నేడు నరసాపురంలో వైఎస్సార్ జనభేరి | today ys jagan janabheri in narsapuram | Sakshi
Sakshi News home page

నేడు నరసాపురంలో వైఎస్సార్ జనభేరి

Published Fri, Mar 14 2014 12:28 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

నేడు నరసాపురంలో వైఎస్సార్ జనభేరి - Sakshi

నేడు నరసాపురంలో వైఎస్సార్ జనభేరి

ఏలూరు, న్యూస్‌లైన్ :
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నరసాపురంలో వైఎస్సార్ జనభేరి నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు స్టీమర్ రోడ్డులో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు జగన్‌మోహన్‌రెడ్డి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా నరసాపురం వెళతారని తెలిపారు.
 
 15, 16న ఐదు మునిసిపాలిటీల్లో రోడ్ షో ఈనెల 15వ తేదీన పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం ముని సిపాలిటీల్లో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 16న కొవ్వూ రు పట్టణంలో ప్రచారం నిర్వహించి.. అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వెళతారు. ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయూలని బాలరాజు, రఘురామ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 నరసాపురంలో భారీ ఏర్పాట్లు
 నరసాపురం (రాయపేట) : మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరప్రాంతమైన నరసాపురం నుం చి శుక్రవారం ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. స్థానిక స్టీమర్ రోడ్డులో వైఎస్సార్ జనభేరి బహిరంగ సభను భారీఎత్తున నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు విసృ్తత ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభా వేదికపై నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. దీంతో సభా ఏర్పాట్లను సుబ్బారాయుడు అనుచరులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
 
 నరసాపురం ప్రధాన సెంటర్ కనకదుర్గమ్మ గుడి ఆర్చి నాలుగు రోడ్ల కూడలిలో సభా వేదిక ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. సభా వేదిక వద్ద ప్రత్యేక సౌండ్ సిస్టమ్, లైటింగ్ ఏర్పాట్లు చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement