బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాభం 266 కోట్లు | Bank Of India Posts Rs 266 Crores Q2 Profit | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాభం 266 కోట్లు

Published Sat, Nov 2 2019 5:51 AM | Last Updated on Sat, Nov 2 2019 5:51 AM

Bank Of India Posts Rs 266 Crores Q2 Profit - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.266 కోట్ల నికర లాభం సాధించింది. కేటాయింపులు తగ్గడం, నికర వడ్డీ ఆదాయం బాగా ఉండటం, ఇతర ఆదాయం పెరగడంతో ఈ స్థాయి లాభం నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్‌లో రూ.1,156 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఆదాయం రూ.10,800 కోట్ల నుంచి రూ.11,986 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ 2.27% నుంచి 2.99%కి పెరిగింది. ఇది 18 క్వార్టర్ల గరిష్ట స్థాయి.  గత క్యూ2లో 16.36%గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 16.31%కి తగ్గాయి. నికర మొండి బకాయిలు 7.64% నుంచి 5.77%కి  చేరాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement