మంత్రి పీతల సుజాతపై చంద్రబాబు మండిపాటు | Chandrababu naidu takes on Minister pitala sujatha | Sakshi
Sakshi News home page

మంత్రి పీతల సుజాతపై చంద్రబాబు మండిపాటు

Published Thu, Jun 4 2015 7:06 PM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

మంత్రి పీతల సుజాతపై చంద్రబాబు మండిపాటు

మంత్రి పీతల సుజాతపై చంద్రబాబు మండిపాటు

ఏలూరు : బ్యాగ్లో నోట్ల కట్టల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడినట్టు తెలిసింది. గురువారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా తణుకు మండలం వేల్పూరులో జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన్మభూమి సభలో మంత్రి సుజాతను చంద్రబాబు పలకరించకుండా వెళ్లిపోయినట్టు తెలిసింది.

బ్యాగ్లో నోట్ల కట్టల వ్యవహారంలోమంత్రి పీతల సుజాత ఇంటి ఆవరణలో రూ.10 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అనంతరం మంత్రి సుజాత తండ్రి ఆచూకీ లేకుండా పోయినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement