కొత్త నోట్లు వచ్చేవరకు పాతవి ఉంచాలి
- బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
- తమపై అజమారుుషీ చేసే హక్కు చంద్రబాబుకు లేదని బ్యాంకర్ల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: కొత్త కరెన్సీ నోట్లు వచ్చే వరకు రద్దు చేసిన పాత రూ. 500, రూ. వెయ్యి నోట్లను చెలామణిలో ఉంచాలని భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (బెఫీ) డిమాండ్ చేసింది. బెఫీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్‌స నిర్వహించారు. బెఫీ ప్రధాన కార్యదర్శి వెంకట్రామయ్య మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగు లు సహకరించడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడు తున్నారని... తమపై అజమారుుషీ చేసే హక్కు ఆయనకు లేదని ధ్వజమెత్తారు. తామంతా రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్నామన్నారు. బాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు బ్యాంకు ఉద్యోగులపై దుష్ప్రచారం చేస్తే బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని వెంకట్రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేసి 25 రోజులైనా బ్యాంకులకు పూర్తిస్థారుులో నగదు సరఫరా కావడంలేదని...పైగా ముద్రించిన నగదులో ఎక్కువ భాగం ప్రైవేటు బ్యాంకులకు సరఫరా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఖాతాలు ఎక్కువగా ఉన్న బ్యాంకులకు అధికంగా నగదు సరఫరా చేయాలని, బ్యాంకులు, సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ విధుల నిర్వహణలో ఇప్పటివరకు 11 మంది బ్యాంకు ఉద్యోగులు, నగదు కోసం క్యూలలో నిరీక్షిస్తూ 80 మంది పౌరులు కన్నుమూశారన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ ఆర్‌బీఐ గవర్నర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చే వరకు పాత పెద్ద నోట్లను చెలామణిలోనే ఉంచాలని కోరారు. బ్యాంకులకు చేసిన కొత్త కరెన్సీ సరఫరా వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచిన వారిని వదిలేసి సామాన్యులపై కేంద్రం ప్రతాపం చూపుతోందని సీఐటీయూ నేత సారుుబాబా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. ప్రజల వద్ద ఉన్న డబ్బును బయటకు తీసుకొచ్చి విదేశీ పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేందుకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. సమావేశంలో ఐఎన్‌టీయూసీ నేత ప్రకాష్‌గౌడ్, ఏఐటీయూసీ నేతలు సుధీర్, వెంకటేశం, ఇఫ్టూ నేత ఎస్.ఎల్. పద్మ ప్రసంగించారు.