![Two Arrested In Obscene Video Case In Narsapuram - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/5/arrest.jpg.webp?itok=ehze5ABV)
సాక్షి,పశ్చిమ గోదావరి : అశ్లీల వీడియోలు వాట్సాప్‌లో వైరల్ చేసిన ఆగిశెట్టి సాయి భరత్ కేసులో శుక్రవారం మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ నాగేశ్వర్‌రావు ప్రెస్‌మీట్‌లో తెలిపారు. సెక్స్ వీడియోలను చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఆగిశెట్టి గోపినాథ్, గుత్తుల నాగ సత్తిబాబులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారిద్దరి నుంచి రెండు సెల్‌ఫోన్లు, మెమోరీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో వ్యక్తిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment