MUMBAI MARKET
-
బంగారం పరుగు!
♦ ముంబై మార్కెట్లో రూ. 520 అప్ ♦ నైమెక్స్‌లో రెండు రోజుల్లో 35 డాలర్లు అప్ ముంబై/న్యూయార్క్: అంతర్జాతీయ పరిణామాల దన్నుతో బంగారం పరుగులు పెడుతోంది. దేశీయంగా ముంబై స్పాట్ మార్కెట్లో బంగారం 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర మంగళవారం భారీగా రూ.520 పెరిగి రూ. 29,915కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర ఇదే స్థాయిలో ఎగసి రూ. 29,765కు పెరిగింది. రెండు రోజుల్లో ఇక్కడ ధర దాదాపు రూ.750 పెరిగింది. అంతర్జాతీయంగా .. అమెరికా ఫెండ్ ఫండ్ రేటు పెంపుపై అనుమానాలు, డాలర్ ఇండెక్స్ 92 స్థాయికి భారీ పతనం, ఉత్తరకొరియా ఘర్షణాత్మక వైఖరి వంటి అంశాల నేపథ్యంలో పసిడి, సోమవారం నాడే న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో– నైమెక్స్‌లో కీలక 1,300 డాలర్ల స్థాయిని దాటి 20 డాలర్లు ఎగసింది. మంగళవారం ఒక దశలో 1,330 డాలర్ల స్థాయిని తాకిన పసిడి కడపటి సమాచారం అందే సరికి 1,322 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సోమవారం ముగింపుతో పోల్చితే ఇది ఆరు డాలర్లు అధికం. దేశీయ ఫ్యూచర్స్‌లో... దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో కడపటి సమాచారం అందే సరికి పసిడి 10 గ్రాముల ధర రూ.220 లాభంతో రూ. 29,725 వద్ద ట్రేడవుతోంది. -
పసిడికి ‘అంతర్జాతీయ’ దన్ను
ముంబై మార్కెట్లో రూ.29,000పైకి ముంబై: అమెరికా–ఉత్తర కొరియా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి అంతర్జాతీయంగా పరుగులు పెడుతోంది. ఇదే ప్రభావం దేశీయంగానూ కనబడుతోంది. ముంబై ప్రధాన మార్కెట్లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర గురువారం రూ.340 పెరిగి, రూ. 29,070కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా అదే స్థాయిలో ఎగిసి రూ. 28,920కి చేరింది. వెండి కేజీ ధర భారీగా రూ. 1,120 ఎగసి రూ.38,995కి చేరింది. ఇక అంతర్జాతీయంగా న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్– నైమెక్స్‌లో పసిడి ధర గురువారం కడపటి సమాచారం అందేసరికి ఏకంగా 10 డాలర్లకు పైగా లాభంతో 1,290 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో చురుగ్గా ట్రేడవుతున్న 10 గ్రాముల పసిడి కాంట్రాక్ట్ ధర కడపటి సమాచారం అందేసరికి రూ.300 లాభంతో రూ. 29,144 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే, శుక్రవారం స్పాట్ మార్కెట్లో పసిడి ధర మరింత పెరిగే వీలుంది. -
మార్కెట్లోకి ఎం అండ్ ఎం కందిపప్పు!
న్యూఢిల్లీ: బ్రాండెడ్ పప్పు దినుసుల వ్యాపారంలోకి మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) అగ్రి బిజినెస్ డివిజన్ ప్రవేశించింది. న్యూప్రో బ్రాండ్‌తో కందిపప్పును ముంబై మార్కెట్లో సోమవారం విడుదల చేసింది. మరిన్ని పప్పు దినుసులను త్వరలో తమ బ్రాండ్‌తో మార్కెట్లోకి విడుదల చేస్తామని, దేశవ్యాప్తంగా క్రమక్రమంగా విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు మూడేళ్లను కంపెనీ నిర్దేశించుకుంది. సహజసిద్ధంగా సూర్యకాంతి ద్వారా ప్రాసెస్ జరిగే ఈ కందిపప్పు మార్కెట్లోని ఇతర సంబంధిత ప్రొడక్టులతో పోల్చితే 50 శాతం తొందరగా ఉడుకుతుందని ఎం అండ్ ఎం గ్రూప్ అగ్రి ఆఫ్రికా, దక్షిణాసియా కార్యకలాపాల ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశోక్ శర్మ తెలిపారు. -
బంగారం హైజంప్..
ఢిల్లీ మార్కెట్లో రూ. 840 అప్ ఒకే రోజు ఇంత పెరగడం ఈ ఏడాది ఇదే ప్రథమం న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా భారత్‌లో కూడా పసిడి ధర గణనీయంగా పెరిగింది. మంగళవారం పది గ్రాముల పసిడి రేటు ఏకంగా రూ. 840 పెరిగింది. ఒక్క రోజులో బంగారం ధర ఇంత పెరగడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి. తాజా పెరుగుదలతో దాదాపు నెల రోజుల తర్వాత న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం మళ్లీ రూ. 27,000 మార్కును దాటింది. మేలిమి బంగారం (99.9 శాతం స్వచ్ఛత) పది గ్రాముల ధర రూ. 27,040 వద్ద ముగిసింది. చివరిగా అక్టోబర్ 30న న్యూఢిల్లీ మార్కెట్లో పసిడి ఈ రేటు వద్ద కదలాడింది. మరోవైపు, తాజాగా ఆభరణాల బంగారం రూ. 26,840 వద్ద ముగిసింది. వరుసగా ఆరు సెషన్లలో పసిడి ధర రూ. 730 మేర క్షీణించిన సంగతి తెలిసిందే. అయితే దిగుమతులపై పరిమితులను ఆర్బీఐ సడలించడం ప్రస్తుతం మళ్లీ ఊపునిచ్చింది. ఇక వివాహాల సీజన్ నేపథ్యంలో దేశీయంగా డిమాండు పెరగడమూ పసిడికి కలిసొచ్చింది. ఇక పారిశ్రామిక సంస్థలు, నాణేల తయారీ సంస్థల నుంచి డిమాండ్‌తో వెండి కూడా కిలో ధర రూ.2,700 పెరిగి రూ. 37,000 వద్ద ముగిసింది. ముంబై మార్కెట్లోనూ..: స్టాకిస్టులు, ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్‌తో ముంబై మార్కెట్లోనూ పసిడి రేటు పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం రూ.370 పెరిగి రూ.26,485 వద్ద, ఆభరణాల బంగారం కూడా అంతే పెరిగి రూ.26,335 వద్ద ముగిసింది. వెండి ధర కిలోకు రూ.850 మేర పెరిగి రూ.36,965 వద్ద ముగిసింది.