ముంబై: మిడ్‌సెషన్ నుంచి ఐటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు బుధవారం కనిష్టస్థాయిల నుంచి రికవరీ అయ్యాయి. అధిక వెయిటేజీ ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ షేర్లు 2 శాతం వరకు రాణించి సూచీల దన్నుగా నిలిచాయి. ఉదయం సెషన్‌లో 369 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 138 పాయింట్ల లాభంతో 65,539 వద్ద స్థిరపడింది. కనిష్టం నుంచి మొత్తంగా 507 పాయింట్లు రికవరీ అయ్యింది. నిఫ్టీ సైతం 118 పాయింట్ల పతనం నుంచి తేరుకొని 30 పాయింట్ల లాభంతో 19,465 వద్ద ముగిసింది.
దేశీయంగా ద్రవ్యోల్బణం పెరగడం, చైనా
ఆరి్థక వ్యవస్థ మాంద్య ఆందోళనలు, అమెరికాకు బ్యాంకులకు ఫిచ్ డౌన్‌గ్రేడ్ రేటింగ్ హెచ్చరికలు పరిణామాల నేపథ్యంలో తొలిసెషన్‌లో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే బ్రిటన్‌లో ద్రవ్యోల్బణ తగ్గుముఖం పట్టినట్లు డేటా గణాంకాలు వెల్లడి కావడం, యూఎస్ ఫెడ్ మినిట్స్, పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడి ముందు షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతో అనూహ్యంగా సెంటిమెంట్ మెరుగుపడింది.
మెటల్, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మధ్య, చిన్న తరహా షేర్లు రాణించడంతో బీఎస్‌ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 0.50%, 0.25 శాతం చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 723 కోట్ల విలువైన షేర్లను, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,406 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. పార్సీ కొత్త ఏడాది సందర్భంగా ఫారెక్స్, మనీ మార్కెట్లు బుధవారం పనిచేయలేదు.
మార్కెట్లో మరిన్ని సంగతులు...
► ఇండిగో ప్రమోటర్ శోభ అగర్వాల్ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 2.9% వాటాను రూ.2,802 కోట్లకు అమ్మారు. దీంతో కంపెనీ షేరు 3.56% నష్టపోయి రూ.2458 వద్ద ముగిసింది.
► క్యూ1లో రూ.7,840 నష్టాన్ని ప్రకటించడంతో టెలికం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా 3% నష్టపోయి రూ.7.82 వద్ద స్థిరపడింది.
► ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా బర్మన్ ఫ్యామిలీ రిలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌లో 7.5% వాటాను రూ.534 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో బీఎస్‌ఈలో రిలిగేర్ షేరు 6% పెరిగి రూ.233 వద్ద స్థిరపడింది.
ఎస్‌బీఎఫ్‌సీ బంపర్ లిస్టింగ్
బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎస్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్ షేరు లిస్టింగ్‌లో అదరగొట్టింది. ఇష్యూ ధర రూ.57తో పోలిస్తే 44% ప్రీమియంతో రూ.82 వద్ద లిస్టయ్యింది. మరింత కొనుగోళ్ల మద్దతు లభించడంతో 67% ఎగిసి రూ.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి రూ.61% లాభంతో రూ.92 వద్ద స్థిరపడింది. కంపెనీ విలువ రూ.9,813 కోట్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment