మార్కెట్‌లోకి ఎం అండ్ ఎం కందిపప్పు! | Mahindra & Mahindra forays into branded pulses business | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి ఎం అండ్ ఎం కందిపప్పు!

Published Tue, Oct 20 2015 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 AM

మార్కెట్‌లోకి ఎం అండ్ ఎం కందిపప్పు!

మార్కెట్‌లోకి ఎం అండ్ ఎం కందిపప్పు!

న్యూఢిల్లీ: బ్రాండెడ్ పప్పు దినుసుల వ్యాపారంలోకి మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) అగ్రి బిజినెస్ డివిజన్ ప్రవేశించింది. న్యూప్రో బ్రాండ్‌తో  కందిపప్పును ముంబై మార్కెట్‌లో సోమవారం విడుదల చేసింది. మరిన్ని పప్పు దినుసులను త్వరలో తమ బ్రాండ్‌తో మార్కెట్‌లోకి విడుదల చేస్తామని, దేశవ్యాప్తంగా క్రమక్రమంగా విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు మూడేళ్లను కంపెనీ నిర్దేశించుకుంది.

సహజసిద్ధంగా సూర్యకాంతి ద్వారా ప్రాసెస్ జరిగే ఈ కందిపప్పు మార్కెట్‌లోని ఇతర సంబంధిత ప్రొడక్టులతో పోల్చితే 50 శాతం తొందరగా ఉడుకుతుందని ఎం అండ్ ఎం గ్రూప్ అగ్రి ఆఫ్రికా, దక్షిణాసియా కార్యకలాపాల ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశోక్ శర్మ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement