మంత్రి పీతల సుజాతపై రోజా ఫైర్‌ | MLA Roja slams minister pitala sujatha | Sakshi
Sakshi News home page

మంత్రి పీతల సుజాతపై రోజా ఫైర్‌

Published Mon, Jan 11 2016 12:30 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

మంత్రి పీతల సుజాతపై రోజా ఫైర్‌ - Sakshi

మంత్రి పీతల సుజాతపై రోజా ఫైర్‌

ఏలూరు(పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజీగూడెం సభలో మంత్రి పీతల సుజాతపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. వడ్డాణాలు, డబ్బులపై ఉన్న ఆసక్తి పీతల సుజాతకు ప్రజా సమస్యలపై లేదని ఆమె విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ కరవు రహిత రాష్ట్రంగా మారేది వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డితోనేనని రోజా అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కరవు దాపరిస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌ హయాంలో ప్రతి ఇంటా సౌభాగ్యంగా ఉందని కొనియాడారు. నేడు చంద్రబాబు హయాంలో దౌర్బాగ్యంగా ఉందని దుయ్యబట్టారు. పీతల సుజాతకు చంద్రబాబు భజన చేయడం తప్ప నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి లేదని ఎమ్మెల్యే రోజా విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement