ఇసుక ‘డ్వాక్రా’ది, తైలం ‘తమ్ముళ్ల’ది
ఇసుక దందాలో తెలుగుదేశం శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ పతా కశీర్షికను సంపాదించుకున్నారు. ఎం దరో తెలుగు తమ్ముళ్లకూ ఇది దక్కాల్సింది, ఆయన ముందుగా దక్కించు కున్నారు. తనది దుందుడుకు స్వభా వమని తానే ప్రకటించుకున్నారు. ప్రతిపక్షంలో ఉంటే దుందుడుకుత నాన్ని ప్రజలు కొంతమేరకైనా ఆమో దిస్తారేమో కాని, అధికారపక్షంలో అధికార దుర్మదాంధతగా ఈసడించుకుంటారు. విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా రెవెన్యూ అధికారిని దుర్భాషలాడి, మహిళలతో కొట్టించే దాష్టీకం పోలీసుల సమక్షంలో జరగడం కంటే ప్రజాస్వామ్యానికి దుర్ది నం మరొకటి ఉండదు.
మానవహక్కుల కమిషన్ తన స్వతంత్ర ప్రతిపత్తిని ప్రకటించుకుంది. తనంతట తానుగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించింది. ప్రజాస్వామ్య విలువలకు వన్నె తెచ్చింది. ఇతర ఉన్నతాధికార వ్యవస్థలను సంజాయిషీ ఇచ్చుకునేలా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రేవంతరెడ్డి, చింతమనేని ప్రభాకర్, పీతల సుజాత వైగైరా అస్మదీయుల జాబితా ఉంది. సుజాత కేసు విచారణ దశలోనే ఆగి ఉంది. ఇప్పుడు ప్రభాకర్ కేసుకు పోటీగా రెవిన్యూ అధికారిణి మీద ఎదురు కేసులు పెట్టి ఉంచారు. ఏమి జరుగుతుందో ఊహిం చుకోవచ్చు.
అసలు కథలోకి వద్దాం. రాష్ర్టంలో ఇసుక దందాలో చింత మనేని ప్రభాకర్ ఉదంతం సముద్రంలో మంచు కొండలాంటిది. కొండ కొన మాత్రమే మనకి కనిపించింది. కుంభకోణం కొండ లోపలే తన పని చే సుకుపోతున్నది. 2014 ఆగస్ట్‌లో చంద్రబాబు కొత్త ఇసుక పాలసీని ప్రకటించారు. ఇసుక అమ్మ కాలలో దళారులను లేకుండా చేస్తున్నట్టు, డ్వాక్రా గ్రూపులకే ఇసుక రీచ్‌లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. దీనితో విని యోగదారులకు చౌకగా ఇసుక, డ్వాక్రా మహిళలకు లాభాలలో 25%శాతం వాటా దక్కుతాయని ప్రచారం చేశారు. అమలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది.
ఈ కొత్త ఇసుక పథకం అమలు కోసం రాష్ర్టంలో 353 ఇసుక రీచ్‌లను గుర్తించారు. వీటిని మహిళా సంఘాలకు కేటా యించడానికి జిల్లాస్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసి 343 రీచ్ లను మహిళా గ్రూపులకు అప్పగించారు. 10 రీచ్‌లకు ఎవరూ రాక తవ్వకాలు జరగడం లేదు. డ్వాక్రా మహిళా సంఘాల సమన్వయ కర్తగా ఉన్న సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీకి అజమాయిషీ బాధ్యతలు అప్పగించారు. మొదటి అంశం. ఆంధ్రప్రదేశ్‌లో లభ్యమయ్యే మొత్తం ఇసుక మీద గుత్తాధిపత్యం ఈ మహిళా సంఘాలకే ఉంది. అలాంటప్పుడు వ్రైవేట్ మార్కెట్లో ఇసుక లభించకూడదు. కాని లభిస్త్తున్నది. ఇదెక్కడిది? ఈ 343 మహిళా సంఘాల రీచ్‌ల నుండి అక్రమంగా తరలించినదే కాని మరెక్కడ నుండో ఎగిరి వచ్చే అవకాశం లేదు.
రెండవ అంశం. ఇసుక ధరలకు రెక్కలెందుకు వచ్చాయి? ప్రభుత్వం ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు పెట్టాల్సిన ఖర్చులను వినియోగించే యంత్రాలు, కూలీలను బట్టి క్యూబిక్ మీటర్‌కు రూ. 157 నుండి 177 లుగాను, పూర్తిగా కూలీలే తవ్వితే రూ.211 గాను నిర్ణయించింది. దీనిని ఒడ్డుకు చేర్చడానికి రవాణా ఛార్జీ అదనం అని ప్రకటించింది. కేవలం కూలీలతోనే తవ్వే రీచ్‌లు దాదాపుగా లేవు. రీచ్‌ల దగ్గరే అమ్మకాలు చేస్తు న్నందున కొనుగోలుదారే లోపలి నుండే ఎగుమతి చేసు కుంటారు. గనుక అక్కడ రవాణా ఛార్జీలు ఉండవు. అయినా ప్రభుత్వం క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.650గా నిర్ణయిం చింది. ప్రతి లారీ మీద దాదాపు 4000 రూపాయలను ప్రభు త్వం దండుకొంటున్నది. ఇలా మధ్యతరగతి ప్రజల స్వంత ఇంటి కల మీద ప్రభుత్వమే ఇసుక పిడుగు వేసింది.
మరో పక్క ప్రైవేటు ఇసుక దందా యథేచ్ఛగా సాగుతు న్నది. జిల్లాల పత్రికలు తిరగేస్తే అన్ని జిల్లాలలోను ఇసుక దందా వార్తలు ఏదో మూల దర్శన మిస్తూనే ఉన్నాయి. చాలా మంది శాసనసభ్యుల సారధ్యంలో, వారి అనుచరగణాల ఆధ్వ ర్యంలో ఇసుక అక్రమ వ్యాపారం సాగిపోతున్నది. రీచ్‌లలో తాత్కాలికంగా తవ్వకాలు ఆపించి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలు రాబడుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్క రించి తవ్వకాలు సాగిస్త్తున్నారు. ఇసుక పధకం డ్వాక్రా మహి ళలకి -తైలం తెలుగు తమ్ముళ్లకి అన్న చందంగా కనిపిస్తున్నది. ఈ పధకం ఉద్దేశ్యమే అది అయినట్లు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి నట్లు ఉంది. ఇక చింతమనేని కథ కంచికి చేరకుండా ఉం టుందా?
(వ్యాసకర్త అధ్యక్షులు-ఏపీ లోక్‌సత్తా పార్టీ)
మొబైల్: 98660 74023
- డీవీవీఎస్ వర్మ