పసిడి దిగుమతులపై టారిఫ్ విలువ పెంపు
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులపై టారిఫ్ విలువ పెరిగింది. దీని ప్రకారం- ఈ రేటు 10 గ్రాములకు 354 డాలర్ల నుంచి 363 డాలర్లకు పెరిగింది. ఇక వెండి కేజీపై రేటు కూడా 498 డాలర్ల నుంచి స్వల్పంగా 499 డాలర్లకు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల మార్పులకు అనుగుణంగా సాధారణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కేంద్ర బోర్డ్ (సీబీఈసీ) పసిడి, వెండి టారిఫ్ విలువను నిర్ణయిస్తుంది. దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని విధించడానికి ఈ టారిఫ్ విలువనే ప్రాతిపదికగా తీసుకుంటారు. అయితే ఈ విలువలో 5 శాతం మేర మార్పు ఉంటే... అది దేశీయ స్పాట్ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుంది.