సాక్షి,ముంబై: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఎన్యాక్ ఐవీ వీఆర్‌ఎస్' (Enyaq iV vRS) పేరుతో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల లాంచ్ చేసింది. స్పోర్టీ-డిజైన్‌తో వస్తున్న ఈ కారు కేవలం 6.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందు కుంటుందని కంపెనీ తెలిపింది. గంటకు 278 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించనుంది. అంతేకాదు ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని స్కోడా ఆటో ప్రకటించింది. ఈ కారు ధర విషయానికి వస్తే మన దేశంలో సుమారు రూ. 48.6 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఎన్యాక్ ఐవీ వీఆర్‌ఎస్ స్పెసిఫికేషన్స్
ఎకో, కంఫర్ట్, నార్మల్, స్పోర్ట్, ట్రాక్షన్ అనే ఐదు డ్రైవింగ్ మోడ్‌లతో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. తమ డ్రైవింగ్‌కి అనుగుణంగా వినియోగ దారులు ఈ వెహికల్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులోని 82 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 296 బీహెచ్పీ పవర్‌ని అందిస్తుంది. కేవలం 36 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే గ్లాసీ-బ్లాక్ ఫ్రంట్ ఏప్రాన్లు, డోర్ మిర్రర్లు, రియర్ డిఫ్యూజర్ తో పాటు మరిన్ని స్పోర్టీ ఫీచర్లను జోడించింది. ఇంటీరియర్‌గా ఫాక్స్ లెదర్ ఫినిషింగ్, డ్యాష్ బోర్డ్ ను కార్బన్ ఫైబర్‌తోనూ రూపొందించింది. 13 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 'క్రిస్టల్ ఫేస్' ఫ్రంట్ గ్రిల్, ముందువైపు ఎల్ఈడీ లైట్లు, క్రోమ్ గ్రిల్, ఆకర్షణీయమైన ఎల్లోయ్ వీల్స్, రూఫ్ రైల్స్ లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment