న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ ఆడి భారత మార్కెట్లో క్యూ8 ఈ–ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2023 ఆగస్ట్‌లో ఆవిష్కరిస్తోంది. ఎస్‌యూవీ, స్పోర్ట్‌బ్యాక్ రకాల్లో విడుదల చేయనుంది. 114 కిలోవాట్ బ్యాటరీ పొందుపరిచారు. పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేసుకుంటారు. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటికే కంపెనీ దేశీయంగా ఈ–ట్రాన్ 50, ఈ–ట్రాన్ 55, ఈ–ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఈ–ట్రాన్ జీటీ, ఆర్‌ఎస్ ఈ–ట్రాన్ జీటీ మోడళ్లను విక్రయిస్తోంది.
అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న మోడళ్లను ఇక్కడి మార్కెట్‌కు తీసుకువస్తామని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. ‘2033 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ కంపెనీగా మారాలన్నదే సంస్థ లక్ష్యం. మరిన్ని ఈవీలు ప్రవేశపెడతాం. భారత్‌లో ఈ కార్లు రూ.1.5 కోట్ల సగటు ధరకు అమ్ముడవుతున్నప్పటికీ లగ్జరీ సెగ్మెంట్‌లో ఆడి ఈవీలు ఆదరణ పొందుతున్నాయి’ అని వివరించారు. అన్ని విభాగాల్లో కలిపి ఆడి ఇండియా 2023 జనవరి–జూన్‌లో 3,474 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 97% ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment