
సాక్షి, అమరావతి: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వెనక ఉన్న అదృశ్య శక్తిగా ఒక మహిళా ప్రజాప్రతినిధి ఉన్నారని టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు పీతల సుజాత ఆరోపించారు. ఆమె ఎవరో, ఆమెకు అనంతబాబుకి ఉన్న సంబంధమేమిటో, ఎందుకు హత్య జరిగిందనే వివరాలను త్వరలోనే బయటపెడతామని చెప్పారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలు, అతన్ని కాపాడటానికి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment