సాక్షి, జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి) : ఎన్నికలకు పట్టుమని పదిరోజులు లేవు.. పచ్చతమ్ముళ్లేమో వర్గపోరుతో కుమ్ములాడుకుంటున్నారు. దీంతో జంగారెడ్డిగూడెంలో మంగళవారం జరిగిన టీడీపీ ఆర్యవైశ్య సభ రసాభసగా మారింది. మాజీమంత్రి పీతల సుజాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ వ్యాఖ్యానించడంతో చింతలపూడి నియోజకవర్గ టీడీపీలోవర్గపోరు భగ్గుమంది. మంత్రిగా ఉండి సూజాత నియోజకవర్గంలో చేసిందేమి లేదని, అభివృద్ధి శూన్యమని అంబికా కృష్ణ ఘాటుగా వ్యాఖ్యనించారు. దీంతో సుజాత వర్గం ఎదురు దాడికి దిగింది. రూ.100ల కోట్ల నిధులు ఏమయ్యాయో చెప్పాలని ఒకరికొకరు నిందించుకున్నారు.
దీంతో కార్యకర్తల మధ్య తోపులాటతో వాగ్విదాం చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో నియోజకవర్గం అభివృద్ధి లేదంటూ సొంతపార్టీ నేతలే ఆరోపిస్తే ప్రచారానికి ఎలా వెళ్లాలంటు అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు. పార్టీ పరువును రోడ్డున పడేసారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంతో చింతలపూడి టీడీపీ అభ్యర్ధి కర్రా రాజారావుకు ఓటమి తప్పదని తెలుస్తోంది. ఇటీవలే ఆయన ఓ గ్రామానికి ప్రచారానికి వెళ్లగా.. అక్కడ ఒక్కరు లేకున్నా.. కనీసం కార్యకర్తలు కూడా లేకున్నా.. తనకు ఓటేయాలని గోడలకు చెబుతూ ప్రచారం చేసిన వీడియో నెట్టింట హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో పాటు వర్గపోరుతో సొంత క్యాడర్ సహకరించకపోవడం.. ఆయనకు ప్రతికూల అంశాలుగా మారాయి.
చదవండి: టీడీపీ అభ్యర్థికి వింత పరిస్థితి!
Comments
Please login to add a commentAdd a comment