
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం మరింత పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్226 పాయింట్ల లాభంతో 49978 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు ఎగిసి 14778 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ళ అసక్తి నెలకొంది.
యూపీఎల్, మారుతి సుజుకి, హెచ్‌డీఎఫ్‌సీ,ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ నష్టపోతున్నాయి. ప్రధానంగా మంగళవారం యూపీఎల్ గుజరాత్ యూనిట్లో మంటలు చెలరేగడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో 5 గురు మిస్ అయ్యారు. దీంతో ఈ షేరు భారీగా నష్టపోతోంది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ,ఎల్ అండ్ టీ ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, హీరో మోటో, ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, ఐవోసీ లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment