2023 జనవరికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు జనవరి 2023లో 15 రోజుల వరకు పని చేయవు( ఆ తేదిలలో బ్యాంకులకు సెలవు).
ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, అలాగే ఆదివారాలు కూడా ఉన్నాయి. కనుక కస్టమర్లు జనవరిలో ఏవైనా బ్యాంకు పనులుంటే దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.
జనవరి 2023లో దేశవ్యాప్తంగా బ్యాంకులు చాలా రోజులు మూసివేసి ఉంటాయి. ప్రతి నెల రెండు, నాలుగు మినహాయిస్తే తొలి, మూడవ శనివారం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. సెలవుల్లో కొన్ని బ్యాంకులకు ప్రాంతీయ సెలవులుంటే..మరికొన్ని బ్యాంకులకు జాతీయ సెలవులున్నాయి. జనవరిలో ఏ తేదిన ఉన్నాయో ఓ లుక్కేద్దాం!
సెలవుల జాబితా ఇదే
1 జనవరి 2023 ఆదివారం న్యూ ఇయర్
2 జనవరి 2023 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఐజ్వాల్‌లో సెలవు
3 జనవరి 2023 ఇంఫాల్‌లో సెలవు
4 జనవరి 2023 ఇంఫాల్‌లో గణ ఎన్‌గయీ సందర్భంగా సెలవు
8 జనవరి 2023 ఆదివారం
12 జనవరి 2023 స్వామి వివేకానంద జన్మదినం (కోల్‌కతాలో బ్యాంకులు పని చేయవు)
14 జనవరి 2023 రెండో శనివారం
15 జనవరి 2023 ఆదివారం
16 జనవరి 2023 తిరువల్లూర్ దినోత్సవం (చెన్నైలో సెలవు)
17 జనవరి 2023 ఉజ్ఞావార్ తిరునాళ్లు సందర్భంగా చెన్నైలో సెలవు
22 జనవరి 2023 ఆదివారం
23 జనవరి 2023 నేతాజీ జన్మ దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో సెలవు
26 జనవరి 2023 రిపబ్లిక్ డే (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
28 జనవరి 2023 నాలుగో శనివారం
29 జనవరి 2023 ఆదివారం
Comments
Please login to add a commentAdd a comment