సాక్షి, నరసాపురం: దేశవ్యాప్తంగా వైద్య విద్యార్హత ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాల్లో నరసాపురం చినమామిడిపల్లికి చెందిన జొన్నల బాల శివరామకృష్ణ ద్వితియ ర్యాంక్ సాధించాడు. ఈడబ్ల్యూఎస్ కేటగిరి జాతీయ స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించిన శివరామకృష్ణ ఓపెన్ కేటగిరిలో 26వ ర్యాంకును కైవసం చేసుకుని ఢిల్లీ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్‌లో సిటును దక్కించుకున్నాడు. నీట్ మొత్తం 720 మార్కులకు గాను శివరామకృష్ణ 705 మార్కులు సాధించాడు. నర్సాపురంలోని మత్స్యపురి గ్రామానికి చెందిన శివరామకృష్ణకు ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: నీట్‌లో తెలుగుతేజం)
Comments
Please login to add a commentAdd a comment