బంగారం దిగుమతి టారిఫ్ విలువ పెంపు | Govt raises gold import tariff value; lowers silver value | Sakshi
Sakshi News home page

బంగారం దిగుమతి టారిఫ్ విలువ పెంపు

Published Fri, Apr 17 2015 2:40 AM | Last Updated on Thu, Aug 2 2018 4:31 PM

బంగారం దిగుమతి టారిఫ్ విలువ పెంపు - Sakshi

బంగారం దిగుమతి టారిఫ్ విలువ పెంపు

న్యూఢిల్లీ: బంగారం దిగుమతి టారిఫ్ విలువను 10 గ్రాములకు 385 డాలర్ల నుంచి 388 డాలర్లకు పెంచుతున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) ఒక ప్రకటనలో తెలిపింది.  కాగా వెండికి సంబంధించి ఈ విలువను కేజీకి 543 డాలర్ల నుంచి 524 డాలర్లకు తగ్గించింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా సీబీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.  ఈ మెటల్స్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది.  

విలువను తక్కువచేసి చూపేందుకు (అండర్ ఇన్వాయిసింగ్) ఆస్కారం లేకుండా చేయడమే దీని ప్రధానోద్దేశం. సాధారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరల ధోరణికి అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వం ఈ టారిఫ్ విలువను సమీక్షించి, మార్పులపై ఒక నిర్ణయం తీసుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement