకర్తలు కూడా లేకున్నా.. తనకు ఓటేయాలని గోడలకు చెబుతూ ప్రచారం చేసిన వీడియో నెట్టింట హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో పాటు వర్గపోరుతో సొంత క్యాడర్ సహకరించకపోవడం.. ఆయనకు ప్రతికూల అంశాలుగా మారాయి. చదవండి: టీడీపీ అభ్యర్థికి వింత పరిస్థితి! -
టీడీపీలో వీడని సస్పెన్స్
సాక్షి , ఏలూరు : తెలుగుదేశం పార్టీ పెండింగ్‌లో పెట్టిన నాలుగు సీట్లపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఆ నాలుగు కూడా సిట్టింగ్‌లనే ఖరారు చేసే అవకాశం ఉందన్న ప్రచారం నడుస్తోంది. మరోవైపు అసలు అభ్యర్థిని ప్రకటించకుండానే ఉంగుటూరులో ఆదివారం తెలు గుదేశం పార్టీ ఎన్నికల సభ నిర్వహిస్తోంది. అయితే ఏర్పాట్లన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులే దగ్గరుండి చేస్తున్నారు. అర్ధరాత్రికి అయినా తన పేరు ఖరారు చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ఆదివారం ఉదయం ప్రకటించనుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయ నుంచి ఈ జాబితాను విడుదల చేస్తారు. శనివారమే జాబితా ఇవ్వాల్సి ఉన్నా వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో జాబితా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎంపీఅభ్యర్థులను కూడా ఆదివారం ప్రకటించనున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లాలో దాదాపుగా అందరు సిట్టింగ్‌లను ప్రకటించినా ఒక్క చింతలపూడిలో మాత్రమే కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. పీతల సుజాతకు సీటు రాకుండా ఎంపీ మాగంటి బాబు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాగా లాబీయింగ్ చేశారు. కేవలం కమ్మ సామాజికవర్గం పెత్తనాన్ని ఎదిరించినందుకే పీతల సుజాతకు సీటు లేకుండా చేశారని దళిత వర్గాలు మండిపడుతున్నాయి. ఆమెకు సీటు ఇవ్వకుండా అవమానించడంపై ఆమె సామాజిక వర్గం నేతలు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో చివరి వరకూ వేచి ఉండి ఎక్కడా సుజాతకు స్థానం కల్పించకపోతే పార్టీ నుంచి బయటకు రావాలని దళిత నేతలు భావిస్తున్నారు. నిడదవోలులో అన్నదమ్ములు పోటీ పడుతుండటంతో ఎవరికి ఇవ్వాలో మీరే తేల్చుకోండని చంద్రబాబునాయుడు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గకపోతే మూడో వ్యక్తికి సీటు ఇస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం. సొంత అన్న కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును వ్యతిరేకిస్తుం డడంతో నిడదవోలులో రచ్చ కొనసాగుతోంది. నరసాపురంలో సీటు తమకే దక్కుతుందని కొత్తపల్లి సుబ్బారాయుడి వర్గం ధీమాగా ఉంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవనాయుడి వర్గంలో ఆందోళన నెలకొంది. అయినా సీఎం తనకే హామీ ఇచ్చారన్న ధీమాతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. పోలవరంలో కూడా మొడియం శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గంలోని అభ్యర్థులపై ఐవీఆర్ఎస్ సర్వేలో వారికి సానుకూలంగా రాకపోవడంతో సిట్టింగ్ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రి జవహర్ తనకు కొవ్వూరులో సీటు రాకుండా అడ్డంపడ్డ నేతలపై విరుచుకుపడ్డారు. వారు ఎంత కుటిల రాజకీయాలు చేసినా తనకు సీటు రాకుండా అడ్డుకోలేకపోయారని, తనపై నమ్మకం ఉంచిన చంద్రబాబునాయుడు తిరువూరు సీటు ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే అక్కడ గెలుపు అంత ఈజీ కాకపోవడంతో మంత్రి వర్గం ఆందోళన చెందుతోంది. ఇంకో వైపు జనసేనలో కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే యర్రా నవీన్ బయటకు వెళ్లిపోగా తాజాగా ఏలూరులో జనసేన నేత సాగర్‌బాబు కూడా పార్టీని వీడి బయటకు వచ్చారు. జనసేన సిద్ధాంతాలకు భిన్నంగా నాలుగుపార్టీలు మారిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. -
టీడీపీలో సీటు.. మస్తు హీటు
సాక్షి , ఏలూరు : జిల్లాలో 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మిగిలిన నాలుగు సీట్లను పెండింగ్‌లో పెట్టడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తీవ్రమైన టెన్షన్ నెలకొంది. నరసాపురంలో మాధవనాయుడు, ఉంగుటూరులో గన్ని వీరాంజనేయులును తొలుత ఖరారు చేశారు. అయితే చివరి నిమిషంలో కొత్తపల్లి సుబ్బారాయుడు, జెడ్పీ చైర్మన్ బాపిరాజు కోసం ఆ సీట్లు ఆపడం వివాదంగా మారింది. పోలవరం, నిడదవోలులో అసమ్మతి తలనొప్పిలతో నిలిపివేశారు. నరసాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పేరు ముందు ఖరారు చేశారు. అయితే ఆ తర్వాత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టిక్కెట్ తనకే వస్తుందని ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తపల్లి మంత్రాంగం ఫలించిందన్న వాదన వినిపిస్తోంది. దీంతో మాధవనాయుడు వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే సీటు ఖరారు అయ్యిందన్న భావనతో ప్రచారం మొదలుపెట్టిన మాధవనాయుడికి సీటు పెండింగ్‌లో పెట్టడంతో టెన్షన్ మొదలైంది. శుక్రవారం మాధవనాయుడు కుటుంబం అంతా ప్రచారంలో పాల్గొంది. ఉంగుటూరు సీటు గన్ని వీరాంజనేయులకే ఖరారు అయ్యిందని, అయితే బాపిరాజును బుజ్జగించేందుకు, ఈ సీటు ఇస్తారన్న ఆశ కల్పించేందుకు మొదటిలిస్ట్లో ఈ పేరు ఇవ్వలేదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే గన్ని వీరాంజనేయులు నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సీటు ప్రకటించకపోవడంతో గన్ని వర్గం ఆందోళన చెందుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సుజాతపై ఒత్తిడి మరోవైపు చింతలపూడిలో సిట్టింగ్ ఎమ్మెల్యే పీతల సుజాతకు సీటు ఇవ్వకపోవడంపై ఆ వర్గం మండిపడుతోంది. కష్టపడి పనిచేసిన పీతల సుజాతకు అన్యాయం జరిగిందంటూ ఏలూరు క్యాంప్ ఆఫీస్‌లో సుజాత వర్గం నాయకులు, కార్యకర్తలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సీటు ఆశించి భంగపడిన సొంగ రోషన్‌కుమార్ కూడా హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో మాత్రమే చంద్రబాబునాయుడు వారిని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సుజాతపై ఒత్తిడి చేశారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుందామని, తొందరపడవద్దని పీతల సుజాత నచ్చచెప్పినట్లు సమాచారం. ఇప్పటికే సీటు ఖరారు అయిన భీమవరంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంజిబాబు గెలిచిన తర్వాత పార్టీ సీనియర్లను పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయని, మళ్లీ ఆయనకే సీటు ఇవ్వడంతో పలువురు పార్టీని వీడేందుకు సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు పీతల సుజాతకు సీటు రాకపోవడం వల్ల ఆ ప్రభావం భీమవరంపై పడే అవకాశం కనపడుతోంది. పీతలది వీరవాసరం మండలం కావడం, సుజాతను ఒక సామాజికవర్గం నేతలు కుల రాజకీయాలతో ఇబ్బంది పెట్టారన్న భావనతో ఇక్కడి దళితులు ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు సీటు వస్తుందన్న ఆశతో బీజేపీ నుంచి జనసేనలోకి చేరిన మొడియం శ్రీనివాస్ మళ్లీ తిరుగుటపాలో బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. నాలుగేళ్లపాటు భారతీయ జనతాపార్టీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్‌గా పనిచేసిన మొడియం శ్రీనివాసరావు సీటు ఇస్తామన్న హామీతో జనసేనలో చేరారు. అయితే అక్కడ డబ్బులు ఎంత ఖర్చు పెడతారంటూ డిమాండ్లు పెట్టడంతో వెనక్కి వచ్చేశారు. ఇప్పటికే జిల్లాలో జనసేనకు యర్రా నవీన్ రాజీనామా చేయగా పలువురు నేతలు జనసేనను వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. -
ఒకే ఒరలో రెండు కత్తులు
సాక్షి,పశ్చిమ గోదావరి : రాజకీయాలలో బద్ధశత్రువులు, మిత్రులు ఉండరంటారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిన్నటి వరకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ ఒకే కారులో రాజధాని అమరావతికి పయనమయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఇప్పటికి పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు, శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు ఒక్కమారు కూడా సమయానికి రాని ఎమ్మెల్యే పీతల సుజాత వట్లూరు గేటు వద్ద తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళికి స్వాగతం పలకడానికి ముందే సిద్ధంగా ఉండటంతో ఆ పార్టీ నేతలే అవ్వాక్కయారంట. ప్రస్తుతం వారిద్దరూ ఒకే కారులో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా పీతల వర్గీయులందరినీ ఈ కార్యక్రమానికి సమాయత్తం చేయడంతోపాటు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి 40 కార్లలో ఆమె అనుచరులు హాజరవడం చర్చనీయాంశమైంది. అంతా పాత నీరే కొత్త నీరు స్వల్పం చింతలపూడి నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ సోమవారం అమరావతి వెళ్లి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే కామవరపుకోట మండలం నుంచి వెళ్ళిన వారందరూ అధిక శాతం ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్న నాయకులు, కార్యకర్తలే. వెళ్లిన వారిలో కొత్తగా మురళీ అనుచరగణంగా చెప్పుకునే స్థాయికల నాయకులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఎమ్మెల్యే సుజాత వర్గీయులుగా ఉన్న కామవరపుకోట, చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల ఎంపీపీలతో పాటు వారి అనుచరగణం మొత్తాన్ని ఈ సమావేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఎన్నికల నియమావళి ఉందా? లేదా? చింతలపూడి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కామవరపుకోట ఆర్అండ్బీ బంగ్లా దగ్గర నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులతో సుమారు 100 కార్లలో ర్యాలీగా అమరావతికి తరలివెళ్లారు. వీటిలో 30 నుంచి 40 కార్ల వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన జెండాలతో ర్యాలీగా వెళ్ళాయి. ప్రతీ కారుకూ ఓ స్టిక్కరు ఉంది. ఎన్నికల నియమావళి నేపథ్యంలో జెండాలు, స్టిక్కర్లు, ర్యాలీకి ఎటువంటి అనుమతి తీసుకోలేదని స్థానిక తహసీల్దార్ శ్రీ పల్లవి, ఎంపిడీఓ జె మన్మథరావు తెలిపారు. తాము ఏలూరు కలెక్టరేట్లో జరుగుతున్న ఎన్నికల సమావేశానికి వెళ్లినట్టు వివరించారు. -
‘లెక్క’లేదు
ఆస్తుల వివరాలు వెల్లడించని ఎమ్మెల్యేలే అధికం ఇద్దరు మంత్రులదీ అదే తీరు వివరాలు ఇవ్వని వారిలో ప్రభుత్వ విప్ చింతమనేని సహా 10 మంది ఏలూరు : శాసనసభలో జిల్లా సమస్యలను ప్రస్తావించడంలోను.. అభివృద్ధికి దోహదపడే చర్చల్లోనూ నోరుమెదపని జిల్లాలోని ప్రజాప్రతినిధు లు తమ ఆస్తుల వివరాలను వెల్లడించే విషయంలోనూ వెనుకబడే ఉన్నారు. వైఎస్సార్ సీపీ నేతలపై అడ్డగోలుగా విరుచుకుపడే ఎమ్మెల్యేల్లో చాలామంది తమ ఆస్తుల వివరాలను మాత్రం ఇంతవరకు శాసనసభకు సమర్పించలేదు. ప్రస్తుత శాసనసభ కొలువుదీరి 20నెలలు కావస్తున్నా మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సహా జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేలు ఆస్తుల లెక్కలను శాసన సభకు ఇవ్వలేదు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తాజాగా వెల్లడించిన జాబితాలో ఆస్తుల వివరాలు ప్రకటించిన వారిలో మన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఐదుగురు మాత్రమే ఉన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఆస్తుల వివరాలను శాసన సభకు సమర్పించారు. -
మంత్రి పీతల సుజాతపై రోజా ఫైర్
ఏలూరు(పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజీగూడెం సభలో మంత్రి పీతల సుజాతపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. వడ్డాణాలు, డబ్బులపై ఉన్న ఆసక్తి పీతల సుజాతకు ప్రజా సమస్యలపై లేదని ఆమె విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కరవు రహిత రాష్ట్రంగా మారేది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనేనని రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కరవు దాపరిస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ హయాంలో ప్రతి ఇంటా సౌభాగ్యంగా ఉందని కొనియాడారు. నేడు చంద్రబాబు హయాంలో దౌర్బాగ్యంగా ఉందని దుయ్యబట్టారు. పీతల సుజాతకు చంద్రబాబు భజన చేయడం తప్ప నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి లేదని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. -
ఇసుక ‘డ్వాక్రా’ది, తైలం ‘తమ్ముళ్ల’ది
ఇసుక దందాలో తెలుగుదేశం శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ పతా కశీర్షికను సంపాదించుకున్నారు. ఎం దరో తెలుగు తమ్ముళ్లకూ ఇది దక్కాల్సింది, ఆయన ముందుగా దక్కించు కున్నారు. తనది దుందుడుకు స్వభా వమని తానే ప్రకటించుకున్నారు. ప్రతిపక్షంలో ఉంటే దుందుడుకుత నాన్ని ప్రజలు కొంతమేరకైనా ఆమో దిస్తారేమో కాని, అధికారపక్షంలో అధికార దుర్మదాంధతగా ఈసడించుకుంటారు. విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా రెవెన్యూ అధికారిని దుర్భాషలాడి, మహిళలతో కొట్టించే దాష్టీకం పోలీసుల సమక్షంలో జరగడం కంటే ప్రజాస్వామ్యానికి దుర్ది నం మరొకటి ఉండదు. మానవహక్కుల కమిషన్ తన స్వతంత్ర ప్రతిపత్తిని ప్రకటించుకుంది. తనంతట తానుగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించింది. ప్రజాస్వామ్య విలువలకు వన్నె తెచ్చింది. ఇతర ఉన్నతాధికార వ్యవస్థలను సంజాయిషీ ఇచ్చుకునేలా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రేవంతరెడ్డి, చింతమనేని ప్రభాకర్, పీతల సుజాత వైగైరా అస్మదీయుల జాబితా ఉంది. సుజాత కేసు విచారణ దశలోనే ఆగి ఉంది. ఇప్పుడు ప్రభాకర్ కేసుకు పోటీగా రెవిన్యూ అధికారిణి మీద ఎదురు కేసులు పెట్టి ఉంచారు. ఏమి జరుగుతుందో ఊహిం చుకోవచ్చు. అసలు కథలోకి వద్దాం. రాష్ర్టంలో ఇసుక దందాలో చింత మనేని ప్రభాకర్ ఉదంతం సముద్రంలో మంచు కొండలాంటిది. కొండ కొన మాత్రమే మనకి కనిపించింది. కుంభకోణం కొండ లోపలే తన పని చే సుకుపోతున్నది. 2014 ఆగస్ట్‌లో చంద్రబాబు కొత్త ఇసుక పాలసీని ప్రకటించారు. ఇసుక అమ్మ కాలలో దళారులను లేకుండా చేస్తున్నట్టు, డ్వాక్రా గ్రూపులకే ఇసుక రీచ్‌లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. దీనితో విని యోగదారులకు చౌకగా ఇసుక, డ్వాక్రా మహిళలకు లాభాలలో 25%శాతం వాటా దక్కుతాయని ప్రచారం చేశారు. అమలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఈ కొత్త ఇసుక పథకం అమలు కోసం రాష్ర్టంలో 353 ఇసుక రీచ్‌లను గుర్తించారు. వీటిని మహిళా సంఘాలకు కేటా యించడానికి జిల్లాస్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసి 343 రీచ్ లను మహిళా గ్రూపులకు అప్పగించారు. 10 రీచ్‌లకు ఎవరూ రాక తవ్వకాలు జరగడం లేదు. డ్వాక్రా మహిళా సంఘాల సమన్వయ కర్తగా ఉన్న సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీకి అజమాయిషీ బాధ్యతలు అప్పగించారు. మొదటి అంశం. ఆంధ్రప్రదేశ్‌లో లభ్యమయ్యే మొత్తం ఇసుక మీద గుత్తాధిపత్యం ఈ మహిళా సంఘాలకే ఉంది. అలాంటప్పుడు వ్రైవేట్ మార్కెట్లో ఇసుక లభించకూడదు. కాని లభిస్త్తున్నది. ఇదెక్కడిది? ఈ 343 మహిళా సంఘాల రీచ్‌ల నుండి అక్రమంగా తరలించినదే కాని మరెక్కడ నుండో ఎగిరి వచ్చే అవకాశం లేదు. రెండవ అంశం. ఇసుక ధరలకు రెక్కలెందుకు వచ్చాయి? ప్రభుత్వం ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు పెట్టాల్సిన ఖర్చులను వినియోగించే యంత్రాలు, కూలీలను బట్టి క్యూబిక్ మీటర్‌కు రూ. 157 నుండి 177 లుగాను, పూర్తిగా కూలీలే తవ్వితే రూ.211 గాను నిర్ణయించింది. దీనిని ఒడ్డుకు చేర్చడానికి రవాణా ఛార్జీ అదనం అని ప్రకటించింది. కేవలం కూలీలతోనే తవ్వే రీచ్‌లు దాదాపుగా లేవు. రీచ్‌ల దగ్గరే అమ్మకాలు చేస్తు న్నందున కొనుగోలుదారే లోపలి నుండే ఎగుమతి చేసు కుంటారు. గనుక అక్కడ రవాణా ఛార్జీలు ఉండవు. అయినా ప్రభుత్వం క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.650గా నిర్ణయిం చింది. ప్రతి లారీ మీద దాదాపు 4000 రూపాయలను ప్రభు త్వం దండుకొంటున్నది. ఇలా మధ్యతరగతి ప్రజల స్వంత ఇంటి కల మీద ప్రభుత్వమే ఇసుక పిడుగు వేసింది. మరో పక్క ప్రైవేటు ఇసుక దందా యథేచ్ఛగా సాగుతు న్నది. జిల్లాల పత్రికలు తిరగేస్తే అన్ని జిల్లాలలోను ఇసుక దందా వార్తలు ఏదో మూల దర్శన మిస్తూనే ఉన్నాయి. చాలా మంది శాసనసభ్యుల సారధ్యంలో, వారి అనుచరగణాల ఆధ్వ ర్యంలో ఇసుక అక్రమ వ్యాపారం సాగిపోతున్నది. రీచ్‌లలో తాత్కాలికంగా తవ్వకాలు ఆపించి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలు రాబడుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్క రించి తవ్వకాలు సాగిస్త్తున్నారు. ఇసుక పధకం డ్వాక్రా మహి ళలకి -తైలం తెలుగు తమ్ముళ్లకి అన్న చందంగా కనిపిస్తున్నది. ఈ పధకం ఉద్దేశ్యమే అది అయినట్లు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి నట్లు ఉంది. ఇక చింతమనేని కథ కంచికి చేరకుండా ఉం టుందా? (వ్యాసకర్త అధ్యక్షులు-ఏపీ లోక్‌సత్తా పార్టీ) మొబైల్: 98660 74023 - డీవీవీఎస్ వర్మ -
మంత్రి పీతల సుజాతపై చంద్రబాబు మండిపాటు
ఏలూరు : బ్యాగ్‌లో నోట్ల కట్టల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడినట్టు తెలిసింది. గురువారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా తణుకు మండలం వేల్పూరులో జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన్మభూమి సభలో మంత్రి సుజాతను చంద్రబాబు పలకరించకుండా వెళ్లిపోయినట్టు తెలిసింది. బ్యాగ్‌లో నోట్ల కట్టల వ్యవహారంలోమంత్రి పీతల సుజాత ఇంటి ఆవరణలో రూ.10 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అనంతరం మంత్రి సుజాత తండ్రి ఆచూకీ లేకుండా పోయినట్టు సమాచారం. -
స్త్రీ, శిశు సంక్షేమానికి ప్రాధాన్యం
గర్భిణులకు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం అధికారులకు మంత్రి పీతల సుజాత ఆదేశాలు విశాఖ రూరల్: వచ్చే ఏడాదికల్లా మాతా, శిశు మరణాలు పూర్తి స్థాయిలో తగ్గేలా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖమంత్రి పీతల సుజాత ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమం, గనులు, భూగర్భ వనరుల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, ఎమ్మెల్యేలు పీలా గోవింద సత్యనారాయణ, వంగలపూడి అనిత ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుజాత మాట్లాడుతూ స్త్రీ, శిశు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వ అందిస్తున్న పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందేలా అధికారులు శ్రద్ధ చూపాలని సూచించారు. మాతా, శిశు మరణాలు తగ్గించాలన్న లక్ష్యంతో నిరుపేదలకు అంగ న్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అయితే సరఫరాలో పలు అక్రమాలు జరుగుతున్నట్టు తనకు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. కేంద్రాల్లో మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలు, శిశువులకు నాణ్యమైన పోషకాహారాన్ని సరఫరా చేయాలని, సరఫరాలో ఎలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అంగన్వాడీలకు భవనాలు: మంత్రి అయ్యన్న మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద అంగన్వాడీ భవనాలు మంజూరు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం అక్టోబర్ 2 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్విహంచనున్నట్లు తెలిపారు. ఇందులోభాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలకు అవసరమైన మరుగుదొడ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. 2500 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవని, 1700 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఏజేసీ వై.నరసింహారావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ పి.అనసూయ, పీడీ ఎ.ఇ.రాబర్ట్స్, ఏపీడీ చిన్మయిదేవి తదితరులు పాల్గొన్నారు. -
మన మంత్రులకు ఎన్ని మార్కులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ర్ట మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు సర్వే చేయించిన నేపథ్యంలో మన జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు ఎన్ని మార్కులు వచ్చాయనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్’ అన్న ఆంగ్ల నానుడి ప్రకారం చూస్తే.. తొలి రెండు నెలల పాలనలో మంత్రుల వ్యవహార శైలిపై వెల్లడైన అభిప్రాయమే భవిష్యత్‌లో వారి పనితీరుకు మరింత పదును పెట్టేందుకు దోహదం చేస్తుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ నేపథ్యంలో తొలినాళ్ల పనితీరుపై మన జిల్లాకు చెందిన మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాల రావులకు సీఎం ఎన్ని మార్కులు వేశారనేది చర్చంశనీయమైంది. సర్వే ఫలి తాల్లో మధ్య ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రులకు 30.2 శాతంతో సంతృప్తికర మార్కులు రాగా, 51శాతం ఓకే అని, 18.8 శాతం బాగోలేదని తేలింది. ఆ బాగున్న శాతంలో మన జిల్లా మంత్రుల వాటా ఎంత, బాగోలేదని తేలినదాంట్లో మన వాళ్ల శాతం ఎంత అనేదానిపై ఎవరి వద్దా స్పష్టమైన సమాచారం లేదు. టీడీపీ, బీజేపీ వర్గాలు మాత్రం ఎవరికి వారు తమ మంత్రి పనితీరు బాగుందని బాబు మెచ్చుకున్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మాణిక్యం చేసిన ప్రతిపాదనలన్నిటికీ ఓకే దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పని తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తికరంగా ఉన్నారని భారతీయ జనతాపార్టీ వర్గాలతోపాటు టీడీపీ శ్రేణులూ వాదిస్తున్నాయి. హడావుడి లేకుండా.. వివాదాలకు పోకుండా తన పనితాను చేసుకుపోయే మాణిక్యాలరావు వ్యవహార శైలిని మొదటి నుంచీ గమనిస్తున్న బాబు ఆయనకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారని అంటున్నారు. తిరుమలలో సిఫార్సు లేఖల రహిత దర్శనానికి శ్రీకారం చుట్టాలన్న మంత్రి ప్రతిపాదన కష్టసాధ్యమైనప్పటికీ టీడీడీ ఉన్నతాధికారులను చంద్రబాబు హైదరాబాద్ పిలిపించుకుని మరీ విధివిధానాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. గోదావరి జలాలను విజ్జేశ్వరం నుంచి తాడేపల్లిగూడెంకు తరలించేందుకు మంత్రి ప్రతిపాదించిన రూ.129 కోట్ల ప్రాజెక్టుకు కూడా సీఎం సానుకూలంగా స్పందించారు. ఇక తాడేపల్లిగూడెం పట్టణంలోని మురుగునీటిని అవుట్లెట్ల ద్వారా బయటకు పంపేం దుకు రూ.54కోట్లతో ప్రతిపాదించిన ప్రాజెక్టుకు కూడా సీఎం అంగీకారం తెలిపారు. విమానాశ్రయ భూముల్లో దీర్ఘకాలికంగా నివాసముం టున్న 2,557 కుటుంబాలకు శాశ్వత ఇంటిస్థల పట్టాలు ఇవ్వాలన్న మంత్రి సూచనపై కూడా సీఎం సానుకూలంగా స్పం దించి సర్వే చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ లెక్కన చూస్తే తమ మంత్రి పనితీరుపై బాబు సంతృప్తికరంగానే ఉన్నారని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సుజాత మాటేమిటి ఇక జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఏకైక మంత్రి పీతల సుజాత పనితీరుపై చంద్రబాబు ఏం తేల్చారన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దళిత మహిళామంత్రిగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ పార్టీ వర్గాలు తనకు పూర్తిస్థాయిలో సహకరించడం లేదని సుజాత భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెను తొలిసారిగా మంత్రివర్గంలో తీసుకుని, కీలకమైన శాఖలు కట్టబెట్టడంతో ఉత్సాహంగా పనిచేస్తున్నా పార్టీ శ్రేణులపరంగా ఆమెకు సరైన సహకారం అందడం లేదని అంటున్నారు. గనులు, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖల పనితీరుపై ఎక్కడా నెగెటివ్ మార్కు పడలేదని, తమ మంత్రి సుజాత తీరుపై చంద్రబాబు సంతృప్తిగానే ఉన్నారని ఆమె వర్గీయులు చెప్పుకుంటున్నారు. అయితే సహచర మంత్రి మాణిక్యాలరావు మాదిరి కనీసం ఆమె సొంత నియోజకవర్గమైన చింతలపూడి అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టుకూ ఇంతవరకు సానుకూల ప్రకటన రాలేదంటున్న వారూ లేకపోలేదు. మంత్రిగా ముందు నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసేవిధంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని సూచిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చే మార్కులు ఎలా ఉన్నా మొత్తంగా జిల్లా అభివృద్ధిపై సచివుల ‘మార్కు’ ఇంకా పడలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. -
అబ్బాయ్గారి అబ్బాయికి మొండిచేయి
పాలకొల్లు: అసెంబ్లీ టిక్కెట్ ఆశించిన పలువురు టీడీపీ సీనియర్ నాయకులకు పార్టీ నాయకత్వం మొండిచేయి చూపింది. పశ్చమగోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ నేత సిహెచ్ సత్యనారాయణమూర్తి(బాబ్జీ)కి టిక్కెట్ నిరాకరించింది. తనకే టిక్కెట్ వస్తుందన్న నమ్మకంతో బాబ్జీ ఇప్పటికే నామినేషన్ వేశారు. మీకే టికెట్ అంటూ చెప్పిన చంద్రబాబు చివరకు ఆయనకు హ్యాండ్ ఇచ్చారు. చివరి నిమిషంలో నిమ్మల రామానాయుడికి సీటు కేటాయించి బాబ్జీకి షాక్ ఇచ్చారు. మంచి హస్తవాసి గల వైద్యునిగా పేరున్న బాబ్జీని స్థానికంగా అబ్బాయ్గారి అబ్బాయి అని పిలుస్తుంటారు. చింతలపూడి స్థానాన్ని ఆశించిన కర్రా రాజారావు, కొయ్యే మోషేన్‌రాజు, జయరాజులకు కూడా చంద్రబాబు రిక్తహస్తం చూపించారు. స్థానికేతురాలైన పీతల సుజాతకు టికెట్ కేటాయించి తనదైన రాజకీయం ప్రదర్శించారు చంద్రబాబు. పీతల సుజాత గతంలో ఆచంట ఎమ్మెల్యేగా పనిచేశారు. కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావుకూ చంద్రబాబు షాక్ ఇచ్చారు. కొవ్వూరు టిక్కెట్‌ను మోచర్ల జవహార్వతికి కేటాయించారు.