![Sensex and Nifty End Flat After A Rangebound Session - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/24/SENSEX-ENDS-PROFIT.jpg.webp?itok=jgcU9nWa)
ముంబై: ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన స్టాక్ సూచీలు గురువారం చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 5 పాయింట్లు నష్టపోయి 66,018 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 10 పాయింట్లు పతనమై 19,802 వద్ద నిలిచింది. ఫార్మా, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఉదయం సానుకూలంగా మొదలైన సూ చీలు ఆరంభ లాభాలను నిలుపుకోవడంలో విఫలమయ్యాయి. ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణి లో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి.
ఇంధన, రియలీ్ట, టెలికం, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం చొప్పున రాణించాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ‘‘నిఫ్టీ 19,800 స్థాయిని దాటి ముందుకెళ్లేందుకు ప్రోత్సాహానిచ్చే కీలక పరిణామాలేవీ లేకపోవడంతో పరిమిత శ్రేణి ట్రేడింగ్ రెండోరోజూ కొనసాగింది. క్రూడాయిల్ ధరలు, బాండ్లపై రాబడులు దిగిరావడం వంటి అంశాలు దేశీయ మార్కె ట్ పత నాన్ని అడ్డుకుంటున్నాయి’’ అని జియోజిత్ ఫైనా న్సియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment