పెద్ద నోట్ల రద్దు గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముందే తెలుసా? అందుకే ఆ క్రెడిట్ కొట్టేయడం కోసం ముందుగానే రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలంటూ ప్రధానమంత్రికి లేఖ రాశారా? అవుననే అంటున్నారుు ప్రతిపక్షాలు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అరుున టీడీపీ అధినేతకు పక్కా సమాచారం ఉందని అం దుకే ఆయన ముందుగా జాగ్రత్త పడ్డారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు విమర్శిస్తున్నారు.