తగ్గిన పెట్రో ధరలు
పెట్రోల్‌పై 32 పైసలు, డీజిల్‌పై 85 పైసలు
న్యూఢిల్లీ: ఇంధన ధరలు స్వల్పంగా దిగాయి. పెట్రోల్‌పై లీటరుకు 32 పైసలు, డీజిల్‌పై 85 పైసలు తగ్గాయి. అలాగే నష్టాలు పూడ్చుకోడానికి రూ. 3,700 కోట్ల అదనపు ఆదాయం కోసం ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 75 పైసలు, డీజిల్‌పై రూ. 2 పెంచింది. అయితే ఈ సుంకాలు పెరిగినా వీటి ధరలు తగ్గడం గమనార్హం. నిజానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు 12 ఏళ్లలో అత్యంత దిగివకు బ్యారెల్‌కు 30 డాలర్లకంటే తక్కువకు పడిపోవడంతో వీటి ధరలు ఇంకా తగ్గాల్సి ఉంది. అయితే తగ్గింపుతో వచ్చిన లాభాలను ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం పెంచి తన ఖాతాలో వేసుకుంది. పెట్రో ధరల తగ్గింపు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.
ఢిల్లీలో పెట్రో ధర రూ. 59.35 నుంచి రూ. 59.03కు, డీజిల్ ధర రూ. 45.03 నుంచి 44.18కి తగ్గాయి. సాధారణ పెట్రోల్‌పై సుంకాన్ని తాజాగా రూ. 7.73 నుంచి రూ. 8.48కి పెంచారు. అన్‌బ్రాండెడ్ డీజిల్‌పై సుంకం రూ. 7.83 నుంచి రూ. 9.83కు పెరిగింది. కాగా, ప్రస్తుతం సంవత్సరం(2016) పదివేల ఎల్పీజీ డీలర్‌షిప్‌లు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.