janmabhumi programme
-
తిన్నది ఎవరో తెలవడం లేదు..?
సాక్షి, రామభద్రపురం(విజయనగరం) : మండలంలో టీడీపీ ప్రభుత్వం ప్రచార యావతో నిర్వహించిన జన్మభూమి సభల నిర్వహణ నిధులు ఇటీవలే విడుదలయ్యాయి. కానీ వాటిని ఇప్పటికీ పంచాయతీలకు పంపిణీ చేయలేదు. ఆ నిధుల ఖర్చులో మండల పంచాయతీ అధికారి చేతివాటం చూపినందునే పంపిణీ జరగలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. టీడీపీ ప్రభుత్వం 2019 జనవరి 2 నుంచి 11 వరకు జన్మభూమి సభలు నిర్వహించింది. అప్పట్లో దీనికోసం నిధులు వెంటనే ఇవ్వలేదు. దాంతో పంచాయతీ కార్యదర్శులే చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో కార్యదర్శుల పైనే ఈ భారం పడింది. ప్రతీ గ్రామంలో సభ కోసం 3 షామియానాలు, 500 కుర్చీలు, బల్లలు, వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు, స్నాక్స్, కూల్‌డ్రింక్స్, సభ నిర్వహణపై ముందురోజు ఆటోలతో ప్రచారం, వైద్య శిబిరాలు ఉన్న చోట వాటికి ప్రత్యేకంగా షామియానాల ఏర్పాటు.. ఇలా ఒక సభ నిర్వహణకు తడిసిమోపెడు ఖర్చులయ్యాయి. ఇవన్నీ అయ్యాక అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు భోజనాలకు అదనంగా మరింత ఖర్చు అయింది. సభకు రూ.20 నుంచి రూ.25వేల వరకు ఖర్చు.. సభల నిర్వహణ కోసం ఒక్కోదానికి సుమారు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు అయినట్లు కార్యదర్శులు చెబుతున్నారు. కానీ అప్పటి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఇటీవల పంచాయతీకి రూ.5వేల చొప్పున 22 పంచాయతీలకు రూ.1.10 లక్షలు విడుదల చేసినట్లు పంచాయతీ అధికారి రికార్డుల్లో నమోదు చేసినట్లు ఉంది. కానీ ఒక్క రూపాయి కూడా మాకు అందలేదని కార్యదర్శులు చెబుతున్నారు. వాటి కోసం ఎంపీడీఓను కార్యదర్శులు అడగ్గా ఆయన ఈఓపీఆర్డీకి చెక్ రాసి ఇచ్చానని, ఆయన్నే ఆడగాలని సూచించారు. ఈఓపీఆర్డీని అడగ్గా పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు కార్యదర్శులు చెబుతున్నారు. ఈఓపీఆర్డీ చేతివాటం చూపినట్లు కార్యదర్శులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
దిమాక్ థోడా.. చాలా తేడా!
రాష్ట్రంలోని ఎమ్మెల్యేలలో 174 మంది ఒక ఎత్తు.. నందమూరి బాలకృష్ణ ఒక ఎత్తు! అన్ని నియోజక వర్గాలది ఒక తీరు... హిందూపురం మరో తీరు! హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ‘పైసా వసూల్’ సినిమాలో చెప్పినట్లుగానే ‘దిమాక్ థోడా.. చాలా తేడా!’ తరహాలో వ్యవహరిస్తారనే విమర్శలున్నాయి. ఆయనకు నియోజకవర్గంతో పనిలేదు. ప్రజల బాగోగుల సంగతి సరేసరి. సినిమాలో ‘గెస్ట్ ఆర్టిస్ట్’లా కేవలం మూడు నిమిషాలు వచ్చి పోయినట్లుగా ఎమ్మెల్యేగా ఐదేళ్లలో ఏటా రెండు మూడుసార్లు మాత్రమే ఆయన హిందూపురానికి వచ్చారు. అదికూడా మూడు రోజులకు మించి ఉండరు. అత్యంత ముఖ్యమైన నేతలు, సన్నిహితులు మినహా టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలకు కనీసం దర్శనం కూడా ఉండదు. పార్టీకి సంబంధించిన ఇబ్బందులైనా, ప్రజా సమస్యలైనా బాలయ్య పీఏలను సంప్రదించాల్సిందే. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం మొదలైంది. పోలింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే గడువు ఉంది. కానీ ఇప్పటివరకు బాలయ్య హిందూపురంలో అడుగుపెట్టకపోవడం గమనార్హం. హిందూపురంలో పీఏల సామ్రాజ్యం.. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించిన హిందూపురం నుంచి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ కుమారుడు కావడం, తొలిసారి ఎన్నికల బరిలో ఉండటంతో నియోజకవర్గ ఓటర్లు ఆయన్ను ఆదరించి గెలిపించారు. బాలయ్య కుటుంబ సమేతంగా ప్రచారం చేస్తే 16,196 ఓట్లతో విజయం సాధించారు. ఎన్నికల సమయంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కుటుంబ సమేతంగా వచ్చి పాలు పొంగించి గృహ ప్రవేశం చేశారు. ఫలితాలు వెలువడ్డాక ఇంటిల్లిపాది హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయారు. ఆ ఇంటిని పీఏలకు అప్పగించి నియోజకవర్గాన్ని మరిచిపోయారు. చిత్తూరు జిల్లాకు చెందిన బాలయ్య పీఏ శేఖర్ ‘షాడో ఎమ్మెల్యే’ మాదిరిగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, చివరకు జన్మభూమి సభలు కూడా అతని ఆధ్వర్యంలోనే నడిచాయి. అధికారులు కూడా శేఖర్‌నే ఎమ్మెల్యేగా భావించి ఆయన ఆదేశాలను పాటించారు. అతను హెచ్చరిస్తే జంకారు. పొగిడితే సంబరపడిపోయారు. ఇలా మూడేళ్ల పాటు శేఖర్ హల్చల్ చేశాడు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తారాస్థాయిలో అవినీతికి పాల్పడ్డాడు. నియోజకవర్గ నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడంతో చివరకు అతడిని తప్పించి గుంటూరు జిల్లా యడ్లపాడుకు చెందిన వీరయ్యను పీఏగా నియమించారు. ఇదే నియోజక వర్గానికి చెందిన తిమ్మాపురం మాజీ సర్పంచ్ శ్రీనివాసరావును మరో పీఏగా నియమించారు. చివరి రెండేళ్లు వీరే ఎమ్మెల్యే మాదిరిగా వ్యవహరించారు. బాలకృష్ణ ఈ ఐదేళ్లలో జన్మభూమి కార్యక్రమానికి ఒక్కరోజు కూడా హాజరు కాలేదు. పనితీరు ఆధారంగా టిక్కెట్లు కేటాయించామని చెబుతున్న సీఎం చంద్రబాబు.. మరి ఏ సూత్రాన్ని పాటించి బాలయ్యకు టిక్కెట్ కేటాయించారు? అని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు... 2016 మార్చిలో ‘సావిత్రి’ ఆడియో ఫంక్షన్ సందర్భంగా ఎమ్మెల్యే అనే సంగతి కూడా మరచి మహిళలపై బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడం తెలిసిందే. ‘‘అమ్మాయిల వెంటపడే పాత్రలు నేను చేస్తే ఒప్పు కోరు కదా..! ముద్దయినా పెట్టాలి... లేదా కడుపైనా చేయాలి. అంతే కమిట్ అయిపోవాలి... హీరో రోహిత్‌కు మా పోలికలు కొద్దిగా అయినా రావాలి... గిల్లడాలు... పొడవడాలు.. నేను ఎక్కని ఎత్తుల్లేవు... చూడనిలోతుల్లేవు..’’ అంటూ బాలయ్య అసభ్యంగా మాట్లాడటంపై అంతటా విస్మయం వ్యక్తమైంది. బాలయ్య ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, ఆయన ఒక్కక్షణం కూడా ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అర్హుడు కాదని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారాన్ని స్పీకర్ కోడెల దృష్టికి తెచ్చినా ఆయన స్పందించలేదు. ఈసారి బాలయ్యకు రిటర్న్‌గిఫ్ట్ తప్పదు తమను ఏమాత్రం పట్టించుకోని బాలకృష్ణకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఇంటికి పంపుతామని నియోజకవర్గ ప్రజలు బాహాటంగా చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇక్బాల్‌కు పట్టం కడతామంటున్నారు. – మొగిలి రవివర్మ సాక్షి ప్రతినిధి, అనంతపురం -
జన్మభూమా? జాదూభూమా?
సాక్షి, హైదరాబాద్ : పదేపదే ప్రజలను మోసం చేస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి పేరుతో మరో మోసపూరిత కార్యక్రమానికి తెరలేపారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. గతంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను చెత్తబుట్టల్లో పారేసి, ఇప్పుడు కొత్తగా సాధించేదేమిటని ప్రశ్నించారు. జన్మభూమి కార్యక్రమం జాదూభూమిగా మారిందన్నారు. జన్మభూమి పేరుతో అధికారులు, స్కూల్ పిల్లలను ఇబ్బందిపెడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ రెండు ఊర్ల సంగతేంటి? : ‘‘ఎవరి గ్రామాన్ని వాళ్లే అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు అంటున్నారు. అయ్యా.. మరి మీ నారావారిపల్లె సంగతేంటి? అక్కడి స్కూల్ భవనం కూలడానికి సిద్ధంగా ఉంది. ఇక మీ తనయుడు లోకేశ్ బాబు దత్తత తీసుకున్న నిమ్మకూరు(ఎన్టీఆర్ స్వగ్రామం)లో వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరింది. కనీసం సొంత ఊళ్లను కూడా పట్టించుకోని మీరు.. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా? మీ అబద్ధాలను ప్రజలు నమ్మాలా? ఇప్పటికైనా ఆ రెండు ఊళ్లకు న్యాయం చేయండి. ఆ తర్వాత మిగతా గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడండి’’ అని ఆర్కే అన్నారు. -
అధికార పార్టీ పెత్తనానికి వేదిక
- జన్మభూమి తీరుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కూడేరు : ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి కాకుండా అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల దౌర్జన్యాలకు, ఘర్షణలకు వేదిక అయిందని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. కూడేరులో బుధవారం ‘జన్మభూమి’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ పాలనపై దుమ్మెత్తి పోశారు. అర్హత ఉన్న నిరుపేదలకు సంక్షేమ పథకాలు దక్కడం లేదని, అర్హులకు న్యాయం చేద్దామని అధికారులు భావించినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఒత్తిడి తెచ్చి వారికి ఆ అవకాశం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు మితిమీరిపోయాయన్నారు. జన్మభూమిలో పింఛన్ అడిగిన వికలాంగులు, రేషన్‌కార్డు అడిగిన పేదలపై దాడులకు దిగడమే అందుకు నిదర్శనమన్నారు. తమ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతిని«ధులకు లబ్ధి చేకూర్చే విధంగా నడుచుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించడం చాలా దారుణమన్నారు. పక్కాగృహాలు అరకొరగా మంజూరు చేసి, అవి కూడా టీడీపీ వారికే దక్కేలా చేస్తున్నారని విమర్శించారు. జన్మభూమి కమిటీల నియామకంతో ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు, ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయిందని, ఈ కమిటీలతో అర్హులకు తీరని అన్యాయం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. బాబు నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని, చంద్రబాబు ప్రజల ఆగ్రహానికి గురయ్యే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఆయనతోపాటు ఎంపీపీ మహేశ్వరి, జెడ్పీటీసీ నిర్మలమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు. -
రాజకీయాలకు అతీతంగా ఏపి అభివృద్ధి
-
మంత్రి పీతల సుజాతపై చంద్రబాబు మండిపాటు
ఏలూరు : బ్యాగ్‌లో నోట్ల కట్టల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడినట్టు తెలిసింది. గురువారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా తణుకు మండలం వేల్పూరులో జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన్మభూమి సభలో మంత్రి సుజాతను చంద్రబాబు పలకరించకుండా వెళ్లిపోయినట్టు తెలిసింది. బ్యాగ్‌లో నోట్ల కట్టల వ్యవహారంలోమంత్రి పీతల సుజాత ఇంటి ఆవరణలో రూ.10 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అనంతరం మంత్రి సుజాత తండ్రి ఆచూకీ లేకుండా పోయినట్టు సమాచారం.