Metal
-
అలాంటి వ్యక్తులకి మళ్ళీ పెళ్ళి చేయడం పొరపాటేనా!
డాక్టరుగారూ! మా తమ్ముడు బయట అందరితో చాలా బాగా ఉంటాడు. ఇంట్లో మాత్రం ఎప్పుడూ భార్యతో కొట్లాటలే! భార్యను విపరీతంగా అనుమానిస్తాడు. చాలామందితో సంబంధాలున్నాయని తిట్టడం కొట్టడం కూడా చేశాడు. నిజానికి వాడి భార్య చాలా మంచి అమ్మాయి. ఈ బాధలు భరించలేక మూడేళ్ళ క్రిందట ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. సంవత్సరం కిందట మళ్ళీ మా పెద్దలు రెండో వివాహం చేశారు. మళ్ళీ అదే విధంగా ఈమెను కూడా అనుమానించి వేధిస్తున్నాడు. మావాడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో మాకర్థం కావడం లేదు. ఈమె కూడా వీడు పెట్టే బాధలు తట్టుకోలేక ఏమైనా చేసుకుంటుందేమోనని మాకు భయంగా ఉంది. మా తమ్ముడికి ఇలా మళ్ళీ పెళ్ళి చేయడం మా తప్పేనంటారా! అసలు మావాడెందుకు ఇలా చేస్తున్నాడో దయచేసి చెప్పండి.– పద్మావతి, గిద్దలూరుమీ తమ్ముడు ‘డెల్యూజనల్ డిసార్డర్’ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు మీరు రాసిన దాన్ని బట్టి అర్థమవుతుంది. దీనిని ‘ఒథెల్లో సిండ్రోమ్’ అని కూడా అంటారు. షేక్స్పియర్ రాసిన ‘ఒథెల్లో’ నాటకంలోని ఇతివృత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఎలాంటి ఆధారాలు లేకున్నా, వాస్తవం కాకపోయినా జీవిత భాగస్వామి శీలాన్ని శంకించి ఇలా వేధించడం ఒక విధమైన మానసిక జబ్బే! మెదడులోని కొన్ని రసాయనిక చర్యలవల్ల, వారసత్వంగా వచ్చే జీన్స్ ప్రభావం వల్లనూ కొందరికి ఈ వ్యాధి వస్తుంది. ఇది కూడా ఒక మానసిక రుగ్మత అని తెలియక మీరు మీ తమ్ముడికి మళ్లీ వివాహం చేసి పెద్దపొరపాటు చేశారు. మీ మరదలు చాలా మంచిదని మీరే చెబుతున్నారు కదా... మొదట్లోనే మీవాడిని మానసిక వైద్యునికి చూపించి తగిన చికిత్స చేయించి ఉంటే, మీ మరదలు అలా ఆత్మహత్య చేసుకొని ఉండకపోవచ్చు. ఏమైనా, మీ తమ్ముడికి వచ్చే ఈ అనుమానాలను తగ్గించేందుకు, మంచి మందులు, ఇతర చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఇంకో అఘాయిత్యం జరగక ముందే వెంటనే మీ తమ్ముణ్ణి దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌కు చూపించి వైద్యం చేయిస్తే మీ వాడు పూర్తిగా ఆ భ్రమలు, భ్రాంతుల నుండి బయటపడి రెండో భార్యతో సంతోషంగా సంసారం చేయగలడు. ఆలస్యం చేయకుండా మానసిక వైద్య చికిత్స చేయించండి. (చదవండి: సూర్యరశ్మికి కొదువ లేదు..ఐనా ఆ విటమిన్ లోపమే ఎక్కువ ఎందుకు..?) -
Nail Rings Photos: ఇది నెయిల్ ఆర్ట్ కాదు.. నెయిల్ రింగ్స్ (ఫోటోలు)
-
మళ్లీ రికార్డుల మోత
ముంబై: దేశీయ స్థూల ఆర్థిక వ్యవస్థపై ఆశావహ అంచనాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు బుధవారం సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బ్యాంకింగ్, కమోడిటీ, మెటల్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ తొలిసారి 72,000 పాయింట్ల ఎగువన, నిఫ్టీ 21,650 స్థాయిపై ముగిశాయి. ఉదయం లాభాల తో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదిలాయి. సెన్సెక్స్ 71,492 పాయింట్లు వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 783 పాయింట్లు ఎగసి 72,120 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 701 పాయింట్లు లాభపడి 72,038 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 235 పాయింట్లు బలపడి 21,676 వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆఖరికి 213 పాయింట్లు లాభపడి 21,655 వద్ద నిలిచింది. ఆయిల్ అండ్‌గ్యాస్, యుటిలిటీ, విద్యుత్, సేవా రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,926 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.192 కోట్ల షేర్లు విక్రయించారు. ర్యాలీ ఎందుకంటే...? ఫెడ్ రిజర్వ్ 2024 మార్చి కంటే ముందుగానే ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూలత దేశీయ మార్కెట్‌కు కలిసొచి్చంది. గత 20 ఏళ్ల ట్రేడింగ్ ట్రెండ్‌ను అనుసరిస్తూ ఈక్విటీ మార్కెట్లలో శాంటా క్లాజ్ ర్యాలీ కొనసాగుతుంది. (డిసెంబర్ చివరి 5 ట్రేడింగ్ సెషన్లు, జనవరి తొలి 2 ట్రేడింగ్ సెషన్లు మార్కెట్ పెరిగితే దానిని శాంటా ర్యాలీగా వ్యవహరిస్తారు). వాల్ స్ట్రీట్‌లో ‘సెల్ చైనా, బై భారత్’ వ్యూహం జోరుగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా డిసెంబర్లో ఎఫ్ఐఐలు రూ.57,275 కోట్ల ఈక్విటీలను కొన్నారు. రెండో త్రైమాసికంలో అలాగే భారత కరెంట్ ఖాతా లోటు తగ్గడం కలిసొచి్చంది. భారీ భద్రత నడుమ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రాకపోకల పునఃప్రారంభంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 80 డాలర్ల దిగువకు చేరుకుంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► చైనా తయారీ రంగం పుంజుకోవడం, డాలర్ బలహీనతతో అంతర్జాతీయంగా బేస్ మెటల్ ధరలు పెరగడం మెటల్ షేర్లకు డిమాండ్ పెంచింది. హిందాల్కో 4%, జేఎస్‌డబ్ల్యూ 3%, సెయిల్, నాల్కో 2% లాభపడ్డాయి. టాటా స్టీల్, వెల్‌స్పాన్ కార్ప్, హిందుస్థాన్ కాపర్, వేదాంతా, జిందాల్ స్టీల్ షేర్లు 1% వరకు పెరిగాయి. ► ఇటీవల ర్యాలీలో వెనకబడిన బ్యాంకింగ్ షేర్లు పుంజుకున్నాయి. పీఎన్బీ 4%, బ్యాంక్ ఆఫ్ బరోడా 3%, ఎస్బీఐ 2%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.50%, బంధన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఏయూస్మాల్‌ఫైనాన్స్ బ్యాంక్‌లు 1–6% లాభపడ్డాయి. ► 4 రోజుల్లో సెన్సెక్స్ 1,532 పాయింట్ల ర్యాలీ తో దలాల్ స్ట్రీట్‌లో రూ.11.11 లక్షల కోట్లు సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.361 లక్షల కోట్లకు చేరింది. -
తీరానికి కొట్టుకొచ్చిన వింత మెటల్ షీట్లు
న్యూయార్క్: అమెరికా తూర్పు తీరానికి వింత మెటల్ షీట్లు కొట్టుకువచ్చాయి. మెటల్ షీట్లకు ఫైబర్ ఊడిపోయి ఉంది. కూర్చోవడానికి వీలుగా ఉన్న ఈ మెటల్ షీట్లను మొదట యాక్టర్ మాథ్యూ జాకబ్ పెర్రీ గుర్తించాడు. న్యూజెర్సీలోని మార్గేట్లోని బీచ్ వెంబడి నడుచుకుంటూ వెళుతుండగా కనుగొన్నాడు. వింతగా ఉన్న ఈ ఉనుపషీట్లను వీడియో తీసి టిక్‌టాక్ వీడియోలో పోస్టు చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది. మెటల్ షీట్లపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ''అవి ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియలేదు. నేను మొదట చెట్టు కొమ్మ అనుకున్నాను. దగ్గరికొచ్చేసరికి మెటల్ షీట్లని అర్థమైంది. దగ్గరకు వచ్చేసరికి అవి విమానం సీట్లలాగే కనిపించాయి'' అని నటుడు జాకబ్ పీపుల్ మ్యాగజైన్‌తో అన్నారు. జాకబ్ పోస్టు చేసిన వీడియోలో తుప్పు పట్టిన మెటల్ షీట్లు ఇప్పటికీ స్ప్రింగ్‌లను కలిగి ఉన్నాయి. అప్పటికే ఫాబ్రిక్ ఊడిపోయింది. కొన్ని సీట్లు వాటి మధ్య మెటల్ హ్యాండ్‌రైల్‌ను కలిగి ఉన్నాయి. అవి విమానంలో ఉన్నట్లే ఉన్నాయి. ఈ వింత ఆకారాలపై సోషల్ మీడియోలో నెటిజన్లు విశేషంగా స్పందించారు. జూలై 17, 1996న అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిన టీడబ్ల్యూఏ విమానం 800 శిథిలాల నుంచి సీట్లు వచ్చి ఉండవచ్చని చాలా మంది అభిప్రాయపడ్డారు. TZB 900 విమానం అని మరో నెటిజన్ అన్నారు. అసలు అవి విమానం సీట్లు కానేకావని తాను ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్‌ని అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఇదీ చదవండి: ఆర్కియాలజిస్టులకు అప్పగించిన ఆర్మీ -
మెటల్, ఇంధన షేర్లలో కొనుగోళ్లు
ముంబై: మెటల్, ఇంధన, యుటిలిటీ, విద్యుత్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు పెరిగి 71,337 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లుబలపడి 21,441 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది మూడోరోజూ లాభాల ముగింపు. వరుస సెలవుల తర్వాత ఉదయం దేశీయ మార్కెట్ ఫ్లాట్‌గా మొదలయ్యాయి. అయితే ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు క్రమంగా లాభాల దిశగా కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 364 పాయింట్లు పెరిగి 71,471 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు బలపడి 71,471 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఐటీ, టెక్, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం చొప్పున రాణించాయి. బాక్సింగ్ డే సందర్భంగా యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. అమెరికా సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,636 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,464 కోట్ల షేర్లను కొన్నారు. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.75%), రిలయన్స్ (0.50%), కోటక్ బ్యాంక్ (1.35%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. మోటిసన్స్ లిస్టింగ్ భళా మోటిసన్స్ జ్యువెలరీ లిస్టింగ్ రోజునే ఇన్వెస్టర్లకు లాభాలను పంచింది. ఇష్యూ ధర రూ. 55తో పోలిస్తే బీఎస్ఈలో ఏకంగా 89 శాతం ప్రీమియంతో రూ. 104 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆపై ఒక దశలో 98 శాతంపైగా దూసుకెళ్లి గరిష్టంగా రూ. 109ను అధిగమించింది. చివరికి 84 శాతం లాభంతో రూ. 101 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలోనూ 98 శాతం జంప్‌చేసి రూ. 109 వద్ద లిస్టయ్యింది. ఆపై దాదాపు రూ. 110 వద్ద గరిష్టానికి చేరింది. చివరికి 88 శాతంపైగా వృద్ధితో రూ. 104 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 996 కోట్లుగా నమోదైంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 151 కోట్లు సమకూర్చుకున్న విషయం విదితమే. -
ఎవరీ సోమా మండల్? ఉక్కు పరిశ్రమకే క్వీన్‌గా..!
పెద్ద బాధ్యతను స్వీకరించినప్పుడు గర్వించదగిన క్షణాలు మాత్రమే ఉండవు. పెద్ద పెద్ద సవాళ్లు కాచుకొని కూర్చుంటాయి. భయపెడతాయి. ఆ సవాళ్లకు భయపడితే అపజయం మాత్రమే మిగులుతుంది. వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉంటే విజయం సొంతం అవుతుంది. ఇంజినీరింగ్ చదివే రోజుల నుంచి ఉక్కు పరిశ్రమలోకి అడుగు పెట్టే వరకు, ఉద్యోగ ప్రస్థానంలో రకరకాల సవాళ్లను ఎదుర్కొంది సోమా మండల్. వాటిని అధిగమించి అపురూపమైన విజయాలను సొంతం చేసుకుంది. తాజాగా...ఫోర్బ్స్ ‘వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్–2023’ జాబితాలో చోటు సంపాదించింది. భువనేశ్వర్‌లోని ఓ బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది సోమా మండల్. తండ్రి అగ్రికల్చర్ ఎకానమిస్ట్. అప్పట్లో చాలామంది తల్లిదండ్రుల ధోరణి ‘ఆడపిల్లలను ఒక స్థాయి వరకు చదివిస్తే చాలు. పెద్ద చదువు అక్కర్లేదు’ అన్నట్లుగా ఉండేది. సోమా తండ్రిలో మాత్రం అలాంటి భావన లేదు. ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను’ అనేవాడు.అలాంటి వ్యక్తి కాస్తా సోమా ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పుడు ‘కుదరదు’ అని గట్టిగా చెప్పాడు. ఎందుకంటే ఆరోజుల్లో అమ్మాయిలు ఇంజినీరింగ్ చదవడం అరుదు. తల్లి సహాయంతో నాన్న మనసు మారేలా చేసింది. రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసింది. ఇక కాలేజీ రోజుల విషయానికి వస్తే బ్యాచ్‌లో రెండు వందల మంది ఉంటే ఇద్దరు మాత్రమే అమ్మాయిలు. పాఠం వింటున్నప్పుడు ఏదైనా సందేహం అడగాలంటే అబ్బాయిలు నవ్వుతారేమోనని భయపడేది. అయితే ఒకానొక సమయంలో మాత్రం...‘అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే చదువు చదువుతున్నప్పుడు భయపడటం ఎందుకు?’ అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది...ఇక అప్పటి నుంచి ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. ఆ ధైర్యమే తన భవిష్యత్ విజయాలకు పునాదిగా నిలిచింది. సోమా మెటల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు మహిళా ఉద్యోగులు ఎక్కువగా లేరు. ‘మెటల్ ఇండస్ట్రీ అంటే పురుషుల ప్రపంచం’ అన్నట్లుగా ఉండేది. ఇక మహిళలు ఉన్నత స్థానాల్లోకి రావడం అనేది ఊహకు కూడా అందని విషయం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ భవిష్యత్‌పై ఆశను కోల్పోలేదు సోమా మండల్. నాల్కో(నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్)లోకి గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలి మహిళా డైరెక్టర్(కమర్షియల్) స్థాయికి చేరింది. 2017లో సెయిల్(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా)లోకి వచ్చిన తరువాత ఫస్ట్ ఉమెన్ ఫంక్షనల్ డైరెక్టర్, ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెయిల్‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది. సెయిల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన కాలంలో ఆ సంస్థ వేల కోట్ల అప్పులతో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌లో మార్పులు తీసుకువచ్చింది. మైక్రో–మేనేజ్మెంట్పై దృష్టి సారించింది. సెయిల్ ప్రాడక్ట్స్‌ను ప్రమోట్ చేయడానికి మార్గాలు అన్వేషించింది. గ్రామీణ ప్రాంతాలలో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. కొత్త వ్యాపార వ్యూహాలను అనుసరించింది. సోమా కృషి వృథా పోలేదు..అప్పులు తగ్గించుకుంటూ ‘సెయిల్’ను లాభాల దిశగా నడిపించింది. ‘నా కెరీర్లో జెండర్ అనేది ఎప్పుడూ అవరోధం కాలేదు. మహిళ అయినందుకు గర్వపడుతున్నాను. మన దేశంలో వివిధ రంగాలలో మహిళా నాయకుల సంఖ్య పెరుగుతోంది. లీడర్‌కు అసంతృప్తి ఉండకూడదు. ఆశాభావం ఉండాలి. పరిమిత వనరులు ఉన్నా సరే మంచి ఫలితం సాధించే సామర్థ్యం ఉండాలి’ అంటుంది సోమా మండల్. టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇచ్చే సోమా మండల్ అటు వృత్తి జీవితాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లింది. ‘సక్సెస్‌కు షార్ట్‌కట్ అనేది లేదు. అంకితభావం, సమర్థత మాత్రమే మనల్ని విజయానికి దగ్గర చేస్తాయి’ అంటుంది సోమా మండల్. (చదవండి: ఆమె నవయుగ సావిత్రి!) -
జేఎస్‌డబ్ల్యూతో ఎస్ఏఐసీ జత
న్యూఢిల్లీ: చైనా ఆటో రంగ దిగ్గజం ఎస్ఏఐసీ మోటార్.. దేశీ మెటల్ రంగ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో చేతులు కలిపింది. తద్వారా భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనుంది. ఈ జేవీ దేశీయంగా ఎంజీ మోటార్ ట్రాన్స్‌ఫార్మేషన్‌తోపాటు.. వృద్ధికి సహకరించనుంది. లండన్‌లో జరిగిన వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం జేవీలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ 35 శాతం వాటాను పొందనున్నట్లు తెలుస్తోంది. దేశీ వినియోగదారునిపై దృష్టితో నవతరం టెక్నాలజీ, ప్రొడక్టుల ద్వారా మొబిలిటీ సొల్యూషన్స్ అందించేందుకు జేవీకి ఎస్ఏఐసీ మద్దతివ్వనుంది. అయితే కొత్తగా ఏర్పాటు చేయనున్న జేవీలో జేఎస్‌డబ్ల్యూ 35 శాతం వాటా తీసుకోనుందా లేక ఎస్ఏఐసీ మోటార్ సొంత అనుబంధ సంస్థ ఎంజీ మోటార్ ఇండియాలో పొందనుందా అనే విషయంపై రెండు కంపెనీల నుంచీ స్పష్టతలేకపోవడం గమనార్హం. ఒకప్పటి బ్రిటిష్ బ్రాండ్ ఎంజీ మోటార్‌ను ప్రస్తుతం షాంఘై దిగ్గజం ఎస్ఏఐసీ మోటార్ సొంతం చేసుకుంది. కాగా.. రానున్న ఐదేళ్ల కాలపు ప్రణాళికలో భాగంగా దేశీ కంపెనీలకు 2–4 ఏళ్లలో మెజారిటీ వాటాలను ఆఫర్ చేయనున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా ఈ ఏడాది మొదట్లో ప్రకటించింది. తదుపరి దశ వృద్ధికి వీలుగా ఎంజీ మోటార్ నిధుల సమీకరణపై దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. -
ఆకుకూరలు మంచిదని తినేస్తున్నారా? శాస్త్రవేత్తలు స్త్రాంగ్ వార్నింగ్!
ఆకుకూరలు తినడం మంచిదని తినేస్తుంటారు. కానీ ఇవి ఎలా పండుతున్నాయ్, వాటిలో ఏం ఉంటున్నాయ్ అన్నవి తెలుసుకోకపోతే లేనిపోని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. బెంగుళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లోని దుకాణాల్లో అస్సలు ఆకుకూరలు కొనుగోలు చేయొద్దు, తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఎందుకని? ఏం జరిగింది... బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఆకుకూరలను మరుగు నీటి వ్యర్థాలతో పండిస్తున్నారు. దీంతో ఆ మొక్కలు మోతాదుకు మించి లోహన్ని గ్రహిస్తున్నాయిని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అందులోనూ ఆకుకూరలు కూరగాయాల కంటే ఎక్కువ లోహాన్ని గ్రహిస్తాయి. ఈ మేరకు బెంగళూరులోని ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు కొన్ని ఆకుకూరలను సేకరించి పరీక్షించగా వాటిలో అధిక మోతాదులో మెటల్ సాంద్రతలు ఉన్నట్లు గుర్తించారు. వారి పరిశోధన ప్రకారం కూరగాయాల్లో సూచించిన దాని కంటే లోహాలు అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అవి కాస్త హైపర్ అక్యుమ్యులేటర్లుగా మారాయని పరిశోధకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బచ్చలి, ఆకుకూరల్లో లోహం మోతాదు ఎక్కువుగా ఉన్నట్లు తెలిపారు. అలాగే కొన్ని రకాల కాయగూరల్లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇలా అధిక మోతాదులో మెటల్ కలిగిన కలుషిత ఆకుకూరలు,కాయగూరలు తీసుకోవడం వల్ల క్యాన్సర్, రక్తహీనత, రక్తపోటు, పోషకాహార లోపం వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆకుకూరల్లో ఉండాల్సిన లోహం 425.5 mg/kg కాగా, వాటిలో 514.05 mg/kg లోహం ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. భారీ లోహలు మానవ శరీరాన్ని బాగా ప్రభవితం చేస్తాయిని, ఫలితంగా ఈ కింది అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కాలేయం సంబంధిత సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు మూత్రపిండ పమస్యలు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ రక్తహీనత ఊపిరి ఆడకపోవడం లేదా ఆస్మా వంటి వ్యాధులు పిల్లలు కౌమారదశలోనే ఊబకాయం రావడం కాలేయ క్యాన్సర్ గుండె జబ్బులు ఎముకల వ్యాధులు పుట్టుకతో వచ్చే వైకల్యాలు తక్కువ జనన బరువు అందువల్ల దయచేసి సేంద్రీయ ఎరువులతో సురక్షితమైన ప్రదేశంలో పెరిగిన ఆకుకూరలనే తినేందుకు యత్నించండి. కుదరకపోతే ఎట్టిపరిస్థితుల్లో అలా పండిన ఆకుకూరలను అస్సలు తినొద్దని స్త్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం బెంగుళూరులోని ఆకుకూరలన్నింటిలో లోహం సాంద్రత ఎక్కువ ఉందని బెంగుళూరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ కమిషనర్ ప్రకారం అసురక్షితంగా లోహం అధికంగా ఉన్న కూరగాయాలను పండిస్తున్న లేదా విక్రయిస్తున్న వారిని ఆరు నెలల నుంచి ఆరేళ్ల వరకు జైలు శిక్ష తోపాటు లక్ష నుంచి ఐదు లక్షల వరకు జరిమానా పడుతుంది. (చదవండి: ఏకంగా 27 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది!ఆల్మోస్ట్ డెడ్ కానీ..) -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ఘనత
ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్–2 (కృష్ణ) విభాగంలో ఉత్పత్తి 50 మిలియన్ టన్నులకు చేరింది. ఈ విభాగం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 50 మిలియన్ టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి సాధించి మరో మైలురాయికి చేరుకుంది. ఈ విభాగంలో ఉత్పత్తి 1992 మార్చి 21న ప్రారంభమైంది. 50 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరుకున్న సందర్భంగా విభాగంలో గురువారం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ అతుల్ భట్ మాట్లాడుతూ ప్లాంట్‌కు అత్యంత కీలక విభాగమైన బ్లాస్ట్ ఫర్నేస్ మరో మైలురాయికి చేరుకోవడం అభినందనీయమన్నారు. ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషి ఫలితంగా ఈ విజయం సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎ.కె.బాగ్జి, సీజీఎం (వర్క్స్) ఎన్.వి.స్వామి, సీజీఎం (ఐరన్) ఆర్.మొహంతి, విభాగాధిపతి ఉదయ్‌నాగ్ పాల్గొన్నారు. -
విడిగా వివిధ బిజినెస్‌ల లిస్టింగ్: అనిల్ అగర్వాల్ మెగా ప్లాన్
న్యూఢిల్లీ: మైనింగ్, మెటల్ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ గ్రూప్‌లోని బిజినెస్‌లను విడిగా లిస్ట్ చేయాలని భావిస్తోంది. వాటాదారులకు మరింత విలువ చేకూర్చేబాటలో అల్యూమినియం, ఇనుము–ఉక్కు, చమురు–గ్యాస్ తదితర విభాగాలను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే యోచనలో ఉన్నట్లు వేదాంతా గ్రూప్ చీఫ్ అనిల్ అగర్వాల్ తాజాగా పేర్కొన్నారు. మాతృ సంస్థ వేదాంతా రీసోర్సెస్ వీటన్నిటికీ హోల్డింగ్ కంపెనీగా కొనసాగనుంది. (మార్కెట్లో దూసుకుపోతున్న భారత్: ఈ నంబర్ ప్లేట్ల గురించి తెలుసా?) వాటాదారులకు వీడియో సందేశం ద్వారా చైర్మన్ అనిల్ అగర్వాల్ ఈ వివరాలు వెల్లడించారు. మెటల్స్ అండ్ మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితరాలను విడిగా లిస్ట్ చేయడం ద్వారా భారీగా వృద్ధి చెందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. వెరసి వేదాంతా లిమిటెడ్‌లో 1 షేరుని కలిగి ఉంటే పలు కంపెనీలలో షేర్లను పొందేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు. (పండగ సీజన్..బీఅలర్ట్: సెప్టెంబరులో బ్యాంకు సెలవులెన్నో తెలుసా?) తొలుత 2021 నవంబర్‌లో అగర్వాల్ బిజినెస్‌ల విడదీత, వ్యూహాత్మక భాగస్వామ్యాలు తదితరాల ద్వారా కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ నిర్మాణాన్ని క్రమబదీ్ధకరించడం, సరళీకరించడం ద్వారా వాటాదారులకు లబ్ది చేకూర్చాలని భావించారు. దీర్ఘకాలిక వృద్ధికి తెరతీయాలని ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు. అయితే ప్రస్తుతం ఇందుకున్న అవకాశాలపై వాటాదారులు, తదితరుల అభిప్రాయాలకు ఆహా్వనం పలుకుతున్నారు. రెండు దశాబ్దాలుగా.. గత రెండు దశాబ్దాలలో వేదాంతా దిగుమతుల ప్రత్యామ్నాయంగా ఎదిగినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో ఆయా విభాగాలలో ప్రవేశించడం అత్యంత క్లిష్టతరమని అభిప్రాయపడ్డారు. ఆయిల్ అండ్ గ్యాస్‌తోపాటు భారీ స్థాయిలో అల్యూమినియంను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రస్తావించారు. ఈ బాటలో సమీకృత విద్యుత్, కాపర్, జింక్, సిల్వర్, లెడ్, ఐరన్ అండ్ స్టీల్, నికెల్, ఫెర్రోఅల్లాయ్స్, సెమీకండక్టర్, డిస్ప్లే గ్లాస్ తదితర మరిన్ని విభాగాలలో కార్యకలాపాలు విస్తరించినట్లు వివరించారు. ప్రస్తుతం ఇవన్నీ వేదాంతా గొడుగుకిందనే ఉన్నట్లు తెలియజేశారు. మొత్తం ప్రపంచమంతా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు స్వతంత్ర కంపెనీలపట్లనే ఆసక్తి చూపుతారని, ప్రత్యేక కంపెనీగా విడిపోవడం ద్వారా కీలక బిజినెస్‌పై దృష్టి సారించగలుగుతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇన్వెస్టర్లకు తమకిష్టమైన రంగాలు, కంపెనీలలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని వివరించారు. తద్వారా ఉత్తమ రిటర్నులతోపాటు డివిడెండ్లు అందుతాయని అంచనా వేశారు. -
మెటల్, ఆటో షేర్లకు డిమాండ్
ముంబై: మెటల్, ఆటో, బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు శుక్రవారం స్వల్పలాభపడ్డాయి. అమెరికా ఉద్యోగ గణాంకాల వెల్లడి, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఉదయం సెన్సెక్స్ 173 పాయింట్ల పెరిగి 62,602 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 18,551 వద్ద మొదలయ్యాయి. సానుకూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు మిడ్ సెషన్లో కొంత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసి రావడంతో తిరిగి లాభాల బాటపట్టాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 340 పాయింట్ల పరిధిలో 62,380 వద్ద కనిష్టాన్ని, 62,720 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,478 – 18,574 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి సెన్సెక్స్ 119 పాయింట్లు బలపడి 62,547 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 18,534 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీ లు అరశాతానికి పైగా లాభపడ్డాయి. ఐటీ, వినిమయ, ఇంధన షేర్లు మాత్రమే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 45 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ‘‘అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. దేశీయంగా మే నెల ఆటో అమ్మకాలు మెరుగ్గా ఉండటం, జీఎస్టీ ఆదాయ వృద్ధి, తయారీ కార్యకలాపాలను సూచించే పీఎంఐ సూచీ 31 నెలల గరిష్టానికి చేరుకోవడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచాయి’’ అని మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. -
వింత ఘటన: 56 బ్లేడులు మింగిన వ్యక్తి!
కొంతమందికి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. వాళ్లు హార్మోన్ల లోపం వల్ల అలా ప్రవర్తిస్తుంటారే లేక మరేదైన కారణమా అనేది ఎవరికీ అంతుపట్టదు. కానీ ఆయా పనులు వాళ్ల ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంటాయి. అచ్చం అలాంటి ఘటనే రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే..రాజస్తాన్‌కి చెందిన 25 ఏళ్ల యువకుడు అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను తన నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటున్నాడు. ఒక రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉన్నటుండి ఆ యువకుడు రక్తపు వాంతులు చేసుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సమాచారం అందుకున్న స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ నర్సిరామ్ దేవాసి ఆయువకుడి సమస్యం ఏంటో తెలుసుకునేందుకు ఎక్స్‌రే తీయించారు. అందులో ఆ వ్యక్తి కడుపులో ఏదో లోహం ఉన్నట్లు తేలింది. దీంతో అతనికి సోనోగ్రఫీ, ఎండోస్కోపీ నిర్వహించాగా..డాక్టర్లకి ఆ వ్యక్తి కడుపులో బ్లేడ్లు ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది. వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించి దాదాపు 56 బ్లేడులు తీశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. అతను బ్లేడ్లను కవర్లతో సహా తిన్నాడని అందువల్లే అవి తింటున్నప్పుడూ నొప్పిగానీ, రక్తస్రావం గానీ జరగలేదరని చెప్పారు. అయితే అవి కడుపులోపలకి చేరాక కాగితం మొత్తం కరిగిపోయి బ్లేడ్లు ఉండటంతో.. క్రమంగా ఆరోగ్యం దెబ్బతినడం ప్రారంభించింది. దీంతో వ్యక్తి లోపల గ్యాస్ ఏర్పడి మనిషి వికారం వచ్చి వాంతులు రావడం జరిగిందని అన్నారు. ఐతే అతను ఆ బ్లేడు తినేటప్పుడే వాటిని రెండుగా విడగొట్టి మరీ తిన్నాడని చెప్పారు. అతను ఇలా చేయడానికి గల కారణాలేంటో తమకు తెలియదని అతడి బంధువులు చెబుతున్నారు. (చదవండి: వీడి కథేంటో.. కారు డిక్కీలో కూర్చొని డబ్బులు విసిరేస్తూ..!) -
మెటల్, ఇంధన షేర్లు డీలా
ముంబై: మెటల్, ఇంధన, ఐటీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. క్రూడాయిల్ రికవరీ, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. అదానీ గ్రూప్‌లోని నాలుగు కంపెనీలపై మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్(ఎంఎస్సీఐ) వెయిటేజీ తగ్గింపు, ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంలో ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా పూర్తిగా వాటా విక్రయం అంశాలూ ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. ట్రేడింగ్‌లో 272 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 124 పాయింట్లు పతనమై 60,683 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 17,856 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 17,781 వద్ద కనిష్టాన్ని, 17,877 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. రియల్టీ, వినిమయ, మౌలిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,458 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.291 కోట్లను విక్రయించారు. ఎంఎస్సీఐ వెయిటేజ్ తగ్గింపుతో అదానీ గ్రూప్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపింది. డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు పైసలు బలపడి 82.51 స్థాయి వద్ద స్థిరపడింది. -
లోహాల ఉత్పత్తిలోనూ ‘ఆత్మనిర్భరత’ కావాలి
సాక్షి, హైదరాబాద్: ఇనుము, ఉక్కు వంటి లోహాల ఉత్పత్తిలోనూ మన దేశం ‘ఆత్మనిర్భరత’సాధించేందుకు శాస్త్రవేత్తలు తగిన టెక్నాలజీలను అభివృద్ధి చేయాలని కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే పిలుపునిచ్చారు. ప్రపంచం గర్వించదగ్గ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు భారత్‌లో ఉన్నారని, సామర్థ్యానికి తగ్గట్టుగా కృషి చేస్తే అసాధ్యం అనేది ఉండదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ వార్షిక సాంకేతిక సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిభకు కొరతేమీ లేదని, కావాల్సిందల్లా కొద్దిపాటి ప్రోత్సాహం మాత్రమేనని అన్నారు. కోవిడ్ సమయంలోనూ ఈ విషయం రుజువైందని, రికార్డు సమయంలో టీకాలు తయారు చేయడమే కాకుండా.. వాటిని అందరికీ అందించడం ద్వారా లక్షల ప్రాణాలను కాపాడుకోగలిగామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలోని అన్ని వ్యవస్థల్లోనూ మార్పు కనిపిస్తోందని తెలిపారు. అంతకు ముందు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్సలర్ బి.జె.రావు మాట్లాడుతూ లోహశాస్త్రంలో అద్భుతాలు సృష్టించేందుకు బోలెడన్ని అవకాశాలు ఉన్నా యని, కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నా లజీల సాయంతో మునుపెన్నడూ ఎరుగని లక్షణాలున్న లోహా లను తయారు చేసి వాడుకోవ చ్చునని వివరించారు. శాస్త్రవేత్తలు ఈ దిశగా కృషి చేయాలని కోరారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుందని, వెయ్యిమందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఐఎం హైదరాబాద్ చైర్మెన్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి, డీఎమ్ఆర్ఎల్ డైరెక్టర్ డాక్టర్ జి. మధుసూధన్ రెడ్డి, ఐఐఎం అధ్యక్షుడు, డీఆర్డీఓ చైర్మన్ సమీర్ వి.కామత్‌లు పాల్గొన్నారు. -
మెటల్ దిగ్గజంగా టాటా స్టీల్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా స్టీల్ భారీ విలీనానికి సన్నాహాలు చేస్తోంది. గ్రూప్‌లోని 7 మెటల్ అనుబంధ కంపెనీలను విలీనం చేసుకునే ప్రణాళికలు అమలు చేయనుంది. ఇందుకు వీలుగా గతంలో ప్రతిపాదించిన టాటా మెటాలిక్స్, టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ విలీనాన్ని విరమించుకుంది. వెరసి తాజాగా ఈ రెండు సంస్థలతోపాటు.. టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా, టీఆర్ఎఫ్ లిమిటెడ్, ఇండియన్ స్టీల్ – వైర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్ మైనింగ్, ఎస్‌అండ్‌టీ మైనింగ్‌ను విలీనం చేసుకోనున్నట్లు టాటా స్టీల్ పేర్కొంది. ఈ విలీనంతో సామర్థ్యాల పెంపు, వ్యయాల తగ్గింపునకు బాటలు వేసుకోనుంది. ఇందుకు షేర్ల మార్పిడి(స్వాప్) విధానాన్ని అవలంబించనుంది. ఈ ప్రతిపాదనను బోర్డు అనుమతించినట్లు టాటా స్టీల్ వెల్లడించింది. విలీనమిలా.. గ్రూప్‌లోని మెటల్ కంపెనీల విలీనానికి టాటా స్టీల్ షేర్ల మార్పిడి నిష్పత్తులను ప్రకటించింది. వీటి ప్రకారం ఆయా కంపెనీల వాటాదారుల వద్దగల ప్రతీ 10 షేర్లకుగాను టాటా స్టీల్ షేర్లను ఇలా కేటాయించనుంది. టీఆర్ఎఫ్ వాటాదారులకు 17, టీఎస్‌పీఎల్‌కు 67, టిన్ప్లేట్కు 33, టాటా మెటాలిక్స్కు 79 చొప్పున షేర్లను జారీ చేయనుంది. ఇండియన్ స్టీల్ – వైర్ ప్రొడక్ట్స్‌లో టాటా స్టీల్‌కు 95 శాతం వాటా ఉంది. టాటా స్టీల్ మైనింగ్, ఎస్‌అండ్‌టీ మైనింగ్ పూర్తి అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. మిగిలిన మూడు కంపెనీలలో 75–60 శాతం మధ్య వాటాలను కలిగి ఉండగా.. టీఆర్ఎఫ్లో వాటా 34.11 శాతం మాత్రమే. అవకాశాలపై దృష్టి అనుబంధ సంస్థల శక్తిసామర్థ్యాలను ఏకీకృతం చేయడం ద్వారా వాటాదారుల విలువ పెంపునకు అవకాశాలను సృష్టించుకోనున్నట్లు విలీనంపై టాటా స్టీల్ స్పందించింది. కంపెనీలన్నిటి మధ్య సమన్వయం ద్వారా ఒక సంస్థ సౌకర్యాలను మరొక కంపెనీ వినియోగించుకునేందుకు వీలుంటుందని తెలియజేసింది. ఇది మరింత సమర్థవంత వినియోగానికి దారి చూపుతుందని వివరించింది. అంతేకాకుండా మార్కెటింగ్, పంపిణీ నెట్వర్క్ సైతం పరస్పరం సహకరించుకోనున్నట్లు తెలియజేసింది. కాగా.. చంద్రశేఖరన్ అధ్యక్షతన గ్రూప్‌లోని కంపెనీలు బిజినెస్‌లను ఒక్కటిగా చేయడం ద్వారా పరస్పర లబ్దిని పొందనున్నట్లు ఈ ఏడాది మొదట్లోనే టాటా గ్రూప్ పేర్కొంది. ఈ బాటలో టాటా కన్జూమర్, టాటా కాఫీ విలీనాన్ని ప్రకటించింది. ఇదే విధంగా 2024కల్లా ఎయిరేషియా, విస్తారాలను ఎయిరిండియా బ్రాండుకిందకు తీసుకురానున్నట్లు తెలియజేసింది. 2019 నుంచి టాటా స్టీల్ వివిధ రకాలుగా 116 సహచర కంపెనీల సంఖ్యను తగ్గించుకోవడం గమనార్హం. -
Madakasira: తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత!
మడకశిర: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో దాదాపు 40 కలర్ గ్రానైట్, మెటల్ క్వారీలు ఉన్నాయి. అన్నీ కర్ణాటక సరిహద్దుల్లోనే ఉండడం నిర్వాహకులకు కలిసివస్తోంది. రాత్రికి రాత్రే సులభంగా విలువైన ఖనిజాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. అగళి మండలం పీ బ్యాడిగెర క్వారీల్లో తీసిన కలర్ గ్రానైట్ దిమ్మెలకు కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే ఈ గ్రానైట్ చాలా నాణ్యమైంది. ఈ క్వారీల నిర్వాహకులు నెలకు రూ.కోట్లల్లో విలువ చేసే కలర్ గ్రానైట్ తరలిస్తారు. ఇందులో దాదాపు 50 శాతం అక్రమంగా రవాణా అవుతోంది. ఇక.. రొళ్ల మండలం హొట్టేబెట్ట వద్ద బుడ్డప్ప అనే వ్యక్తికి ప్రభుత్వం 3.09 ఎకరాల భూమికి డీపట్టా ఇచ్చింది. ఇందులో ఇతను ఎలాంటి అనుమతి పొందకుండా క్వారీ ప్రారంభించాడు. కర్ణాటకకు చెందిన వ్యక్తికి లీజుకిచ్చి కొన్ని నెలల పాటు అక్రమంగా కలర్ గ్రానైట్ దిమ్మెలు తీసి కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకున్నారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు వెళ్లి పనులను నిలిపివేశారు. మైనింగ్ అధికారులు మాత్రం ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. మైనింగ్ చేయడానికి నిర్వాహకులు ముందుగానే గనులశాఖ నుంచి అనుమతి పొందాలి. అధికారులు క్యూబిక్ మీటర్ల ప్రకారం తవ్వకాలకు అనుమతి ఇస్తారు. హద్దులు కూడా నిర్ణయిస్తారు. ఆ ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి మైనింగ్ చేసుకోవాలి. అయితే క్వారీ నిర్వాహకులు వందల క్యూబిక్ మీటర్లకు అనుమతి పొంది వేల క్యూబిక్ మీటర్లలో మైనింగ్ చేసిన సంఘటనలు ఇటీవల సీజ్ చేసిన క్వారీల్లో వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మడకశిర కలర్ గ్రానైట్ చాలా నాణ్యంగా ఉంటుంది. దీంతో దీనికి చాలా డిమాండ్. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో మడకశిర గ్రానైట్ చాలా ప్రసిద్ధి. ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతోంది. రూ.కోట్లలో క్వారీ నిర్వాహకులకు ఆదాయం లభిస్తుంది. దీంతో అందరి కన్ను మడకశిర గ్రానైట్‌పైనే పడుతోంది. మడకశిర ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి ఇటీవల అమరావతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక మైనింగ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఎమ్మెల్యే వారి దృష్టికి తీసుకెళ్లారు. విలువైన గ్రానైట్ సరిహద్దులు దాటుతున్నా మైనింగ్ శాఖ పత్తా లేదు. అక్రమ మైనింగ్‌పై స్థానిక పోలీసులే ఎక్కువ కేసులు నమోదు చేశారు. ఇటీవల కాలంలో మైనింగ్‌శాఖ అధికారులు పెద్దగా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో మడకశిర ప్రాంతంలోని క్వారీలపై మైనింగ్‌శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్న క్వారీలను సీజ్ చేసి రూ.కోట్లలో రాయల్టీ విధించారు. ప్రస్తుతం రూ. కోట్లల్లో అక్రమ రవాణా సాగుతున్నా, అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మా దృష్టికి వస్తే చర్యలు మడకశిర ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. సరిహద్దుల్లో ఉన్న క్వారీలపై ప్రత్యేక నిఘా పెట్టాం. అక్రమంగా మైనింగ్ చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు. క్వారీల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. – బాలసుబ్రమణ్యం, ఏడీ, గనులశాఖ -
మెటల్, ఎఫ్ఎంసీజీ నష్టాలు, సెన్సెక్స్ డౌన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ వెంటనే నష్టాల్లోకి జారుకుంది. అలా రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన సెన్సెక్స్ చివరికి 236 పాయింట్లు కోల్పోయి 54,052 వద్ద, నిఫ్టీ 90 పాయింట్ల నష్టంతో ముగిసాయి. తద్వారా నిఫ్టీ 16, 150 స్థాయి దిగువకు చేరింది. మెటల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మ పవర్ రియల్టీ ఇలా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ స్వల్పంగా లాభపడింది. దివీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్ ,హెచ్‌యుఎల్ టాప్ లూజర్స్‌గానూ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, నెస్లే ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ టాప్ నిఫ్టీ గెయినర్లుగా నిలిచాయి. -
అమేజింగ్ స్టంట్! నువ్వు గ్రేట్ స్వామీ! ఫిదా అయిన ఎలన్ మస్క్
Man put his hand in molten metal without Injured: ఇంతవరకు ఎన్నో రకాల వైరల్ వీడియోలు చూశాం. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం వామ్మో అని కచ్చితంగా అంటారు. ఎందుకంటే అంతలా ఉంటుంది ఆ ఫీట్. ఆ అమేజింగ్ స్టంట్ చూసి టెస్లా దిగ్గజం ఎలన్ మస్క్ సైతం స్ఫందించారు. వివరాల్లోకెళ్తే...ఒక వ్యక్తి కరిగిన ద్రవ లోహం అత్యంత వేడిగా ఉంటుంది. అలాంటి లోహ ద్రవాల వద్ద పనిచేసేవాళ్లు సైతం ఆ ఉష్టోగ్రతను తట్టుకోలేరు. అలాంటిది ఆ వ్యక్తి ఏకంగా కరిగిన ద్రవ లోహంలో నేరుగా చేయి పెట్టి తీశాడు. అయితే ఆ వ్యక్తి చేతి మీద గాయం గానీ కందినట్లు గానీ లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్ తెగ వైరల్ అవుతుంది. మొదట్లో నెటిజన్లు ఇది ఫేక్ వీడియో అనుకున్నారు గానీ ఇది ఒరిజనల్ స్టంటేనని తేలింది. ఈ వీడియోని చూసిన టెస్లా సీఈవో ఎలన్ మస్క్.. వావ్ అద్భుతం అతనికి ఎలాంటి గాయాలు కాలేదు అని అన్నారు. అంతేకాదు ఎవరు ఇలాంటి స్టంట్లు చేయవద్దని సోషల్ మీడియాలో ట్విట్ చేశారు కూడా. అయితే ఈ స్టంట్‌ని లైడెన్‌ఫ్రాస్ట్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. దీని ప్రభావం వల్ల నీటి బిందువులు తక్షణమే ఆవిరైపోకుండా, అత్యంత వేడిగా ఉండే హాబ్పై నృత్యం చేస్తాయి. అంతేకాదు ఆ మనిషి చేయికి గాయం కాకపోవడానికి కారణం అతని చర్మం ఉపరితలం మీద నీరు వేగంగా ఆవిరైపోతోందని, శక్తిమంతమైన తాత్కలిక నీటి ఆవిరి అతని చర్మాన్ని రక్షింస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. A really dramatic example of the Leidenfrost effect the moisture on his skin boils instantly, forming a layer of steam that insulates for a very short time, a temporary barrier between this person and the molten metal pic.twitter.com/USwGCRlj5Q — Science girl (@gunsnrosesgirl3) March 29, 2022 (చదవండి: ఫుడ్ డెలివరీ బాయ్ ఎంట్రీతో రచ్చ రచ్చ అయిన ప్రేమికుల గొడవ...వీడియో వైరల్) -
విశాఖ స్టీల్‌ప్లాంట్ సరికొత్త రికార్డు
ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ నెలలోనే ఐదు సార్లు అత్యధికంగా హాట్ మెటల్ ఉత్పత్తి చేసి రికార్డులు నమోదు చేసిన స్టీల్ ప్లాంట్.. తాజాగా వాటిని అధిగమించింది. ఆవిర్భావ దినోత్సవం రోజైన శుక్రవారం.. బ్లాస్ట్ ఫర్నేస్–1లో 8,019 టన్నుల హాట్ మెటల్‌ను ఉత్పత్తి చేసింది. అంతకుముందు అత్యధికంగా ఈ నెల 8న 7,620 టన్నులు, 13న 7,670 టన్నులు, 15న 7,730 టన్నులు, 16న 7,835 టన్నులు, 17న ఉత్పత్తి 7,874 టన్నుల ఉత్పత్తి ద్వారా నెలకొల్పిన రికార్డులను అధిగమించింది. కార్మికులను సీఎండీ అతుల్ భట్, డైరెక్టర్(ఆపరేషన్స్) ఏకే సక్సేనా అభినందించారు. -
దొంగతనంలో కొత్త టెక్నిక్.. ధూమ్ సినిమాకి ఏ మాత్రం తక్కువ కాదు
చెన్నై: ఇటీవల చెన్నైలో జరిగిన ల్యాప్‌టాప్ దొంగతనాలు చూస్తుంటే బాలీవుడ్ ధూమ్ చిత్రానికి ఏ మాత్రం తక్కువ కాదనిపిస్తుంది. ఎందుకంటే దోపిడీకి దొంగలు ఉపయోగించే వివిధ పద్ధతులను మనం చూసుంటాం, కానీ ఇది అంతకు మించి అనేలా ఉంది. పక్కాగా ప్లాన్ చేస్తూ ఓ దోపిడీ గ్యాంగ్ కార్ల నుంచి ల్యాప్‌టాప్ దొంగతనం చేయడానికి కేవలం రబ్బరు బ్యాండ్, మెటల్ బాల్లను ఉపయోగించి సింపుల్‌గా తస్కరిస్తున్నారు. ఎట్టకేలకు పోలీసులు వాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు. అసలు వారు దానిని ఎలా చేసారంటే.... మొదటగా దొంగతనానికి టార్గెట్‌గా ఒక కారు ఫిక్స్ చేసుకుంటారు. ఆ తర్వాత, చుట్టు పక్కల ఎవరూ లేకుండా జాగ్రత్త పడతారు. చివరగా రబ్బర్ బ్యాండ్, మెటల్ బాల్ని ఉపయోగించి కారు విండోను పగలగొట్టేసి అందులోని విలువైన వస్తువులను స్వాహా చేస్తారు. ఈ దోపిడీ ముఠా అనేక సందర్భాల్లో ఈ విధంగానే ఫాలో అవుతూ వాహనాల అద్దాలను పగలగొట్టి, చెన్నై నగరంలో పార్క్ చేసిన కార్ల నుంచి కనీసం ఎనిమిది ల్యాప్‌టాప్‌లు, రూ .1.2 లక్షలు దొంగిలించారు. కాగా బెంగుళూరులోని ఒక రహస్య ప్రదేశంలో ఉండగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో, ఓ నిందితుడు వాళ్లు ఈ ప్లాన్‌ని పూసగుచ్చినట్లు వివరించాడు. దీంతో ఈ బండారం బయటపడింది. దీన్నంతటిని పోలీసులు వీడియో చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేశారు. చదవండి: Marital Affair: వివాహేతర సంబంధం.. ఎంత చెప్పినా వినలేదు.. చివరికి -
టోకు ధరలు తీవ్ర రూపం!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో తీవ్ర రూపం దాల్చింది. 7.39 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 మార్చితో పోల్చితే 2021 మార్చిలో టోకు బాస్కెట్లోకి ఉత్పత్తుల ధరలు 7.39 శాతం పెరిగాయన్నమాట. గడచిన ఎనిమిది సంవత్సరాల్లో (అక్టోబర్ 2012లో 7.4 శాతం) ఈ స్థాయి ద్రవ్యోల్బణం రేటు ఇదే తొలిసారి. క్రూడ్ ఆయిల్, మెటల్ ధరలు భారీగా పెరగడం మొత్తం బాస్కెట్‌పై ప్రభావం చూపింది. అలాగే గత ఏడాది అతి తక్కువ ధరలు (బేస్ ఎఫెక్ట్) కూడా ‘భారీ పెరుగుదల రేటు’కు కారణంగా ఉంది. 2020 మార్చిలో టోకు ద్రవ్యోల్బనం 0.42 శాతం కావడం గమనార్హం. 2021 ఫిబ్రవరిలో ఈ రేటు 4.17 శాతంగా ఉంది. గడచిన మూడు నెలలుగా టోకు ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. ► ఫుడ్ ఆర్టికల్స్‌లో 3.24% టోకు ద్రవ్యోల్బణం నమోదయ్యింది. పప్పు దినుసుల ధరలు 13.14%, పండ్లు, ధాన్యం విషయంలో ధరాభారం వరుసగా 16.33%, 1.38%గా ఉన్నా యి. కూరగాయల ధరలు 5.19% తగ్గాయి. ► ఫ్యూయెల్ అండ్ పవర్ బాస్కెట్ టోకు ధరలు 10.25 శాతం పెరిగాయి. ► మొత్తం సూచీలో దాదాపు 55 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ద్రవ్యోల్బణం 7.34 శాతంగా నమోదైంది. -
మెటల్ జోరు, డబుల్ సెంచరీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం మరింత పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్226 పాయింట్ల లాభంతో 49978 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు ఎగిసి 14778 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ళ అసక్తి నెలకొంది. యూపీఎల్, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ,ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ నష్టపోతున్నాయి. ప్రధానంగా మంగళవారం యూపీఎల్ గుజరాత్ యూనిట్లో మంటలు చెలరేగడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో 5 గురు మిస్ అయ్యారు. దీంతో ఈ షేరు భారీగా నష్టపోతోంది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ,ఎల్ అండ్ టీ ఓఎన్జీసీ, కోల్ ఇండియా, హీరో మోటో, ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, ఐవోసీ లాభపడుతున్నాయి. -
మిస్టరీ: ఇక్కడ మాయం.. అక్కడ ప్రత్యక్షం
బుకారెటస్ట్, రొమేనియా: గత నెల ఉటా ఎడారిలో ఓ లోహపు దిమ్మె ప్రత్యక్షం అయ్యి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. సడెన్‌గా ప్రత్యక్షం అయిన దిమ్మె.. అంతే సడెన్‌గా మాయమవ్వడంతో ఏలియన్స్ పనే అని చర్చించుకుంటున్నారు నెటిజనులు. లోహపు దిమ్మె కనిపించకుండా పోయినప్పుడు ‘ఉటా ఎడారి నుంచి మాయమయ్యింది.. ఇక ఇప్పుడు ఎక్కడ ప్రత్యక్షం కానుందో’ అంటూ కామెంట్ చేశారు కొందరు నెటిజనులు. వారి మాటలు నిజమయ్యాయి. ఉటాలో మాయమైన లోహపు దిమ్మె ప్రస్తుతం యూరప్‌లో ప్రత్యక్షమయ్యింది. యూరప్ దేశం రొమేనియాలో... ఓ లోహ స్తంభం సడెన్‌గా ప్రత్యక్షమైంది. త్రికోణ ఆకారంలో ఉన్న ఈ లోహ స్తంభం... రొమేనియాలోని... పియత్రా నీమ్త్‌లో ఉన్న పురాతన పెట్రోదావా దాసియన్ కోటకు కొన్ని మీటర్ల అవతల కనిపించిందని డైలీ మెయిల్ తెలిపింది. తాజా స్తంభం... 13 అడుగుల ఎత్తు ఉంది. సియాహ్లూ పర్వతం వైపు చూస్తున్నట్లుగా ఉంది. రొమేనియాలోని సహజమైన 7 వింతల్లో ఆ పర్వతం కూడా ఉంది. ఐతే... ఉటా ఎడారిలో మాయమైన లోహపు దిమ్మె, ఇదీ... రెండు వేరు వేరని చెబుతున్నారు. ఉటా ఎడారిలో కనిపించిన లోహపు దిమ్మె 10-12 అడుగుల ఎత్తు, మూడు వైపుల స్టీల్‌తో తయారై ఉంది. ఇక ఈ లోహపు దిమ్మె తమ దేశంలో ప్రత్యక్షం కావడంతో రొమేనియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దాని మిస్టరీ విప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తుంటే... మేమూ దాన్ని మొదటిసారి చూస్తున్నాం అని చెబుతున్నారు. అది ప్రభుత్వానికి చెందినది కాదనీ... అందువల్ల దాన్ని తాము ఏమీ చెయ్యలేమనీ... కాకపోతే... దాని ఓనర్ ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు అధికారులు. అది చారిత్రక, పురాతత్వ రక్షణ వలయ ప్రాంతంలో ఉండటం వల్ల ఎవరూ అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ ఏదైనా వస్తువును అక్కడ ఉంచాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ ఇవేవి లేకుండా రాత్రికి రాత్రే ఈ లోహపు స్తంభం ఇక్కడ ప్రత్యక్షం కావడంతో ప్రజలతో పాటు అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. (ఉటా ఎడారి: ఎలా వచ్చిందో.. అలానే వెళ్లింది) ఉటా ఎడారిలో నుంచి దాన్ని తొలగించింది మేమే ఇక ఉటా ఎడారిలో కనిపంచిన లోహపు దిమ్మెను ఎవరు తొలగించారనే దానికి సమాధానం లభించింది. అయితే దాన్ని తొలగించింది ఏలియన్స్ మాత్రం కాదు. నలుగురు వ్యక్తులు దాన్ని అక్కడి నుంచి తొలగించారు. ఈ విషయాన్ని రాస్ బెర్నార్డ్స్ అనే ఫోటోగ్రాఫర్ తెలిపారు. ఎడారిలో ఉన్న లోహపు దిమ్మెని ఫోటో తీయడానికి వెళ్లినప్పుడు నలుగురు వ్యక్తులు దాన్ని తొలగించడం తన కెమరా కంటికి చిక్కిందని తెలిపాడు. అంతేకాక వారి ఫోటోలను తన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు బెర్నార్డ్స్. మంగళవారం తరువాత, 34 ఏళ్ల స్లాక్‌లైన్ ప్రదర్శనకారుడు, సాహస క్రీడాకారుడు ఆండీ లూయిస్ ‘మేము ఉటా ఎడారిలో కనిపించిన లోహపు దిమ్మెని తొలగించాం’ అంటూ ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. -
మార్కెట్.. బౌన్స్‌బ్యాక్!
ముంబై: స్టాక్ మార్కెట్ నవంబర్ సిరీస్‌ను లాభాలతో ముగించింది. ఎఫ్అండ్ఓ ముగింపు నేపథ్యంలో ట్రేడింగ్ ఆద్యంతం ఆటుపోట్లకు లోనైనప్పటికీ.., మెటల్, ఫార్మా, బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల ర్యాలీ అండతో సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 432 పాయింట్లు పెరిగి 44,260 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 129 పాయింట్ల ఆర్జించి 12,987 వద్ద నిలిచింది. మార్కెట్లో నెలకొన్న బుల్లిష్ ట్రెండ్‌కు తగ్గట్లు ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కొనసాగడం, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ట్రేడింగ్ వంటి అంశాలు కొనుగోళ్లకు మద్దతునిచ్చాయి. పండుగ సీజన్లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి పనితీరును కనబరిచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలూ ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 780 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్ల రేంజ్లో కదలాడాయి. ఇక నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ.2,027 కోట్ల షేర్లను కొనగా, దేశీ ఫండ్స్ (డీఐఐలు) రూ.3,400 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నవంబర్ సిరీస్‌లో సెన్సెక్స్ 4510 పాయింట్లను, నిఫ్టీ 1316 పాయింట్లు ఎగిశాయి. ఇంట్రాడేలో ఒడిదుడుకుల ట్రేడింగ్.... లాభాల స్వీకరణతో బుధవారం నష్టాలను చవిచూసిన మార్కెట్ గురువారం ఫ్లాట్‌గా మొదలైంది. ఎఫ్అండ్ఓ సిరీస్ ముగింపు రోజు కావడంతో ఆరంభంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో ఉదయం సెషన్లో సూచీలు లాభ – నష్టాల మధ్య ట్రేడ్ అయ్యాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి మెటల్ షేర్లలో కొనుగోళ్లు మొదలవడంతో లాభాల బాట పట్టాయి. మరోవైపు ఆసియా మార్కెట్ల లాభాల ముగింపు, యూరప్ మార్కెట్ల సానుకూల ప్రారంభంతో మరింత దూసుకెళ్లాయి. -
ఆటుపోట్ల మధ్య మార్కెట్ల దూకుడు
ముంబై, సాక్షి: ముందురోజు నమోదైన పతనం నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ను సాధించాయి. సెన్సెక్స్ 432 పాయింట్లు జంప్‌చేసి 44,260 వద్ద ముగిసింది. నిఫ్టీ 129 పాయింట్లు ఎగసి 12,987 వద్ద స్థిరపడింది. అయితే మిడ్‌సెషన్ వరకూ ఒడిదొడుకుల మధ్య కదిలాయి. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,582 వద్ద కనిష్టాన్ని తాకింది. తదుపరి మిడ్‌సెషన్ నుంచీ జోరందుకుని 44,362 వరకూ ఎగసింది. ఇదేవిధంగా నిఫ్టీ సైతం 13,108 వద్ద గరిష్టాన్ని తాకగా.. 12,790 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. నేడు నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లను రోలోవర్ చేసుకోవడానికి ప్రాధాన్యమివ్వడంతో మార్కెట్లు ఆటుపోట్లకు లోనైనట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. బుధవారం ఒక్కసారిగా ఊపందుకున్న అమ్మకాలతో రికార్డుల ర్యాలీకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మెటల్స్ 4 శాతం, పీఎస్‌యూ బ్యాంక్స్ 2 శాతం, ఫార్మా 1.5 శాతం చొప్పున ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, శ్రీ సిమెంట్, బజాజ్ ఆటో, హిందాల్కో, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 7-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఐషర్, మారుఈ, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా 1.6-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. చిన్న షేర్లు ఓకే డెరివేటివ్ కౌంటర్లలో సీమెన్స్ 12.4 శాతం జంప్‌చేయగా.. సెయిల్, జిందాల్ స్టీల్, ఐసీఐసీఐ లంబార్డ్, ఎల్అండ్టీ ఫైనాన్స్, నాల్కో, బీవోబీ, టాటా కెమికల్స్ 8.3-4.6 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోవైపు ఇండిగో, ఆర్బీఎల్ బ్యాంక్, శ్రీరామ్ ట్రాన్స్, హావెల్స్, ఎస్ఆర్ఎఫ్, ఎస్కార్ట్స్ 2.6-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-0.7 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,765 లాభపడగా.. 994 మాత్రమే నష్టాలతో ముగిశాయి. డీఐఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. డీఐఐలు రూ. 2,522 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
చివరికి నష్టాలే- రియల్టీ, మెటల్ జోరు
ఆటుపోట్ల మధ్య నవంబర్ డెరివేటివ్ సిరీస్ తొలి రోజు నీరసంగా ముగిసింది. సెన్సెక్స్ 136 పాయింట్లు క్షీణించి 39,614 వద్ద నిలవగా.. నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 11,642 వద్ద స్థిరపడింది. తొలుత స్వల్ప ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన సెన్సెక్స్ 39,988 వరకూ ఎగసింది. మిడ్‌సెషన్‌కల్లా 39,242కు వెనకడుగు వేసింది. వెరసి ఇంట్రాడేలో 750 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. ఇక నిఫ్టీ సైతం 11,749- 11,535 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు తిరిగి పెరుగుతుండటం, యూఎస్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆటో డీలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు 1.2-0.8 శాతం మధ్య బలహీనపడ్డాయి. రియల్టీ 2.2 శాతం పుంజుకోగా.. మెటల్, మీడియా 1.5 శాతం చొప్పున ఎగశాయి. ఐటీ, ఫార్మా 0.2 శాతం బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎయిర్టెల్, హీరో మోటో, మారుతీ, ఐషర్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, కొటక్ బ్యాంక్, ఐసీఐసీఐ, బ్రిటానియా, బజాజ్ ఆటో 4-1.5 శాతం మధ్య నష్టపోయాయి. అయితే అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, హిందాల్కో, ఆర్ఐఎల్, టాటా స్టీల్, గెయిల్, నెస్లే 4.5-1.7 శాతం మధ్య ఎగశాయి. చోళమండలం జోరు డెరివేటివ్ కౌంటర్లలో ఎంఆర్ఎఫ్, బీవోబీ, గోద్రెజ్ సీపీ, అపోలో టైర్, ఇండిగో, జూబిలెంట్ ఫుడ్, లుపిన్, కమిన్స్, మారికో, నౌకరీ. టాటా కెమికల్స్ 3.5-1.7 శాతం మధ్య వెనకడుగు వేశాయి. కాగా.. మరోవైపు చోళమండలం, టీవీఎస్ మోటార్, ఐడియా, హెచ్‌పీసీఎల్, జీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్, పిరమల్, అమరరాజా, పీఎఫ్సీ, ఆర్ఈసీ 8.5-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1,338 లాభపడగా.. 1,240 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 421 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) సైతం రూ. 253 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ విక్రయించాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1,131 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు సైలంట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 3,515 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,571 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి -
నాలుగో రోజూ జోరు- రియల్టీ, మెటల్ అప్
భారీ ప్యాకేజీపై అంచనాలతో మంగళవారం యూఎస్ మార్కెట్లు బలపడగా.. వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 163 పాయింట్లు పుంజుకుని 40,707 వద్ద నిలవగా.. నిఫ్టీ 41 పాయింట్లు జమ చేసుకుని 11,938 వద్ద స్థిరపడింది. అయితే ఇంట్రాడేలో మార్కెట్లు ఊగిసలాటకు లోనయ్యాయి. తొలుత సెన్సెక్స్ క్వాడ్రపుల్ సెంచరీ సాధించగా.. నిఫ్టీ సెంచరీ చేయడం ద్వారా సాంకేతికంగా కీలకమైన 12,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,976 వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,151 దిగువన కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ 12,019- 11,776 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. వరుసగా నాలుగో రోజు మార్కెట్లు ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారని, దీంతో మిడ్ సెషన్‌కల్లా మార్కెట్లు లాభాలు పోగొట్టుకుని నష్టాల బారినపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో రియల్టీ 4.4 శాతం, మెటల్ 2.25 శాతం చొప్పున జంప్ చేయగా.. బ్యాంక్ నిఫ్టీ 1.3 శాతం లాభపడింది. అయితే ఎఫ్ఎంసీజీ, మీడియా, ఐటీ, ఆటో రంగాలు 1-0.25 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో పవర్‌గ్రిడ్, ఎయిర్టెల్, టాటా స్టీల్, హిందాల్కో, గెయిల్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, గ్రాసిమ్, అల్ట్రాటెక్, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ బ్యాంక్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ 4.5-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే బ్రిటానియా, టీసీఎస్, ఎస్బీఐ లైఫ్, హీరో మోటో, నెస్లే, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్‌సీఎల్ టెక్, ఆర్ఐఎల్, విప్రో, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ 4.3-0.7 శాతం మధ్య నీరసించాయి. రియల్టీ అప్ ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో గోద్రెజ్ ప్రాపర్టీస్, అపోలో టైర్, జిందాల్ స్టీల్, సెయిల్, ఎల్ఐసీ హౌసింగ్, హెచ్‌పీసీఎల్, బీఈఎల్, డీఎల్ఎఫ్, వేదాంతా, కంకార్, పెట్రోనెట్ 11-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు మైండ్‌ట్రీ, అదానీ ఎంటర్, డాబర్, అపోలో హాస్పిటల్స్, టాటా కన్జూమర్, కోఫోర్జ్, ఐసీఐసీఐ ప్రు, కాల్గేట్, పిడిలైట్, మారికో, పేజ్ 5-2 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్స్ 0.25 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1,365 లాభపడగా.. 1,297 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,585 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,633 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1,657 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,622 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
లాభాలతో మొదలై నష్టాలలోకి
మరోసారి హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 77 పాయింట్లు క్షీణించి 40,106కు చేరింది. నిఫ్టీ 15 పాయింట్లు తక్కువగా 11,820 వద్ద ట్రేడవుతోంది. సహాయక ప్యాకేజీపై తిరిగి చర్చలు ప్రారంభంకానున్న అంచనాలతో గురువారం యూఎస్ మార్కెట్లు 0.8 శాతం స్థాయిలో బలపడ్డాయి. నేడు ఆర్బీఐ పాలసీ సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,322-40,092 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. మెటల్స్ జోరు ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్, ఫార్మా, ఆటో 1.6-0.6 శాతం మధ్య లాభపడ్డాయి. రియల్టీ, ఎఫ్ఎంసీజీ 0.4-0.2 శాతం చొప్పున డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా స్టీల్, ఎయిర్టెల్, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ, మారుతీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటన్, శ్రీ సిమెంట్, హీరో మోటో, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్ 3.6-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్‌యూఎల్, యూపీఎల్, నెస్లే, ఆర్ఐఎల్, టీసీఎస్, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా 1-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. ఐటీ జోరు డెరివేటివ్ కౌంటర్లలో ఎల్ఐసీ హౌసింగ్, సెయిల్, జిందాల్ స్టీల్, నాల్కో, ఇండిగో, యూబీఎల్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, పీఎఫ్సీ, వేదాంతా, మదర్సన్, ఎల్అండ్టీ ఫైనాన్స్, కేడిలా హెల్త్, అపోలో హాస్పిటల్స్, మణప్పురం 5.3-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. గోద్రెజ్ ప్రాపర్టీస్, ఐడిఎఫ్సీ ఫస్ట్‌బ్యాంక్, బెర్జర్ పెయింట్స్, డీఎల్ఎఫ్, జీఎంఆర్, పిడిలైట్, అంబుజా సిమెంట్, డాబర్, పిరమల్ 1.7-0.9 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 873 షేర్లు లాభపడగా.. 851 నష్టాలతో ట్రేడవుతున్నాయి. -
రెండో రోజూ కన్సాలిడేషన్- మెటల్స్ వీక్
వరుసగా రెండో రోజూ దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటనే ఎంచుకున్నాయి. దీంతో ఆద్యంతం ఒడిదొడుకుల మధ్య కదిలాయి. చివరికి సెన్సెక్స్ 95 పాయింట్లు బలపడి 38,068 వద్ద నిలిచింది. వెరసి 38,000 పాయింట్ల కీలక మార్క్‌ను అధిగమించింది. ఇక నిఫ్టీ 25 పాయింట్లు పుంజుకుని 11,247 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,236 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,828 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇదే విధంగా నిఫ్టీ సైతం 11,295- 11,185 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. బీపీసీఎల్ బోర్లా ఎన్ఎస్ఈలో మెటల్ ఇండెక్స్ 2 శాతం డీలాపడగా.. పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ, ఆటో 1-0.4 శాతం మధ్య నీరసించాయి. ఎఫ్ఎంసీజీ 1.4 శాతం పుంజుకుంది. ఫార్మా, ఐటీ 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గ్రాసిమ్, టెక్ మహీంద్రా, టైటన్, నెస్లే, డాక్టర్ రెడ్డీస్, శ్రీ సిమెంట్, సిప్లా, యూపీఎల్, బ్రిటానియా, హెచ్‌యూఎల్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే బీపీసీఎల్ 9 శాతం పతనంకాగా.. ఎయిర్టెల్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోల్ ఇండియా, గెయిల్, ఐవోసీ, హిందాల్కో, సన్ ఫార్మా, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ 3.7-1 శాతం మధ్య డీలాపడ్డాయి. ఫార్మా భళా డెరివేటివ్ కౌంటర్లలో టొరంట్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్, గోద్రెజ్ సీపీ, ఐబీ హౌసింగ్, డాబర్, రామ్‌కో సిమెంట్, కేడిలా హెల్త్, శ్రీరామ్ ట్రాన్స్ 3.3-1.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. సెయిల్, జిందాల్ స్టీల్, ఐడియా, భెల్, హెచ్‌పీసీఎల్, కంకార్, ఇన్ఫ్రాటెల్, నాల్కో, పీఎఫ్సీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, బయోకాన్, పీఎన్బీ, డీఎల్ఎఫ్ 5.5-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో ట్రేడైన షేర్లలో 1,241 లాభపడగా.. 1,370 నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,457 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 577 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు నామమాత్రంగా రూ. 27 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ. 542 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
కుప్పకూలిన మార్కెట్లు- ఐటీ ఎదురీత
తొలుత అటూఇటుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లలో మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 709 పాయింట్లు పతనమై 38,137ను తాకగా.. నిఫ్టీ 183 పాయింట్లు కోల్పోయి 11,322 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,990- 38,073 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,535- 11,252 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో వరుసగా మూడో రోజు శుక్రవారం యూఎస్ మార్కెట్లు డీలా పడ్డాయి. చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు కొనసాగుతుండటంతో సెంటిమెంటుకు దెబ్బ తగిలినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఐటీ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ క్షీణించగా.. ఐటీ 1.6 శాతం ఎగసింది. మెటల్, మీడియా, రియల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్ 3.7-1.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా మోటార్స్, ఎయిర్టెల్, ఇండస్ఇండ్, గెయిల్, ఇన్ఫ్రాటెల్, టాటా స్టీల్, సిప్లా, నెస్లే, ఐవోసీ, బ్రిటానియా, ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్, అల్ట్రాటెక్, ఎంఅండ్ఎం, జీ, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్7-3 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ ద్వయం, విప్రో 2-1 శాతం మధ్య పుంజుకున్నాయి. ఐబీ హౌసింగ్ పతనం.. డెరివేటివ్ కౌంటర్లలో ఐబీ హౌసింగ్ 13 శాతం కుప్పకూలగా.. జిందాల్ స్టీల్, గ్లెన్‌మార్క్, పీవీఆర్, బంధన్ బ్యాంక్, ఐడియా, మదర్సన్, పిరమల్, బయోకాన్, బాలకృష్ణ, ఆర్బీఎల్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఆర్ఈసీ, టాటా పవర్, పీఎఫ్సీ, సెయిల్, టొరంట్ ఫార్మా, డీఎల్ఎఫ్ 8.5-4.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క మైండ్‌ట్రీ, అపోలో హాస్పిటల్స్ మాత్రమే అదికూడా 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతం చొప్పున డీలా పడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో1969 నష్టపోగా..653 లాభాలతో కదులుతున్నాయి. -
మార్కెట్ల పతనం- 39,000 దిగువకు సెన్సెక్స్
సరిహద్దువద్ద చైనాతో వివాదాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు పతనమై 38,980 వద్ద నిలిచింది. వెరసి 39,000 పాయింట్ల మార్క్ దిగువన స్థిరపడింది. ఇక నిఫ్టీ 88 పాయింట్ల వెనకడుగుతో 11,516 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,235- 38,926 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,587- 11,499 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. తాజా పాలసీ సమీక్షలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ దీర్ఘకాలంపాటు నామమాత్ర వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు ప్రకటించింది. అయితే టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో బుధవారం యూఎస్ మార్కెట్లు డీలాపడ్డాయి. బ్లూచిప్స్ తీరిలా ఎన్ఎస్ఈలో రియల్టీ, మెటల్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ 1.7-0.7 శాతం మధ్య క్షీణించగా.. ఫార్మా, మీడియా, ఐటీ రంగాలు 0.4-0.2 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా మోటార్స్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫిన్, అదానీ పోర్ట్స్, ఇన్ఫ్రాటెల్, పవర్‌గ్రిడ్, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, టీసీఎస్, సన్ ఫార్మా, ఎస్బీఐ, ఐటీసీ, టాటా స్టీల్, ఆర్ఐఎల్ 4.3-1.2 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే డాక్టర్ రెడ్డీస్ 4.2 శాతం జంప్‌చేయగా.. హెచ్‌సీఎల్ టెక్, జీ, మారుతీ, ఇన్ఫోసిస్, హీరో మోటో, బీపీసీఎల్, గ్రాసిమ్, కోల్ ఇండియా 2.3-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. డెరివేటివ్స్‌లో డెరివేటివ్ కౌంటర్లలో డీఎల్ఎఫ్, అరబిందో, ఎన్ఎండీసీ, ఐబీ హౌసింగ్, రామ్‌కో సిమెంట్, ఐడియా, అశోక్ లేలాండ్, ఐడియా, పీవీఆర్, పెట్రోనెట్, బీవోబీ, ముత్తూట్, ఐసీఐసీఐ ప్రు, గ్లెన్‌మార్క్ 4.4-1.2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు అపోలో హాస్పిటల్స్, అపోలో టైర్, కోఫోర్జ్, కేడిలా హెల్త్, మైండ్‌ట్రీ, ఏసీసీ, ఎస్ఆర్ఎఫ్, జూబిలెంట్ ఫుడ్, పిరమల్, బాలకృష్ణ, పేజ్, లుపిన్ 5.2-1.2 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.25-0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1153 లాభపడగా.. 1574 నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 265 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 212 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,171 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 896 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 298 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 120 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మళ్లీ 38,000కు- ఆటో, మెటల్ దన్ను
రోజంతా అటూఇటుగా కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి పటిష్టంగా ముగిశాయి. సెన్సెక్స్ 173 పాయింట్లు పుంజుకుని 38,051 వద్ద నిలిచింది. తద్వారా మళ్లీ 38,000 పాయింట్ల మార్క్ ఎగువన స్థిరపడింది. నిఫ్టీ 69 పాయింట్లు ఎగసి 11,247 వద్ద ముగిసింది. అయితే మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ రోజంతా ఒడిదొడుకుల మధ్య కదిలాయి. వెరసి సెన్సెక్స్ 38,119 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,734 వద్ద కనిష్టానికీ చేరింది. నిఫ్టీ సైతం 11,267- 11,145 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ప్రస్తుతం మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఐటీ అండ ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, మెటల్, ఆటో రంగాలు 2.5 శాతం చొప్పున ఎగశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, రియల్టీ, ప్రయివేట్ బ్యాంక్స్ సైతం 1.4-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా 0.4 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎన్టీపీసీ, ఐషర్, జీ, హిందాల్కో, బజాజ్ ఆటో, హీరో మోటో, టెక్ మహీంద్రా, ఐవోసీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, మారుతీ, విప్రో 7.5-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఎస్బీఐ, ఎయిర్టెల్, బీపీసీఎల్, ఆర్ఐఎల్, టాటా మోటార్స్, గ్రాసిమ్, సన్ ఫార్మా 1.6-0.5 శాతం మధ్య నీరసించాయి. ఆటో స్పీడ్ డెరివేటివ్ కౌంటర్లలో సన్ టీవీ, మదర్సన్, ఎస్కార్ట్స్, జిందాల్ స్టీల్, ఆర్బీఎల్, డీఎల్ఎఫ్, మైండ్‌ట్రీ, టొరంట్ పవర్ 6-2.6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరొపక్క చోళమండలం ఫైనాన్స్, ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంక్, పెట్రోనెట్, ఎంఆర్ఎఫ్, బీఈఎల్, అరబిందో ఫార్మా, బెర్జర్ పెయింట్స్, లుపిన్ 2.4-1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4-0.8 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,645 లాభపడగా.. 1,129 నష్టపోయాయి. డీఐఐల అమ్మకాలు నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా రూ. 46 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 797 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 416 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 764 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మెటల్, బ్యాంక్స్ దన్ను- సెన్సెక్స్ ట్రిపుల్
ప్రపంచ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ సెంచరీ సాధించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 328 పాయింట్లు ఎగసి 38,510కు చేరింది. నిఫ్టీ 87 పాయింట్లు బలపడి 11,357 వద్ద ట్రేడవుతోంది. సోమవారం యూఎస్ మార్కెట్లు అటూఇటుగా నిలవగా.. ప్రస్తుతం ఆసియాలో సానుకూల ట్రెండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఇన్వెస్టర్లు మరోసారి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో మార్కెట్లు వరుసగా నాలుగో రోజు జోరందుకున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మీడియా, ఆటో సైతం ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడగా.. మెటల్ 2.4 శాతం, ప్రయివేట్ బ్యాంక్స్ 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. మీడియా, ఆటో, రియల్టీ సైతం 1.3-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్, జీ, టాటా స్టీల్, ఎల్అండ్టీ, పవర్‌గ్రిడ్, ఐటీసీ, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ, ఐషర్, కొటక్ బ్యాంక్ 3.6-1 శాతం మధ్య లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో శ్రీ సిమెంట్, టైటన్, సిప్లా, యూపీఎల్ 3.6-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిట్ టెక్ అప్ ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో నిట్ టెక్, సెయిల్, ఐబీ హౌసింగ్, నాల్కో, ఎస్కార్ట్స్, జిందాల్ స్టీల్, ఆర్బీఎల్, ఎల్ఐసీ హౌసింగ్, ఎంజీఎల్ 3.4-1.6 శాతం మధ్య పెరిగాయి. అయితే ఐడియా, నౌకరీ, బీవోబీ, అపోలో హాస్పిటల్స్, భారత్ ఫోర్జ్, కేడిలా హెల్త్, అమరరాజా, లుపిన్ 3.3-0.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5-0.75 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1204 లాభపడగా.. 365 నష్టాలతో కదులుతున్నాయి. -
లాభాల మార్కెట్లో మెటల్ షేర్లకు డిమాండ్..!
స్టాక్ మార్కెట్లో శుక్రవారం మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎన్ఎస్ఈలోని నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఉదయం ట్రేడింగ్ సెషన్లో 3శాతానికి పైగా లాభపడింది. కొన్ని రోజులుగా మార్కెట్లో విస్తృతస్థాయి కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ.., ఈ రంగ షేర్లు ఆశించినస్థాయిలో రాణించలేకపోయాయి. అయితే నేటి మార్కెట్ ప్రారంభం నుంచే ఈ మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ రంగానికి చెందిన మెయిల్ షేరు అత్యధికంగా 8.50శాతం లాభపడింది. ఏపిఎల్ అపోలో, టాటా స్టీల్ షేర్లు 6శాతం పెరిగాయి. సెయిల్, హిందాల్కో షేర్లు 5శాతం ర్యాలీ చేశాయి. జిందాల్ స్టీల్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, హిందూస్థాన్ కాపర్ షేరు 4.50శాతం లాభపడ్డాయి. నాల్కో 3.50శాతం, ఎన్ఎండీసీ, కోల్ ఇండియా షేర్లు 2శాతం, రత్నమణి మెటల్ ట్యూబ్స్ లిమిటెడ్, హిందూస్థాన్ జింక్ షేర్లు 1శాతం పెరిగాయి. వెల్స్పన్ కార్ప్, వేదాంత షేర్లు 1.50శాతం నుంచి 1శాతం నష్టాన్ని చవిచూశాయి. ఉదయం 11గంటలకు నిఫ్టీ మెటల్ ఇండెక్స్ మునుపటి ముగింపు(1,972.90)తో పోలిస్తే 3.30శాతం లాభంతో 2,037.70 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్-5 షేర్లలో జేఎస్‌డబ్ల్యూస్టీల్, హిందాల్కో, టాటా మోటర్స్ షేర్లు చోటు దక్కించుకోవడం విశేషం. -
అతని కడుపులో 452 వస్తువులు..
అహ్మదాబాద్ : కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తికి శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. అతని కడుపులో నుంచి 3.5 కిలోల బరువున్న 452 లోహ వస్తువులను వైద్యులు వెలికి తీశారు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్‌కు ఈ నెల 8వ తేదీన కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో అక్కడి సిబ్బంది అతన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ తొలుత ఎక్స్-రే నిర్వహించిన వైద్యులు.. అతని కుడి శ్వాసకోశంలో ఓ పిన్ చిక్కుకున్నట్టు గుర్తించి దాన్ని తొలగించారు. అయితే దాని తర్వాత తనకు తీవ్రమైన కడుపు నొప్పిగా ఉందని సదురు పేషెంట్ వైద్యులకు తెలిపాడు. దీంతో వైద్యులు అతనికి పూర్తి ఎక్స్-రే నిర్వహించారు. కడుపులో భారీగా వస్తువులు ఉన్నట్టుగా గుర్తించారు. వెంటనే అతన్ని ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. అక్కడ నలుగురు వైద్యులు బృందం రెండున్నర గంటల పాటు శ్రమించి అతనికి శస్త్ర చికిత్స పూర్తి చేసింది. అతని కడుపులో నుంచి మొత్తం 3.5 కిలోల బరువున్న పలు లోహ వస్తువులను వైద్యులు బయటకు తీశారు. అందులో కాయిన్స్, బోల్టులు, బ్లెడ్ ముక్కలు, ఒక నెల్ కట్టర్, ఒక స్పార్క్ ప్లగ్, ఒక లాకెట్ కూడా ఉన్నాయి. ఇలా మొత్తం 452 లోహ వస్తువులను బయటికి తీసినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం రోగిను వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని.. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వారు పేర్కొన్నారు. ‘అతనికి చాలా కాలం క్రితమే వివాహం అయింది. ఆరేళ్ల పాప కూడా ఉంది. కానీ భార్య మాత్రం అతన్ని విడిచి వెళ్లిపోయింది. దీంతో అతడు మానసికంగా కుంగిపోయాడు. దీంతో అతన్ని ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో చేర్పించాం. గత మూడు నాలుగేళ్ల నుంచి అతను అక్కడే చికిత్స పొందుతున్నాడు. అతనికి ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచే ఇనుప వస్తువులను తినే అలవాటు ఉండేద’ని పేషెంట్ కుటుంబ సభ్యులు తెలిపారు. -
నష్టాల్లో రియాల్టీ, మెటల్, పవర్ సూచీలు
-
నీటి కాలుష్యానికి కొత్త విరుగుడు!
నీటికాలుష్యాన్ని శుద్ధి చేసేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. ఇనుముకు కొన్ని ఇతర లోహాలను మిశ్రమం చేసి ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేసిన లోహపు పట్టీలు కొన్ని నిమిషాల వ్యవధిలోనే నీటిలో కలిసిన రంగులు, భారలోహాలను తొలగిస్తాయని వీరు అంటున్నారు. వస్త్ర పరిశ్రమతోపాటు గనుల ద్వారా కూడా భారీ ఎత్తున భారలోహాలు, రంగులు నీటిలో కలుస్తున్న విషయం తెలిసిందే. వీటిని తొలగించేందుకు ఇప్పటికే కొన్ని పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ అవన్నీ వ్యయప్రయాసలతో కూడుకున్నవి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మెటాలిక్ గ్లాసెస్ తయారీకి ఉపయోగించే పద్ధతితో లోహపు పట్టీలను తయారు చేశారు. ఈ పట్టీల్లోని పరమాణువులు అన్నీ ఒక క్రమపద్ధతిలో అమరి ఉండటం వల్ల వీటిమధ్య ఎలక్ట్రాన్ల ఆదాన ప్రదానాలు సులువుగా జరిగిపోతాయని.. ఫలితంగా ఇవి కాలుష్యాలను నేరుగా ఆకర్షించగలవని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లైచాంగ్ ఝాంగ్ అంటున్నారు. టన్ను నీటిలోని కాలుష్యాలను తొలగించేందుకు కేవలం 700 రూపాయల విలువ చేసే పట్టీలు సరిపోతాయని.. ఒక పట్టీని కనీసం ఐదుసార్లు వాడుకునే అవకాశం ఉందని వివరించారు. కేవలం మంచినీరు, కార్బన్‌డయాక్సైడ్‌లు మినహా మిగిలిన ఏకాలుష్యం కూడా ఈ పద్ధతి ద్వారా వెలువడదని చెప్పారు. -
కార్పొరేట్ల లాభాలకు మెటల్స్ ఊతం..
ముంబై: దేశీ కార్పొరేట్ల ఆర్థిక పనితీరు మెరుగుపడటానికి మెటల్స్ రంగంలో రికవరీ తోడ్పడనుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సదరు సంస్థల ఆదాయ వృద్ధి నిలకడగా 7–9 శాతం మేర ఉండనుంది. ఇండియా రేటింగ్స్ సంస్థ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. 2018–19లో లాభదాయకత మెరుగుపడి, కార్పొరేట్ల ఆర్థిక పనితీరు స్థిరంగా ఉండగలదని పేర్కొంది. అయితే, ఈ రికవరీ కేవలం మెటల్స్ రంగానికి మాత్రమే పరిమితమని, మిగతా రంగాలన్నింటిలోనూ కనిపించడానికి మరింత సమయం పడుతుందని తెలిపింది. వినియోగ ఆధారిత ఆటోమొబైల్, రిటైల్ తదితర రంగాల్లో డిమాండ్ పెరగడంతో ఆదాయాలు 7–9 శాతం మేర, పన్నుకు ముందస్తు లాభాలు 8–11 శాతం మేర వృద్ధి చెందవచ్చని నివేదిక పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కమోడిటీల ధరలు అధిక స్థాయిలో ఉండొచ్చని.. దీనికి తోడు అధిక వడ్డీ రేట్లు, రూపాయీ క్షీణత తదితర అంశాలు కంపెనీల లాభాల వృద్ధికి అడ్డుకట్ట వేయొచ్చని అంచనా వేసింది. ఇక అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కఠిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎగుమతి ఆధారిత రంగాలైన ఫార్మా, ఐటీ సంస్థలు సవాళ్లు ఎదుర్కొనాల్సి ఉంటుందని వివరించింది. మరోవైపు, కంపెనీల లాభాల వృద్ధి పరిమిత స్థాయిలోనే ఉండటం వల్ల 2019–20 దాకా పెట్టుబడులు పెరగకపోవచ్చని ఇండియా రేటింగ్స్ వివరించింది. కార్పొరేట్లు కేవలం మెయింటెనెన్స్‌పై మాత్రమే ఖర్చులు చేయొచ్చని, విస్తరణ ప్రణాళికల జోలికి పోకపోవచ్చని పేర్కొంది. -
ఇరీడియం లోహం పట్టివేత
గోదావరిఖని(రామగుండం): బంగారం బరువు ఎక్కువగా ఉండేందుకు దానిలో కలిపే విలువైన ఇరీడియం లోహాన్ని తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చత్తీస్ఘడ్ నుంచి తీసుకువచ్చి గోదావరిఖనిలో విక్రయించేందుకు సిద్ధమవుతుండగా అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు రామగుండం పోలీస్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ రవికుమార్, ఏసీపీ రక్షిత కె.మూర్తి తెలిపారు. బుధవారం ఏసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. స్నేహితుల ద్వారా.. గోదావరిఖని హనుమాన్‌నగర్‌కు చెందిన కన్నం విజయ్ హార్వేస్టర్ వ్యాపారం చేస్తాడు. గోదావరిఖనిలో బంగారం దుకాణాలు ఎక్కువగా ఉండడంతో అందులో కలిపేందుకు ప్రభుత్వం నిషేధించిన ఇరీడియం లోహాన్ని అమ్మేందుకు అతని స్నేహితులు ఆదిలాబాద్ జిల్లా పిట్టలవాడకు చెందిన సింగిరెడ్డి లచ్చిరెడ్డి, మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామానికి చెందిన ఏ.కిషన్, నస్పూర్ మండలం సింగాపురం గ్రామానికి చెందిన ఎస్.తిరుపతి, ఆదిలాబాద్ జిల్లా భీమేశ్వరం ప్రాంతానికి చెందిన జె.గంగన్న, జైనథ్‌కు చెందిన బి.అజయ్, బీంపూర్‌కు చెందిన ఎస్.లింగారెడ్డి విజయ్‌ని కలిశారు. ఈనెల 14న ఎన్టీపీసీలోని ఓ లాడ్జిలో కన్నం విజయ్ నుంచి రూ.30వేలు తీసుకుని కొంత ఇరీడియం లోహన్ని అందజేశారు. డొంక ఇలా కదిలింది... రెండ్రోజుల తరువాత మరికొంత లోహాన్ని తీసుకొస్తామని చెప్పి రాకపోవడంతో విజయ్ ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారు ఆ కేసును సీసీఎస్‌కు అప్పగించారు. వారిపై నిఘా ఉంచిన పోలీసులు లోహాన్ని తరలిస్తున్న పై ఆరుగురిని బుధవారం ఎన్టీపీసీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు కిలోల ఇరీడియం లోహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న ఇరీడియం అసలా..? నకిలీనా..? అని తేల్చేందుకు ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. అసలుదైతే దాని విలువ రూ.50లక్షలు ఉంటుందనే అంచనా వేస్తున్నామని అడిషనల్ డీసీపీ రవికుమార్, ఏసీపీ రక్షిత కె.మూర్తి వివరించారు. ఛత్తీస్‌గఢ్‌నుంచి నుంచి రవాణా... అరుదుగా లభించే ఈ లోహాన్ని చత్తీస్‌గఢ్ గుట్టల నుంచి సేకరించి ఏటూరు నాగారం మీదుగా రవాణా చేస్తున్నారని తెలిపారు. ఇరీడియమ్ లోహం సేకరించే తిరుమణి నవీన్‌కుమార్, తునికి శంకరాచారి, మామిడిపెల్లి శ్రీనివాస్ పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు వివరించారు. సీసీఎస్ ఏసీపీ చంద్రయ్య, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్ఐలు ఎస్.ప్రసాద్, రమేష్‌ను అభినందించారు. -
ఊగిసలాటలో స్టాక్‌మార్కెట్లు: మెటల్స్ షైనింగ్
సాక్షి, ముంబై: దేశీ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 6పాయింట్ల నష్టంతో,నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా వెంటనే లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 46 పాయింట్లు పుంజుకుని 32, 650కి ట్రేడ్అయ్యాయి. పదివేలకు దిగువన ప్రారంభమైన నిఫ్టీ 12 పాయింట్లు పుంజుకుని 10వేలస్థాయిని దాటింది. అయితే ఇన్వెస్టర్ల అమ్మకాలతో కీలక సూచీలు లాభనష్టాలమధ్య ఊగిసలాడుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ తిరిగి నష్టాలతో 10వేల దిగువకు చేరింది. మెటల్స్,రియల్టీ రంగ లాభాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అటు పీఎస్‌యూ బ్యాంక్ ఫార్మా కూడా లాభ పడుతోంది. అయితే హై స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంటోంది. ఐడీబీఐ భారీగా నష్టపోతోంది. యాక్సిస్‌బ్యాంక్ టాటా మోటార్స్, గెయిల్, ఐటీసీ, వేదాంతా, గెయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ, ఐషర్, టీసీఎస్, బాష్, భారతీ, హీరోమోటో నష్టపోతుండగా, ఐసీఐసీఐ, ఎస్బీఐ మారికో,అదానీపోర్ట్, సన్‌ఫార్మా, టాటాస్టీల్, ఆర్‌కాం లాభపడుతున్న వాటిల్లో ఉన్నాయి. -
మెటల్, బ్యాంకింగ్ జోరు:లాభాల ముగింపు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆరంభంనుంచీ సానుకూలంగా కదిలిన కీలక సూచీలు చివరికి పాజిటివ్‌గా క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా నిఫ్టీ 10,500 స్థాయిని దాటింది. సెన్సెక్స్176 పాయింట్ల లాభంతో 33,969వద్ద,నిఫ్టీ 63పాయింట్ల లాభంతో 10,564వద్ద ముగిశాయి. ముఖ్యంగా మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్ షేర్ల లాభాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. మెటల్ ఇండెక్స్ సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. రియల్టీ, ఐటీ, ఆటో నష్టపోయాయి. టాటా స్టీల్, డా.రెడ్డీస్, ఎల్ అండటీ, ఆసియన్ పెయింట్స్, జిందాల్ స్టీల్ జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెయిల్, టాటా స్టీల్, ఎన్ఎండీసీ, కోల్ ఇండియా, హింద్ జింక్, వేదాంతా, నాల్కో, ఎంవోఐఎల్, హిందాల్కో లాభపడ్డాయి. బ్యాంకింగ్ సెక్టార్లో ఐడీబీఐ, బీవోఐ, పీఎన్బీ, బీవోబీ, ఓబీసీ, ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ, సిండికేట్, అలహాబాద్ బ్యాంక్ లాభపడ్డాయి. ఇక ఐషర్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, హీరోమోటో, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్ నష్టాలను చవి చూశాయి -
ఫార్మ , మెటల్ దన్నుతో లాభాల్లో మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లులాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 81 పాయింట్ల లాభంతో 33,859 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 10,468 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు పాజిటివ్‌గానే ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మా, మెటల్ రంగ లాభాలు మార్కెట్లకు బలాన్నిస్తున్నాయి. ఎల్ అండ్ టీ, లుపిన్, హెచ్‌సీఎల్ టెక్, వక్ హార్డ్ , అరబిందో, సన్‌ఫార్మా, జీ, హిందాల్కో, హీరోమోటోలాభపడుతుండగా, భారతి ఎయిర్టెల్ ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, యాక్సిస్, ఇండస్ఇండ్, హెచ్‌పీసీఎల్, విప్రో, కొటక్ బ్యాంక్, మారుతీ, హెచ్‌యూఎల్ నష్టపోతున్నాయి. -
5 రోజుల నష్టాలకు బ్రేక్: గట్టెక్కిన మార్కెట్లు
ముంబై : బెంచ్ మార్కు సూచీలు గత ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేకిచ్చాయి. సోమవారం ట్రేడింగ్ ముగింపుల్లో మార్కెట్లు లాభాల్లో నమోదయ్యాయి. సెన్సెక్స్ 235.44 పాయింట్ల లాభంలో 31,449.03 వద్ద, నిఫ్టీ 83.35 వద్ద 9794.15 వద్ద క్లోజ్ అయ్యాయి. నేటి ట్రేడింగ్‌లో మెటల్, హెవీ వెయిట్ బ్యాంకింగ్ స్టాక్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ స్టాక్స్‌లో ఎక్కువగా కొనుగోలు జరిగాయి. బలహీనమైన అమెరికా ద్రవ్యోల్బణ డేటాతో ఆసియన్ షేర్లలో కొనుగోలు మద్దతు లభించింది. సిప్లా ఎక్కువగా 5.4 శాతం లాభాలు పండించింది. దాని తర్వాత వేదాంత, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మాలు లాభాల్లో కొనసాగాయి. నేటి ట్రేడింగ్‌లో టాప్ గెయినర్లుగా బ్యాంకులు నిలిచాయి. గత వారంగా 3.4 శాతం కోల్పోయిన బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్, 0.9 శాతం పైకి ఎగిసింది. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు 2.6 శాతం, 1.1 శాతం లాభాలు పండించాయి. ఎస్బీఐ, కొటక్ మహింద్రా, భారతీ ఎయిర్టెల్, బోస్క్ షేర్లు రెండు సూచీల్లో నష్టాలు పాలయ్యాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 64.11గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 144 రూపాయల నష్టంలో 29,059 రూపాయలుగా నమోదయ్యాయి. -
వేడిని దూరంచేసే పెయింట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా పేటెంటు హక్కులున్న ‘ఆడ్ గ్రీన్‌కోట్’ పెయింట్ భారత్‌లో అడుగుపెట్టింది. జపాన్‌కు చెందిన ఎన్‌సీకేతో హైదరాబాద్‌కు చెందిన సన్ షాడో టెక్నాలజీస్ చేతులు కలిపింది. ఎన్సీకే ఉత్పత్తులను సన్ షాడో విక్రయిస్తుంది. నానో సిరామిక్‌తో రూపొందిన ఆడ్‌గ్రీన్‌కోట్ పెయింట్‌ను కాంక్రీట్, ఆస్బెస్టాస్, మెటల్, ప్లాస్టిక్‌పైన పూతలాగా వాడొచ్చు. ఈ పూత ఉన్న ఉపరితలంపై పడిన 97 శాతం సూర్యరశ్మి పరావర్తనం చెందుతుంది. అంటే భవనం లోపలికి వేడిని దాదాపు రానీయదు. పలు దేశాల్లో ఆడ్‌గ్రీన్‌కోట్ టాప్ సెల్ల ర్గా ఉందని సన్ షాడో సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కె.రాజేశ్ గౌడ్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. గది ఉష్ణోగ్రత 6 డిగ్రీల దాకా తగ్గుతుందని చెప్పారు. ఏసీలపై భారం తగ్గి విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని తెలియజేశారు. 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ ఈ కోట్ వాడిన ఉపరితలంపై పాదరక్షలు లేకుండా నడవొచ్చని చెప్పారాయన.అయిదేళ్ల వారంటీ..: ఒకసారి ఆడ్‌గ్రీన్‌కోట్ వేస్తే అయిదేళ్లకుపైగా మన్నుతుందని సేల్స్ మేనేజర్ సతీష్ తెలిపారు. ‘‘ఇతర ఉత్పాదనతో పోలిస్తే తక్కువ పరిమాణంతో ఎక్కువ విస్తీర్ణంలో పెయింట్ వేయొచ్చు. చదరపు అడుగుకు రూ.40–45 చార్జీ చేస్తాం. వాహనాలకు కూడా ఆడ్‌గ్రీన్‌కోట్ వాడొచ్చు. ప్రస్తుతం వాణిజ్య భవనాలు, ఫ్యాక్టరీలు లక్ష్యంగా సేవలను అందిస్తాం. పంపిణీదారులను నియమించాక రిటైల్‌లో విస్తరిస్తాం’’ అని వివరించారు. ప్రస్తుత సీజన్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పెయింట్ వేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశామని, ఇది పర్యావరణానికి అనుకూలమైన ఉత్పాదన అని వివరించారు. -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : గ్లోబల్‌గా మిక్స్డ్ సంకేతాలు వస్తుండటంతో ఈక్విటీ బెంచ్మార్కులు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 21.98 పాయింట్ల లాభంతో 27257.64 వద్ద , నిఫ్టీ 19 పాయింట్ల లాభంలో 8417 వద్ద క్లోజ్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో మూడు నెలల గరిష్టంలో నమోదైన ఆసియన్ స్టాక్ మార్కెట్లు నిలకడగా ట్రేడ్ అయ్యాయి. దీంతో దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. బీహెచ్ఈఎల్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, ఓఎన్జీసీ, మహింద్రా అండ్ మహింద్రా లాభాల్లో కొనసాగగా.. ఎన్టీపీసీ, గెయిల్, హీరో మోటోకార్పొ, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ నష్టాలు గడించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.5 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.6 శాతం పెరిగాయి. రెండు నెలల కాలంలో బుధవారం ఇంట్రాడేలో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 0.5 శాతం పైకి ఎగిసింది. ఎస్ బ్యాంకు, కెనరా బ్యాంకు మంచి లాభాలను పండించాయి. సెన్సెక్స్‌లో మెటల్ టాప్ సెక్టోరల్ గెయినర్‌గా నిలిచింది. నాల్కో, హిందాల్కో, వెదంతా, జేఎస్పీఎల్, టాటా స్టీల్ లాభాలతో మెటల్ షేర్లు 2 శాతం పెరిగాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.09 పైసలు పడిపోయి, 68.05గా ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 18 రూపాయలు పడిపోయి 28,720గా నమోదైంది. -
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బలంగా ముగిశాయి. ప్రపంచ మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నప్పటికీ బ్యాంకింగ్, మెటల్ రంగాల మద్దతుతో మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు ఎగసి 27,140 వద్ద , నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 8,381 వద్ద స్థిరపడింది. ఇది రెండు నెలల గరిష్టంకాగా, మెటల్, బ్యాంకింగ్ దిగ్గజాలు మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. ఒక్క ఐటీతప్ప మిగిలిన అన్ని రంగాలూ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా వడ్డీ రేట్లు తగ్గుతున్న కారణంగా రుణాలకు డిమాండ్ ఊపందుకుంటుందన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు లాభాల దౌడు తీశాయి. బడ్జెట్‌ను అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రధానంగా మెటల్ 4.3 శాతం జంప్‌చేసింది. 2.3 శాతం లాభపడిన బ్యాంక్ నిఫ్టీ జత కలవడంతో మార్కెట్లు పాజిటివ్ గా ముగిశాయి. జిందాల్ స్టీల్ , నాల్కో, హిందాల్కో, సెయిల్, కోల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, భూషణ్ స్టీల్, వెల్స్పన్ కార్ప్, వేదాంతా, హిందుస్తాన్ జింక్, ఎన్ఎండీసీ 6-1.6 శాతం మధ్య జంప్‌చేశాయి. అలాగే ప్రయివేట్, ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు పుంజుకున్నాయి. క్యూ3 ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ 6.4 శాతం లాభపడగా.. బీవోబీ, యస్‌బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, పీఎన్బీ, కెనరా, బీవోఐ, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ, స్టేట్‌బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ లాభాలను ఆర్జించాయి. ప్రమోటర్ జెఎస్డబ్ల్యు సిమెంట్ షేర్ల అమ్మకాలకు ఆమోదం తెలపడంతో శివం సిమెంట్ దాదాపు తొమ్మిదేళ్ల గరిష్టాన్ని తాకింది. బజాజ్ఆటో, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, ఆర్ఐఎల్ స్వల్పంగా నష్టపోయాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 14 పైసలు నష్టపోయి రూ.68.32 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ.93 లాభంతో రూ. 28,237వద్ద ఉంది. -
వెలుగులో మెటల్, బ్యాంకింగ్ షేర్లు
♦ సెన్సెక్స్ 69 పాయింట్ల రికవరీ ♦ నిఫ్టీ 39 అప్ బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లు పెరగడంతో మూడురోజుల మార్కెట్ పతనానికి బుధవారం బ్రేక్‌పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 69 పాయింట్లు కోలుకుని, 28,293 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ దాదాపు 550 పాయింట్లు నష్టపోయింది. తాజాగా నిఫ్టీ 39 పాయింట్లు ర్యాలీ జరిపి 8,745 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు గురువారం ముగియనున్న నేపథ్యంలో షార్ట్ కవరింగ్ జరగడంతో సూచీలు కోలుకున్నాయని విశ్లేషకులు చెప్పారు. అయితే వచ్చేవారం కొత్త ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరగనున్నందున, ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరిస్తున్నారని, దాంతో మార్కెట్ రికవరీ పరిమితంగా వుందని విశ్లేషకులు వివరించారు. సెన్సెక్స్-30 షేర్లలో అధికంగా టాటా స్టీల్ 3.25 శాతం పెరిగి రూ. 380 వద్ద ముగిసింది. ఎంఆర్ఎఫ్ @ 50,000 -భారత్‌లో అత్యధిక ధర ఉన్న షేర్ ముంబై: టైర్లు తయారు చేసే ఎంఆర్ఎఫ్ కంపెనీ షేర్ ధర బీఎస్ఈలో బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఏడాది గరిష్ట స్థాయి, రూ.50,000ను తాకింది. చివరకు 6.7 శాతం లాభంతో రూ.49,734 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈలో ఈ షేర్ ఇంట్రాడేలో 7.79 శాతం వృద్ధితో రూ.50,190ను తాకింది. చివరకు 6.85 శాతం లాభంతో రూ.49,753 వద్ద ముగిసింది. భారత్‌లో అత్యధిక ధర ఉన్న షేర్ ఇదే. ఈ ర్యాలీ కారణంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,330 కోట్లు పెరిగి రూ.21,093 కోట్లకు ఎగసింది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : ఫ్లాట్‌గా ప్రారంభమైన సోమవారం నాటి స్టాక్ మార్కెట్లు.. మరింత నష్టాల పాలవుతున్నాయి. సెన్సెక్స్ 131 పాయింట్ల నష్టంతో 27,945 వద్ద, నిఫ్టీ 43.25 పాయింట్ల నష్టంతో 8623 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఆర్బీఐకి కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ పేరు ఖరారైన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించి లాభాల్లో ట్రేడ్ అవుతాయని మార్కెట్ విశ్లేషకులు అంచనావేశారు. కానీ ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్ తోపాటు ఆటో, మెటల్, బ్యాంకింగ్ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో దేశీయ సూచీలు నష్టాలను చవిచూస్తున్నాయి. అదానీ పోర్ట్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, హెచ్‌యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. టీసీఎస్, లుపిన్, టాటా స్టీల్ నష్టాల బాట పట్టాయి. భారత్‌లో అతిపెద్ద టెక్స్టైల్ తయారీదారి వెల్సపన్ ఇండియా 20 శాతం మేర పతనమవుతున్నాయి. వెల్సపన్ ఇండియాతో ఉన్న తన వ్యాపారాలన్నింటినీ టార్గెట్ కార్పొ మూసివేస్తున్నట్టు బ్లూమ్‌బర్గ్ రిపోర్టు వెలువడిన అనంతరం ఈ కంపెనీ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీ తన కీలక మార్కు 8600 కంటే పడిపోతే, ఊపందుకునే బుల్లిష్ ట్రెండ్‌ను మార్కెట్లు కోల్పోతాయని ఏంజెల్ బ్రోకింగ్ తన రీసెర్చ్ నోట్లో తెలిపింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.13 పైసలు బలహీనపడి 67.19గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం కూడా 167 రూపాయల నష్టంతో 31,237వద్ద ట్రేడ్ అవుతోంది. -
ఉక్కు కంటే నాలుగు రెట్ల గట్టి లోహం!
వాషింగ్టన్: టైటానియం బంగారం మిళి తమై ఏర్పడ్డ లోహం ఉక్కు కంటే మూడు నుంచి నాలుగు రెట్లు గట్టిగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది చాలా లోహాల కంటే గట్టిదని తెలిపారు. దీన్ని వైద్య రంగంలో కూడా వాడవచ్చని రైస్ వర్సిటీకి చెందిన ఎమీలియా మొరోసన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. టైటానియం గట్టి పదార్థమని, దీన్ని కృత్రిమ మోకాళ్లు, తొం టికీళ్ల నిర్మాణానికి వినియోగిస్తారన్నారు. -
పొడవాటి గౌన్లు.. హొయలొలికించిన భామలు
అమెరికాః ఫ్యాషన్ ప్రపంచం రోజురోజుకూ విస్తరిస్తోంది. డిజైనర్లు విభిన్న రీతులను ప్రదర్శించడంలో తమ ప్రతిభను అత్యద్భుతంగా చాటుతున్నారు. ఇటీవల ప్రారంభమైన మెట్ గాలా ఫ్యాషన్ పెరేడ్ అందుకు తార్కాణంగా నిలిచింది. అందమైన పొడవాటి గౌన్లు ధరించి, ఎర్రతివాచీపై ఒయ్యారాలొలికించిన మోడల్స్ సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నారు. ఫ్యాషన్ కు మరోపేరైన మెట్ గాలా 2016 సంబరాలు అమెరికాలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి హాలీవుడ్ నటీనటులు, ఫ్యాషన్ డిజైనర్లు అనేకమంది హాజరయ్యారు. విలక్షణమైన డిజైన్లతో కూడిన విభిన్న దుస్తులు ధరించిన సెలబ్రిటీలు చూపరులను అమితంగా ఆకట్టుకున్నారు. ప్రతియేటా మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ సంస్థకు నిధులు సేకరించేందుకు ఈ మెట్ గాలా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఫ్యాషన్ ప్రముఖ మోడల్స్ తో పాటు, నటీనటులు కూడ స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకొస్తారు. ఈసారి కార్యక్రమం ప్రారంభోత్సవంలో హాలీవుడ్ తారలు ప్రత్యేకాకర్షణగా నిలిచారు. ఫ్యాషన్ పెరేడ్ లో పాల్గొన్న మోడల్స్... తమ దుస్తుల డిజైన్లలో ఒక్కోరు ఒక్కో ప్రత్యేకతను ప్రదర్శించారు. మినీలూయిస్ విట్టన్, మెటాలిక్ రబ్బరు గివెన్సీ గౌన్లు, అద్దకాలతో కూడిన లేజర్ కట్ యాక్రిలిక్స్, షిఫాన్ బుర్బెర్రీ దుస్తులతోపాటు... గొలుసులతో అల్లినట్లుగా కనిపించే చెయిన్ మెయిల్ బాల్మెయిన్ వంటి అనేక రకాల అదరగొట్టే డిజైన్లను ధరించిన మోడల్స్ ర్యాంప్ పై హొయలొలికించారు. ఫ్యాషన్ షోలో తన ఫేరీ టేల్ దుస్తులతో విభిన్నతను చాటిన క్లారీ డేన్స్ ప్రత్యేకతగా నిలువగా, కెన్డాల్ జెన్నర్ ఫ్యాషన్ ప్రపంచాన్ని తన దుస్తులతో విభిన్నంగా చూపారు. జిగి, జాయిన్ లు రోబో కాప్ లుక్ తో మెట్ గాలా బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొందారు. -
వెలుగులో మెటల్, సిమెంట్ షేర్లు
♦ రోజంతా సూచీల హెచ్చుతగ్గులు ♦ చివరకు స్వల్పంగా కోలుకున్న మార్కెట్ ముంబై: రెండు నెలల్లో అతిపెద్ద పతనాన్ని క్రితంరోజు చవిచూసిన భారత్ మార్కెట్ బుధవారం స్వల్పంగా కోలుకుంది. రిజర్వుబ్యాంక్ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను పావుశాతమే పెంచడంతో మంగళవారం సెన్సెక్స్ 516 పాయింట్లు పతనమైన సంగతి తెలిసిందే. తాజాగా మెటల్, సిమెంట్ షేర్లలో జరిగిన కొనుగోళ్ల ఫలితంగా స్వల్ప రికవరీ సాధ్యపడింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ గత సమావేశపు మినిట్స్ బుధవారం రాత్రి వెలువడనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో ట్రేడింగ్ కూడా మందకొడిగా సాగింది. దాంతో 25,000-24,834 పాయింట్ల మధ్య స్వల్ప హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 17 పాయింట్ల పెరుగుదలతో 24,901 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 11 పాయింట్ల పెరుగుదలతో 7,614 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే ఫెడ్ మినిట్స్ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు మందకొడిగా వున్నందున, భారీ పెరుగుదల సాధ్యపడలేదని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు. టాటా స్టీల్ టాప్ గెయినర్... మెటల్, సిమెంటు షేర్లకు భారీ కొనుగోలు మద్దతు లభించింది. యూరప్ ప్లాంట్ల అమ్మకానికి సంబంధించిన లావాదేవీ త్వరలో జరగవచ్చనే అంచనాలతో పాటు ఒడిస్సా మైనింగ్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ క్లియరెన్స్ రావడంతో టాటా స్టీల్ 5.24 శాతం పెరిగి రూ. 328 వద్ద ముగిసింది. ఇదేబాటలో హిందాల్కో 4.5 శాతం, వేదాంత 2 శాతం మేర పెరిగాయి. సిమెంటు షేర్లు అల్ట్రాటెక్, ఏసీసీ, గ్రాసిమ్‌లు 1.5-3 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. -
బజాజ్ కొత్త టూ వీలర్ బ్రాండ్ ‘వి’..
♦ ఫిబ్రవరి 1న ఆవిష్కరణ ♦ ఐఎన్ఎస్ విక్రాంత్ మెటల్‌తో తయారీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న బజాజ్ ఆటో... ద్విచక్ర వాహన విభాగంలో ‘వి’ పేరుతో కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరిస్తోంది. ఫిబ్రవరి 1న దేశానికి ఈ బ్రాండ్‌ను పరిచయం చేయనున్నట్లు బజాజ్ ఆటో మోటార్‌సైకిల్ బిజినెస్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. భారత దేశ తొలి విమాన వాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి సేకరించిన లోహంతో ఈ బ్రాండ్ బైక్‌లను తయారు చేశారు. తొలి మోడల్ 150 సీసీ సామర్థ్యంతో రానున్నట్టు సమాచారం. 5 గేర్లు ఉండే అవకాశం ఉంది. రౌండ్ హెడ్ ల్యాంప్, సింగిల్ సీట్, అలాయ్ వీల్స్, సీటును కలుపుతున్నట్టుగా ఫ్యూయల్ ట్యాంక్ వంటి ఫీచర్లు అదనపు ఆకర్షణలు. దేశానికి విశేష సేవలందించిన ఐఎన్ఎస్ విక్రాంత్ భారత సైనిక సామర్థ్యానికి నిదర్శనమని ఎరిక్ వాస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ స్ఫూర్తి, వారసత్వాన్ని కొత్త బ్రాండ్ కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని మోడళ్లు వస్తాయి? ధర ఎంత? వంటి వివరాలను ఫిబ్రవరి 1నే వెల్లడిస్తామన్నారు. ఇదీ ‘వి’ బ్రాండ్ నేపథ్యం.. భారత నేవీలోకి 1961లో ప్రవేశించిన ఐఎన్ఎస్ విక్రాంత్... 1961లో గోవా స్వాతంత్య్ర సమయంలో, 1971లో భారత్-పాక్ యుద్ధంలో విశేష సేవలందించింది. 1997లో సేవలకు స్వస్తి చెప్పి మ్యూజియంగా మారిపోయింది. 2014 నవంబరులో నౌకను తుక్కుగా మార్చారు. దీన్ని బజాజ్ ఆటో కొనుగోలు చేసింది. ఈ స్క్రాప్‌ను ప్రాసెస్ చేసి కొత్త బ్రాండ్ వాహనాల్లో వాడారు. -
చిన్నారి కడుపులో 'మెటల్' బాల్..!
కడుపు నొప్పితో బాధపడుతున్న చిన్నారికి వైద్యులు పెయిన్ కిల్లర్స్ తో చాలాకాలం వైద్యం నిర్వహించారు. అయితే మందులకు ఏమాత్రం తగ్గకపోగా నొప్పి పెరుగుతుండటంతో చివరికి అనుమానం వచ్చి...ఎక్స్ రే తీయించారు. కడుపులో కనిపించిన బంతిలాంటి ఆకారం చూసి విస్తుపోయారు. ఎన్నో రకాల మెటల్ వస్తువులు, అయిస్కాంతాలు ఒక్కచోటికి చేరి పేరుకుపోవడమే చిన్నారి నొప్పికి కారణమని గుర్తించారు. శస్త్ర చికిత్స నిర్వహించి ఆయా వస్తువులను బయటకు తీశారు. చిన్నపిల్లలు మట్టి, సుద్దముక్కలు వంటివి తినడం మనం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్ మధురకు చెందిన మూడేళ్ళ బాలుడు ఏది కనిపిస్తే అది కడుపులో వేసుకున్నట్టున్నాడు. అందుకే ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు అతడి పేగుకు చుట్టుకుపోయిన 29 అయిస్కాంతం ముక్కలు, ఓ బ్యాటరీ, ఓ కాయిన్ తోపాటు మరెన్నో చిన్న చిన్న వస్తువులను బయటకు తీశారు. నొప్పితో బాధపడుతున్న చిన్నారిని నెల క్రితం తల్లిదండ్రులు ఢిల్లీకి దగ్గరలోని ఫరీదాబాద్ మెట్రో ఆస్పత్రిలో చేర్పించారు. అప్పట్లో అతడికి మొదటిసారి ఎక్స్ రే తీశారు. స్కానింగ్ లో అతడి కడుపులో పేరుకుని ఉన్న పెద్ద మెటల్ బాల్ లాంటి ఆకారాన్ని చూసి డాక్లర్లు ఆశ్చర్యపోయారు. ఫరీదాబాద్ మెట్రో హస్పిటల్ లోని లాప్రోస్కోపిక్ సర్జరీ హెడ్.. డాక్టర్ బ్రహ్మ దత్ పాఠక్... చిన్నారి కడపులోని వస్తువులను గుర్తించారు. సుమారు ఓ సంవత్సరం నుంచి బాలుడికి ఇటువంటి వస్తువులు తినే అలవాటు ఉన్నట్లుగా ఉందని... మాగ్నెట్లన్నీ ఓచోట చేరి బంతి ఆకారంలో మారి, చిన్నారి నొప్పికి కారణం కావడమే కాక, కడుపులోని ఇతర భాగాలను సైతం పాడుచేస్తుండటాన్ని డాక్టర్లు గమనించారు. 'ఇది చాలా సమస్యాత్మకమైన కేసు. అయస్కాంతాలన్నీ చుట్టుకుపోవడం వల్ల చిన్నారి పేగు పూర్తిగా పాడైపోయింది. శస్త్ర చికిత్స చేయడానికి సుమారు మూడు గంటలు పట్టింది. మా వైద్య బృందం అంతా కలిసి ఆ చిన్ని పొట్టనుంచి ఒకదాని తర్వాత ఒకటిగా వస్తువులు తీస్తూనే ఉన్నాం.' అని డాక్టర్ పాఠక్ చెప్పారు. చిన్నారి కుటుంబ సభ్యులు జ్యువెలరీ బాక్స్ లు తయారు చేసే వ్యాపారం ఇంట్లోనే చేస్తుంటారని, దీంతో నేలపై పడిన ప్రతి వస్తువునూ చిన్నారి తినేయడం వల్లనే ఈ సమస్య వచ్చిందని వైద్యులు చెప్తున్నారు. మెటల్ వస్తువులు అతి చిన్నవిగా ఉంటే రోజువారీ కాలకృత్యాల్లో బయటకు వెళ్ళిపోయి ఉండేవని, పెద్దవిగా ఉండటంతో కడుపులోనే పేరుకు పోవడంతో.. ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చికిత్స చేయాల్సి వచ్చిందని వైద్యులు అంటున్నారు. ఇప్పటికైనా పేగు చాలాశాతం తినేయడంవల్ల చిన్నారి ఎక్కువకాలం నొప్పితో బాధపడే అవకాశం ఉందని, తగ్గడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుందని వైద్యులు చెప్తున్నారు. శస్త్ర చికిత్స అనంతరం చిన్నారి కుటుంబ సభ్యులు కూడ అతడిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంట్లోని వస్తువులన్నీ అతడికి అందకుండా జాగ్రత్త పడుతున్నారు. -
అత్యంత తేలికైన బంగారం
జెనీవా: అత్యంత తేలికైన 20 కేరట్ల బంగారాన్ని స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనితో చేసిన ఆభరణాలు ప్రస్తుతం మనం చూస్తున్న బంగారం కన్నా దాదాపు వెయ్యి రెట్లు తేలికగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ బంగారం గాలి మాదిరి తేలికగా ఉంటుందని ఈటీహెచ్ జురిచ్ యూనివర్సిటీ పరిశోధకుడు రఫేల్ మెజెంగా పేర్కొన్నారు. ఈ బంగారంలో 98 భాగాలు గాలి మాత్రమే ఉంటుంది. 2 భాగాలే ఘన పదార్థం(బంగారం) ఉంటుంది. ఈ పదార్థంలో కూడా ఐదింట నాలుగు భాగాలు మాత్రమే బంగారం ఉంటుంది. శాస్త్రవేత్తలు ముందుగా అమైలాయిడ్ ప్రోటీన్స్‌ను వేడి చేసి నానోమీటర్ సైజులో ఉండే ప్రోటీన్ తంత్రులను తయారుచేసి బంగారం ఉన్న ద్రవంలో ఉంచటంతో. జెల్ వంటి పదార్థం ఏర్పడింది. -
భారీగా నష్టపోతున్న స్టాక్ మార్కెట్లు
ముంబయి : స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 466 పాయింట్లకు పైగా కోల్పోతోంది. ప్రస్తుతం 27,300లకు సమీపంలో ట్రేడవుతోంది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా పడుతూ 8,220కి సమీపంలో ట్రేడవుతోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు తీవ్ర స్థాయిలో రావడంతో మన మార్కెట్లు నష్టపోతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఆశించిన స్థాయిలో ఉండదనే అంచనాలతో ఇన్వెస్టర్లు పెద్దయెత్తున అమ్మకాలు జరుపుతున్నారు. అమెరికా నుంచి ఆసియా దాకా ఒక సూచీ కూడా లాభాల్లో లేదంటే ఇన్వెస్టర్ల అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ముఖ్యంగా యూరోప్, జపాన్ ఆర్థిక వ్యవస్థలు ఎక్కువగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దేశాల్లోని సూచీలు భారీ నష్టాల్లో ఉన్నాయి. వృద్ధిరేటు బాగా మందగిస్తుందనే అంచనా వల్ల నైమెక్స్ క్రూడాయిల్ ధర 50 డాలర్లకు పతనమైంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 53 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. క్రూడ్ ధర తగ్గడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గే అవకాశం ఉంది. -
భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్క్టెట్లు
-
భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి : స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 380 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా, నిఫ్టీ 120 పాయింట్లకు పైగా నష్టపోయింది. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ప్రతికూల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.
-
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై:దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గో రోజు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 230 పాయింట్ల భారీ నష్టంతో కొనసాగుతుండగా, నిఫ్టీ 60 పాయింట్ల నష్ట పోయింది. ప్రస్తుతం నిఫ్టీ 8,200 పాయింట్లతో కొనసాగుతోంది. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ప్రతికూల ప్రభావం మన స్టాక్ మార్కెట్లపై పడిందని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. ఇదిలా ఉండగా డాలరుతో రూపాయి మారకం విలువ 63.40 కు పడిపోయింది. ఇది ఎనిమిది నెలల కనిష్టస్థాయికి పడిపోవడం గమనార్హం. -
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టం, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ప్రతికూల ప్రభావం మన స్టాక్ మార్కెట్లపైనా ప్రభావం చూపుతోంది. -
లాభాల నుంచి నష్టాల్లోకి..
సెన్సెక్స్ 134 పాయింట్లు డౌన్ 28,560 వద్ద ముగింపు పసిడి షేర్ల వెలుగు రియల్టీ షేర్ల బేజారు నాలుగు రోజుల లాభాల తరువాత మళ్లీ మార్కెట్లు నష్టపోయాయి. తొలుత లాభాలతోనే మొదలైనా మిడ్ సెషన్ వరకూ స్వల్ప ఒడిదుడుకుల కు లోనయ్యాయి. ఈ బాటలో ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ ఇంట్రాడేలో 8,623 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ సైతం 116 పాయింట్లు లాభపడి గరిష్టంగా 28,810కు చేరింది. ఆపై చివరి గంటన్నరలో అమ్మకాలు పెరగడంతో సూచీలు లాభాలు పోగొట్టుకోవడమేకాకుండా నష్టాలు చవిచూశాయి. వెరసి సెన్సెక్స్ 134 పాయింట్లు క్షీణించి 28,560 వద్ద నిలవగా, 32 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 8,556 వద్ద స్థిరపడింది. చైనా తయారీ రంగ మందగమనం కొనసాగడంతోపాటు, రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు చివర్లో అమ్మకాలకు మొగ్గుచూపారు. పవర్, మెటల్, ఆయిల్ డీలా బీఎస్ఈలో ప్రధానంగా పవర్, మెటల్, ఆయిల్ రంగాలు 2%పైగా పతనమయ్యాయి. మరోవైపు వినియోగ వస్తు రంగం 3.3% ఎగసింది. పసిడి దిగుమతులపై ఆంక్షలు తొలగడం ఇందుకు దోహదపడింది. జ్యువెలరీ షేర్లు గీతాంజలి, టీబీజెడ్ 20% చొప్పున దూసుకెళ్లగా, టైటన్, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, తంగమాయిల్, తారా, పీసీ జ్యువెలర్స్ 5-3% మధ్య లాభపడ్డాయి. ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో ఓఎన్జీసీ, హిందాల్కో, భెల్, రిలయన్స్, టాటా పవర్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, సెసాస్టెరిలైట్, హెచ్డీఎఫ్సీ 4-2% మధ్య నష్టపోగా, హీరోమోటో, హెచ్‌యూఎల్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ 3.5-1.5% మధ్య పురోగమించాయి. మరోవైపు ఆర్బీఐ సమీక్షలో వడ్డీ తగ్గింపు ఉండకపోవచ్చునన్న అంచనాలతో రియల్టీ షేర్లు ఇండియాబుల్స్, యూనిటెక్, హెచ్‌డీఐఎల్ 5-4% మధ్య దిగజారాయి. కాగా, డెరైక్టర్ పదవికి విజయ్ మాల్యా రాజినామా చేయడంతో మంగళూర్ కెమికల్స్ షేరు 9% జంప్‌చేసింది. -
బొగ్గు సంస్కరణల జోష్
146 పాయింట్లు అప్ 26,576 వద్దకు సెన్సెక్స్ వారం రోజుల గరిష్టం లాభాల్లో పవర్, మెటల్ బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చాయ్. దీంతో పవర్, మెటల్, బ్యాంకింగ్ షేర్లు వెలుగులో నిలిచాయి. ప్రభుత్వ సంస్థలకు నేరుగానూ, ప్రయివేట్ రంగ కంపెనీలకు ఈవేలం ద్వారానూ బొగ్గు గనుల కేటాయింపును చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయనుండటంతో సెంటిమెంట్ మెరుగుపడింది. ఇందుకు ఎఫ్ఐఐలు మళ్లీ కొనుగోళ్లబాట పట్టడం కూడా జత కలిసింది. వెరసి సెన్సెక్స్ మరోసారి లాభాలతో మొదలైంది. ఆపై 26,615 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే మిడ్ సెషన్లో ఉన్నట్టుండి అమ్మకాలు పెరగడంతో లాభాలు పోగొట్టుకున్నప్పటికీ, చివర్లో మళ్లీ పురోగమించింది. ట్రేడింగ్ ముగిసేసరికి 146 పాయింట్ల లాభంతో 26,576 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ సైతం 48 పాయింట్లు బలపడి 7,928 వద్ద నిలిచింది. వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 576 పాయింట్లు జమ చేసుకుంది. జిందాల్ స్టీల్ జోరు: మెటల్ షేర్లలో జిందాల్ స్టీల్ అత్యధికంగా 7.5% జంప్‌చేయగా, సెన్సెక్స్ దిగ్గజాలు గెయిల్, సెసాస్టెరిలైట్, భెల్, విప్రో, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ, మారుతీ, భారతీ 4.5-2.5% మధ్య పుంజుకున్నాయి. ఇక రియల్టీ షేర్లు శోభా, డీఎల్ఎఫ్, ఒబెరాయ్, గోద్రెజ్, ఇండియాబుల్స్, ఫీనిక్స్ 6.5-2.5% మధ్య దూసుకెళ్లడంతో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 2.6% లాభపడింది. కాగా, మరోవైపు బ్లూచిప్స్ ఓఎన్జీసీ, ఎం అండ్ఎం, కోల్ ఇండియా 2.5-1.5% మధ్య నష్టపోయాయి. -
నెల రోజుల్లో గరిష్ట నష్టాలు
ఇటీవల వరుస లాభాలతో దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్లు మళ్లీ నీరసించాయి. గత నెల రోజుల్లోలేని విధంగా సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయింది. 27,057 వద్ద ముగిసింది. ప్రధానంగా ఆయిల్, ఎఫ్ఎంసీజీ రంగాలు 1.5% చొప్పున తిరోగమించాయి. వెరసి నిఫ్టీ సైతం 59 పాయింట్లు క్షీణించి 8,094 వద్ద నిలిచింది. అంచనాలకంటే ముందుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చునన్న ఆందోళనలు సెంటిమెంట్‌ను దెబ్బకొట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. వచ్చే వారం జరగనున్న ఫెడ్ సమావేశంపై మారెట్లు దృష్టిపెట్టాయని చెప్పారు. దీనికితోడు ఇటీవల సరికొత్త రికార్డులతో దూసుకెళుతున్న మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి 61 స్థాయికి బలహీనపడటం కూడా అమ్మకాలకు కారణమైనట్లు తెలిపారు. దిగ్గజాలకు నష్టాలు: సెన్సెక్స్ దిగ్గజాలలో హీరో మోటో, ఐటీసీ, ఇన్ఫీ, కోల్ ఇండియా, రిలయన్స్, హెచ్డీఎఫ్ సీ, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, భెల్, టీసీఎస్ 2.5-1% మధ్య నష్టపోయాయి. అయితే మరోపక్క సెసాస్టెరిలైట్, టాటా పవర్, ఐసీఐసీఐ బ్యాంక్ 1.5% చొప్పు న లాభపడ్డాయి.కాగా, ట్రేడైన షేర్లలో అత్యధికం లాభపడటం విశేషం. 1,741 షేర్లు లా భాలతో పుంజుకోగా, 1,272 నష్టపోయాయి. -
4 వారాల కనిష్టం
ఇరాక్ మిలటెంట్లపై వైమానిక దాడులు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా సైన్యానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్ బలహీనపడింది. మరోవైపు ఉక్రెయిన్-రష్యా ఆందోళనలు, గాజాపై ఇజ్రాయెల్ దాడులు వంటి అంశాలు సైతం దీనికి జత కలిశాయి. ఇప్పటికే రష్యాపై అమెరికా, యూరప్ ఆంక్షల నేపథ్యంలో పశ్చిమ దేశాల నుంచి ఆహార సరుకుల దిగుమతులను రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తాజాగా నిషేధించడం ప్రపంచ ఇన్వెస్టర్లలో భయాలు రేపింది. వెరసి ఇండియాసహా ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు క్షీణించి 25,329 వద్ద ముగిసింది. ఇది నాలుగు వారాల కనిష్టంకాగా, నిఫ్టీ సైతం 81 పాయింట్లు పతనమై 7,569 వద్ద స్థిరపడింది. వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 579 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్‌లో ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మరిన్ని సంగతులివీ... బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ నష్టపోగా... రియల్టీ, పవర్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఆయిల్ రంగాలు 4-1.5% మధ్య నీరసించాయి. సెన్సెక్స్‌లో ఐదు షేర్లు మాత్రమే లాభపడగా భారతీ ఎయిర్టెల్ 2% ఎగసింది. ఇతర దిగ్గజాలలో సెసా స్టెరిలైట్ దాదాపు 6% దిగజారింది. ఈ బాటలో టాటా పవర్, భెల్, టాటా స్టీల్, హిందాల్కో, ఎల్అండ్టీ, గెయిల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4-2% మధ్య క్షీణించాయి. బీఎస్ఈ-500లో పుర్వంకారా 15% పడిపోగా, భూషణ్ స్టీల్, సి.మహీంద్రా, వర్ధమాన్, బాంబే డయింగ్, జిందాల్ స్టెయిన్లెస్, రేమండ్, హెచ్‌సీసీ, ధనలక్ష్మీ బ్యాంక్, బీజీఆర్ 10-6% మధ్య పతనమయ్యాయి. -
26,000 దిగువకు సెన్సెక్స్
వరుసగా రెండో రోజు మార్కెట్లు నష్టపోయాయి. వారం రోజుల తరువాత మళ్లీ సెన్సెక్స్ 26,000 పాయింట్ల దిగువకు చేరింది. 136 పాయింట్లు క్షీణించి 25,991 వద్ద ముగిసింది. ఒక దశలో కనిష్టంగా 25,900ను తాకింది. ఇక నిఫ్టీ కూడా 42 పాయింట్లు తగ్గి 7,749 వద్ద నిలిచింది. ప్రధానంగా రియల్టీ, మెటల్, ఆయిల్ రంగాలు 3-1.5% మధ్య నీర సించాయి. మంగళవారం మార్కెట్లకు సెలవుకావడం, గురువారం ఎఫ్‌అండ్‌వో సిరీస్ ముగింపు వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తొలినుంచీ అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారని నిపుణులు పేర్కొన్నారు. కాగా, వరుసగా రెండు రోజుల్లో సెన్సెక్స్ 281 పాయింట్లు నష్టపోయింది. హెచ్‌యూఎల్ జోష్: క్యూ1 ఫలితాల కారణంగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ దాదాపు 4% పుంజుకోగా, గత మూడు వారాల్లోలేని విధంగా కోల్ ఇండియా 3% పతనమైంది. మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో హిందాల్కో, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ, హీరోమోటో, ఆర్ఐఎల్, ఓఎన్ జీసీ 2-1.5% మధ్య తిరోగమించాయి. రియల్టీ షేర్లలో డీఎల్ఎఫ్, ఫీనిక్స్, డీబీ, శోభా, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, యూనిటెక్ 5-2% మధ్య పడ్డాయి. నేడు మార్కెట్లకు సెలవు ముంబై: ఈదుల్ ఫితర్(రంజాన్) సందర్భంగా మంగళవారం(29న) ఎన్ఎస్ఈ, బీఎస్ఈలతోపాటు, ఫారెక్స్, మనీ, మెటల్, ఆయిల్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. అయితే బులియన్, చక్కెర మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి. నేటి బోర్డ్ మీటింగ్స్ ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ర్యాన్‌బాక్సీ, సెసాస్టెరిలైట్, ఐడీఎఫ్సీ, డీసీఎం శ్రీరామ్, ఎస్కార్ట్స్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, వీగార్డ్ ఇండస్ట్రీస్, వీఐపీ ఇండస్ట్రీస్. -
4 రోజుల లాభాలకు బ్రేక్
తొలుత +140, తుదకు -110 - 25,474 వద్ద ముగిసిన సెన్సెక్స్ - తొలిసారి 7,700ను తాకిన నిఫ్టీ - రియల్టీ, మెటల్, విద్యుత్, ఆయిల్ డీలా - 2%పైగా లాభపడ్డ ఐటీ ఇండెక్స్ నాలుగు రోజుల వరుస లాభాల తరువాత మార్కెట్ నీరసించింది. లాభాల స్వీకరణ కోసం ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడంతో సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయింది. 25,474 వద్ద ముగిసింది. అయితే తొలుత 140 పాయింట్ల వరకూ లాభపడింది. ఉదయం సెషన్లో 25,736 వద్ద కొత్త గరిష్టాన్ని చేరింది. ఆ స్థాయిలో అమ్మకాలు పెరగడంతో మిడ్ సెషన్‌కల్లా లాభాలు కోల్పోవడమేకాకుండా 184 పాయింట్ల వరకూ నష్టపోయింది. 25,366 వద్ద కనిష్ట స్థాయిని చవిచూసింది. ఇక నిఫ్టీ కూడా మార్కెట్ చరిత్రలో తొలిసారి 7,700 పాయింట్లను తాకడం విశేషం. ఆపై ఒడిదుడుకులకులోనై చివరికి 30 పాయింట్ల నష్టంతో 7,627 వద్ద నిలిచింది. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 778 పాయింట్లు పుంజుకున్న విషయం విదితమే. ఎఫ్ఐఐల అమ్మకాలు ప్రధానంగా రియల్టీ ఇండెక్స్ 4.2% పతనంకాగా, మెటల్, విద్యుత్, ఆయిల్ రంగాలు 3-2% మధ్య నష్టపోయాయి. రియల్టీ షేర్లలో హెచ్‌డీఐఎల్, యూనిటెక్, డీఎల్ఎఫ్, ఇండియాబుల్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ 8-3% మధ్య దిగజారాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్, హిందాల్కో, కోల్ ఇండియా, భెల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, హెచ్‌యూఎల్, సెసాస్టెరిలైట్, భారతీ, టాటా మోటార్స్, ఆర్ఐఎల్, ఐటీసీ, ఎల్అండ్టీ 5-1.5% మధ్య తిరోగమించాయి. మరోవైపు ఇన్ఫోసిస్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, హీరోమోటో 3.5-1.5% మధ్య లాభపడ్డాయి. కాగా, ఎఫ్ఐఐలు రూ. 313 కోట్లు, దేశీ సంస్థలు రూ. 404 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1% స్థాయిలో తిరోగమించాయి. అయితే ట్రేడైన షేర్లలో 1,647 లాభపడితే, 1,487 నష్టపోయాయి.