ముందురోజు నమోదైన భారీ నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. తొలుత కొంతమేర ఆటుపోట్లను చవిచూసినప్పటికీ తదుపరి దశలో జోరందుకున్నాయి. చివరివరకూ లాభాల బాటలో సాగాయి. సెన్సెక్స్ 377 పాయింట్లు జంప్‌చేసి 40,522 వద్ద నిలవగా.. నిఫ్టీ 122 పాయింట్లు జమ చేసుకుని 11,889 వద్ద స్థిరపడింది. అయితే తొలుత 39,978 వరకూ నీరసించిన సెన్సెక్స్ ఒక దశలో 40,556 వరకూ ఎగసింది. ఇక నిఫ్టీ 11,899- 11,723 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న కారణంగా సోమవారం యూఎస్ మార్కెట్లు 2 శాతం స్థాయిలో పతనంకావడంతో తొలుత ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు నవంబర్ సిరీస్‌కు ఎఫ్‌అండ్‌వో పొజిషన్లను రోలోవర్ చేసుకోవడం కూడా ప్రభావం చూపినట్లు తెలియజేశారు.
మీడియా సైతం
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్ 3.2 శాతం జంప్‌చేయగా.. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఆటో 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. అయితే ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ 1.2-0.7 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్ 12 శాతం దూసుకెళ్లగా.. నెస్లే, ఏషియన్ పెయింట్స్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, దివీస్, సిప్లా, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 6-2 శాతం మధ్య పురోగమించాయి. ఇతర బ్లూచిప్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, విప్రో, గెయిల్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్, ఐటీసీ, సన్ ఫార్మా 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి.
ఎంఆర్‌ఎఫ్ జూమ్
డెరివేటివ్ కౌంటర్లలో ఎంఆర్‌ఎఫ్, ఏసీసీ, శ్రీరామ్ ట్రాన్స్, కాల్గేట్, జీ, టాటా కన్జూమర్, ముత్తూట్ ఫైనాన్స్, ఐజీఎల్, అంబుజా, అశోక్ లేలాండ్, ఆర్‌ఈసీ, రామ్‌కో, దివీస్, పిడిలైట్, అమరరాజా, కంకార్ 8-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, పీవీఆర్, సెయిల్, యూబీఎల్, భారత్ ఫోర్జ్, ఐడియా, ఇండిగో, టొరంట్ ఫార్మా, ఐబీ హౌసింగ్ 4-1.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.7-0.6 శాతంమధ్య ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,282 లాభపడగా.. 1,372 నష్టాలతో నిలిచాయి.
అమ్మకాలవైపు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 119.4 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 979 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 907 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 892 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment