మెర్సిడెస్‌ బెంజ్‌ కొత్త ఎలక్ట్రిక్‌ కారు..సింగిల్‌ ఛార్జ్‌తో 550 కిలోమీటర్లు..! | Mercedes Benz Eqe Electric Suv Launched In India, Check Price Details And Features Inside - Sakshi
Sakshi News home page

Mercedes Benz EQE 2023: మెర్సిడెస్‌ బెంజ్‌ కొత్త ఎలక్ట్రిక్‌ కారు..సింగిల్‌ ఛార్జ్‌తో 550 కిలోమీటర్లు..!

Sep 16 2023 7:44 AM | Updated on Sep 16 2023 9:39 AM

Mercedes-benz Eqe Electric Suv Launched In India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ కార్ల  దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ ఈక్యూఈ 500 4మేటిక్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.39 కోట్లు. బ్యాటరీపై 10 ఏళ్లు లేదా 2,50,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఉంది. 90.56 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 465–550 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు గరిష్ట వేగం 210 కిలోమీటర్లు. పొడవు 4,863 మిల్లీమీటర్లు ఉంది.

 సీమ్‌లెస్‌ గ్లాస్‌ కవర్‌తో 12.3 అంగుళాల డ్రైవర్‌ డిస్‌ప్లే, 17.7 అంగుళాల ఓలెడ్‌ సెంట్రల్‌ డిస్‌ప్లే, 12.3 అంగుళాల ఓలెడ్‌ ఫ్రంట్‌ ప్యాసింజర్‌ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు.థర్మోట్రానిక్‌ ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్, యాక్టివ్‌ స్టీరింగ్‌ అసిస్ట్, యాక్టివ్‌ లేన్‌ కీపింగ్‌ అసిస్ట్, ట్రాన్స్‌పరెంట్‌ బానెట్, 360 డిగ్రీల కెమెరా వంటి హంగులు ఉన్నాయి. కాగా, మెర్సిడెస్‌కు చెందిన చార్జింగ్‌ కేంద్రాల్లో ఇతర బ్రాండ్ల కార్లకు సైతం చార్జింగ్‌ సదుపాయం కల్పిస్తారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement