పసిడికి ‘అంతర్జాతీయ’ దన్ను
ముంబై మార్కెట్‌లో రూ.29,000పైకి
ముంబై: అమెరికా–ఉత్తర కొరియా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి అంతర్జాతీయంగా పరుగులు పెడుతోంది. ఇదే ప్రభావం దేశీయంగానూ కనబడుతోంది. ముంబై ప్రధాన మార్కెట్‌లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర గురువారం రూ.340 పెరిగి, రూ. 29,070కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా అదే స్థాయిలో ఎగిసి రూ. 28,920కి చేరింది. వెండి కేజీ ధర భారీగా రూ. 1,120 ఎగసి రూ.38,995కి చేరింది.
ఇక అంతర్జాతీయంగా న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్– నైమెక్స్‌లో పసిడి ధర గురువారం కడపటి సమాచారం అందేసరికి ఏకంగా 10 డాలర్లకు పైగా లాభంతో 1,290 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో చురుగ్గా ట్రేడవుతున్న 10 గ్రాముల పసిడి కాంట్రాక్ట్ ధర కడపటి సమాచారం అందేసరికి రూ.300 లాభంతో రూ. 29,144 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే, శుక్రవారం స్పాట్ మార్కెట్‌లో పసిడి ధర మరింత పెరిగే వీలుంది.