ఇంకెన్నాళ్లు..! | Currency troubles continue after 50 days | Sakshi
Sakshi News home page

ఇంకెన్నాళ్లు..!

Published Sat, Dec 31 2016 10:45 PM | Last Updated on Thu, Mar 28 2019 6:13 PM

ఇంకెన్నాళ్లు..! - Sakshi

ఇంకెన్నాళ్లు..!

జిల్లాలో ప్రజలకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి 50రోజులు గడిచినా బ్యాంకుల వద్ద బారులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం రద్దీ మాత్రం తగ్గింది. ఒక్కొక్క ఖాతాదారుడికి రూ. 4 వేల నుంచి రూ. 6వేలతో సరిపెడుతున్నారు. చాలా ఏటీఎంలు నో క్యాష్‌ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. కొన్ని ఏటీఎంల్లో నగదు పెట్టినా గంటలోపు అయిపోతుండడంతో ప్రజలకు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు తప్పడం లేదు.

నల్లగొండ టూటౌన్‌ : కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేసి 50 రోజులు దాటినా సామాన్య ప్రజలకు తగినంత నగదు లభించక నానా కష్టాలు పడుతున్నారు. జిల్లా కేంద్రం చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు ఉదయం 8 గంటలకే వచ్చి బ్యాంకుల వద్ద పడి గాపులు కాస్తున్నారు. వారి దగ్గర ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లను బ్యాంకులలో చేశారు. కానీ తిరిగి వాటిని తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా ఐకేపీ సెంటర్లలో ధాన్యం పోయగా సంబంధిత సెంటర్ల వారు రైతుల ఖాతాలలో డబ్బులు వేశారు. జిల్లా కేంద్రం చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు ఉదయం 8 గంటలకే వచ్చి బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం డబ్బులు కూడా రైతుల చేతికి రాకపోవడంతో పెట్టుబడుల కోసం నానా తంటాలు పడుతున్నారు. గ్రామాల్లో పత్తి విక్రయించగా వ్యాపారులు ఇచ్చిన చెక్కులను సైతం బ్యాంకుల్లో వేయాల్సి వచ్చింది. రైతుల డబ్బులు బ్యాంకుల నుంచి రాకపోవడంతో కూలీల రోజు కూలి ఇవ్వడానికి కూడా చిల్లిగవ్వ లేని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని బ్యాంకుల్లో నేటికి 6 వేలు, 7 వేలు,  10 వేలు మాత్రమే ఇస్తున్నారు.

పేరుకే ఏటీఎంలు
జిల్లా కేంద్రంలో పేరుకు మాత్రం ఏటీఎం సెంటర్లు చాలానే ఉన్నాయి. కానీ ఒక్క ఏటీఎంలో కూడా డబ్బు లు పెట్టిన పాపాన  పోలేదు. ఒక్క ఏటీఎంలో పెట్టినా గంట సమయంలోనే అవి అయిపోతున్నాయి.  

నాగార్జున సాగర్‌లో..  
త్రిపురారం : నాగార్జున సాగర్‌ నియోజకవర్గవ్యాప్తంగా 26 బ్యాంకులు, 23 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. హలియా మండలంలోని ఆంధ్రాబ్యాంకులో రూ. 10 వేల చొప్పున నగదు అందించగా, పెద్దవూర మండలంలోని పులిచర్ల ఎస్‌బీహెచ్, పెద్దవూర ఆంధ్రబ్యాంకులో రూ. 24 వేలు నగదు అందించారు. అదే విధంగా గుర్రంపోడు మండలంలోని కొప్పొలు ఎస్‌బీఐలో ఒక్కొక్కరికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు నగదును అందజేశారు. త్రిపురారం, నిడమనూరు మండలాల్లోని ఎస్‌బీహెచ్‌ బ్యాంకులో ఖాతాదారులకు రూ 4 వేల నుంచి రూ. 6 వేల వరకు ఇస్తున్నారు. అదే విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఏటీఎంలు నేటికీపని చేయడం లేదు.  

నకిరేకల్‌లో..  
నకిరేకల్‌ :  నకిరేకల్‌ lనియోజకవర్గంలో మొత్తం బ్యాంకులు 27, ఏటీఎం 20 ఉన్నాయి. సుమారు ఐదు ఏటీఎంలు పనిచేస్తున్నాయి. ఒక వేళ ఏటీఎంలలో డబ్బులు పెట్టిన గంట లోపే ఖాళీ అవుతున్నాయి. పెట్టిన డబ్బులు కూడా కేవలం రూ.2000 నోట్లు పెట్టడం, అవి కూడా రోజుకు 2000 మాత్రమే డ్రాకు అనుమతులు ఇవ్వడంతో అత్యవసర పరిస్థితుల్లో నగదు డబ్బులు చేతి కందక ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. బ్యాంకుల్లో   రోజుకు రూ.4వేల చొప్పున వారానికి రూ.24వేలకు మించి ఇవ్వడం లేదు.

మిర్యాలగూడలో..  
మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గంలో బ్యాంకుల వద్ద రద్దీ తగ్గింది. నియోజకవర్గవ్యాప్తంగా  39 బ్యాంకులు, 24 ఏటీఎంలు ఉన్నాయి. కాగా 11 ఏటీఎంలు మాత్రమే పని చేస్తున్నాయి. పని చేస్తున్న ఏటీఎంలలో రెండు వేల రూపాయలు అందుబాటులో ఉన్నాయి.  ఒక్కొక్క బ్యాంకు నుంచి 10 వేల రూపాయల నుంచి 24 వేల రూపాయల వరకు ఇస్తున్నారు. దాంతో బ్యాంకుల్లో కూడా రద్దీ తగ్గింది. కొత్తగా విడుదల చేసిన రెండు వేల రూపాయల నోట్లతో పాటు 500 నోట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.  

దేవరకొండ : పెద్ద నోట్లను రద్దు చేసి 50 రోజులు గడిచినా ప్రజలకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. బ్యాంకుల వద్ద ప్రజల రద్దీ కొనసాగుతూనే ఉంది. దేవరకొండ నియోజకవర్గంలో 17 ఏటీఎంలు, 25 బ్యాంకులు ఉన్నాయి. ప్రస్తుతం కనీసం ఐదు ఏటీఎంలలో కూడా డబ్బులు నిల్వ ఉండడం లేదు. దీంతో ఏటీఎంల వద్ద నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కాగా కొన్ని బ్యాంకుల్లో మాత్రం పరిమితి ఉన్న రూ.24వేలను అందిస్తుండగా చిన్న బ్యాంకుల్లో కేవలం రూ.4వేలు మాత్రమే ఖాతాదారులకు అందిస్తున్నారు.

మునుగోడులో..  
చండూరు: పెద్ద నోట్ల రద్దు తర్వాత చిల్లర కోసం ప్రజలకు తిప్పలు తప్పడంలేదు. శుక్రవారం బ్యాంకుల వద్ద నో క్యాష్‌ బోర్డులు ఏర్పాటు చేయగా ఏటీఎంలు మాత్రం తెరుచుకోలేదు. మునుగోడు నియోజకవర్గంలో 19 బ్యాంకులు, 10 ఏటీఎంలు ఉన్నాయి. చండూరులో ఆరు బ్యాంకులకు గాను ఎస్‌బీహెచ్‌ , పోచంపల్లి, ఆంధ్రాబ్యాంకులో రూ. రెండు నుంచి నాలుగు వేలు ఇచ్చారు. రెండు ఏటీఎంలు ఉదయం ఒక గంట మాత్రమే పనిచేశాయి. డబ్బులు అయిపోవడంతో మూసి వేశారు. మునుగోడు మండలంలో ఐదు బ్యాంకులకు గాను రెండు బ్యాంకులలో రెండు వేల రూపాయల వరకు నగదు ఇచ్చారు. ఏటీఎంలు మూసి ఉన్నాయి. మర్రిగూడెం , నాంపల్లి మండలాల్లో నో క్యాష్‌ ...ఓన్లీ డిపాజిట్‌ అనే బోర్డులు ఏర్పాటు చేశారు. ఏటీఎంలు వారం రోజులుగా తెరుచుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement