పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజు బుధవారం వాడివేడిగా సాగింది. నోట్ల రద్దు పై అధికార పార్టీ నేతలకు ముందుగానే సమాచారం ఉందని విపక్షాలు దుమ్మెత్తిపోశారుు. విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారుు. పలువురు బీజేపీ నేతలు ముందుగానే నోట్లు మార్చుకున్నారని కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఆరోపించారుు. దేశంలో ఆర్థిక అరాచకత్వం రాజ్యమేలుతోందని తీవ్ర ఆరోపణలు చేశారుు. అరుుతే.. ఇవి అర్థరహితమని ప్రభుత్వం ఖండించింది. నవంబర్ 8 నిర్ణయం లీకేజీ వార్తల్లో వాస్తవం లేదని, ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొంది. అందువల్లే ప్రారంభంలో సమస్యలు వచ్చాయంది. సమావేశాల తొలి రోజే నోట్ల రద్దుపై రాజ్యసభలో 7 గంటల చర్చ జరిగింది.