బంగారం పరుగు!
♦ ముంబై మార్కెట్‌లో రూ. 520 అప్
♦ నైమెక్స్‌లో రెండు రోజుల్లో 35 డాలర్లు అప్
ముంబై/న్యూయార్క్: అంతర్జాతీయ పరిణామాల దన్నుతో బంగారం పరుగులు పెడుతోంది. దేశీయంగా ముంబై స్పాట్ మార్కెట్‌లో బంగారం 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర మంగళవారం భారీగా రూ.520 పెరిగి రూ. 29,915కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర ఇదే స్థాయిలో ఎగసి రూ. 29,765కు పెరిగింది. రెండు రోజుల్లో ఇక్కడ ధర దాదాపు రూ.750 పెరిగింది.
అంతర్జాతీయంగా ..
అమెరికా ఫెండ్ ఫండ్ రేటు పెంపుపై అనుమానాలు, డాలర్ ఇండెక్స్ 92 స్థాయికి భారీ పతనం, ఉత్తరకొరియా ఘర్షణాత్మక వైఖరి వంటి అంశాల నేపథ్యంలో పసిడి, సోమవారం నాడే న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో– నైమెక్స్‌లో కీలక 1,300 డాలర్ల స్థాయిని దాటి 20 డాలర్లు ఎగసింది. మంగళవారం ఒక దశలో 1,330 డాలర్ల స్థాయిని తాకిన పసిడి కడపటి సమాచారం అందే సరికి 1,322 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సోమవారం ముగింపుతో పోల్చితే ఇది ఆరు డాలర్లు అధికం.
దేశీయ ఫ్యూచర్స్‌లో...
దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో కడపటి సమాచారం అందే సరికి పసిడి 10 గ్రాముల ధర రూ.220 లాభంతో రూ. 29,725 వద్ద ట్రేడవుతోంది.