అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అనుకూల స్పందనలతో స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి.
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అనుకూల స్పందనలతో స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 66 పాయింట్ల లాభంతో 26వేల 220 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్వల్ఫలాభంతో 7950 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీల్లో హెల్త్ కేర్ 1.37శాతం , కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.04శాతం , క్యాపిటల్ గూడ్స్ 0.71శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ టాప్ గేయినర్స్ లిస్ట్‌లో ఆల్ట్రాటెక్ 3.84 శాతం , ల్యూపిన్ 3.20 శాతం, జీల్ 2.32 శాతం లాభపడగా, నిఫ్టీ టాఫ్ లూజర్స్ లిస్ట్‌లో హెచ్‌సిఎల్ టెక్ 12.54 శాతం , బిహెచ్‌ఇఎల్ 3.28 శాతం , గేయిల్ 2.91 శాతం ,మారుతీ 2.28 శాతం నష్టపోయాయి.