పెద్ద నోట్లను రద్దు చేసి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వానికి.. ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దడం మాత్రం అంత సులువేమీ కాదని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాదు. ఇప్పుడు రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్తవాటిని మళ్లీ ప్రింట్ చేసి విడుదల చేసేందుకు అనుకున్న గడువు కంటే మరో ఆరు నెలలు అధికంగానే పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే అప్పటిదాకా జనాలకు నోట్ల కష్టాలు తీరే అవకాశం లేనట్టేననేది పరిశీలకుల అభిప్రాయం.