సాక్షి, కర్నూలు జిల్లా: టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆధిపత్యం కోసం టీడీపీ నేతలే హత్య చేసినట్లు నిర్థారణ అయ్యింది. హత్యకు ఆధిపత్య పోరే కారణమని డీఎస్పీ శ్రీనివాసాచారి వెల్లడించారు.
హత్య వెనకా రాజకీయ కోణం ఉంది. అందుకే అంత మొందించారు. టీడీపీకి చెందిన గుడిసె నరసింహులతో పాటు మరో ముగ్గురు హత్యకు కుట్ర పన్నారు. ఇద్దరు మైనర్లతో హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని డీఎస్పీ తెలిపారు. నలుగురు నిందితులను పత్తికొండ కోర్టులో రిమాండ్ చేసిన పోలీసులు.. మరో ఇద్దరిని జువైనల్ కోర్టుకు తరలించారు.
శ్రీనివాసులను సొంత పార్టీ వారే దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. టీడీపీ పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులతో పాటు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయ బయటపడింది. అయితే ఈ హత్యను మంత్రి నారా లోకేష్.. వైఎస్సార్‌సీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు. హత్య వెలుగులోకి రాగానే వైఎస్సార్‌సీపీ చేసిందంటూ ఎల్లో మీడియా సైతం నానా హంగామా చేసింది.
శ్రీనివాసులను హత్య చేసిన వారు సొంత పార్టీ నాయకులే కావడంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు నోరు మెదపడం లేదు. ఈ సంఘటన ఆగస్టు 14 తేదీన జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment