అమేజింగ్‌ స్టంట్‌! నువ్వు గ్రేట్‌ స్వామీ! ఫిదా అయిన ఎలన్‌ మస్క్‌ | Viral Video: Man Puts His Bare Hand Through Molten Metal | Sakshi
Sakshi News home page

అమేజింగ్‌ స్టంట్‌! నువ్వు గ్రేట్‌ స్వామీ! ఫిదా అయిన ఎలన్‌ మస్క్‌

Published Fri, Apr 1 2022 2:53 PM | Last Updated on Fri, Apr 1 2022 2:53 PM

Viral Video: Man Puts His Bare Hand Through Molten Metal - Sakshi

Man put his hand in molten metal without Injured: ఇంతవరకు ఎన్నో రకాల వైరల్‌ వీడియోలు చూశాం. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం వామ్మో అని కచ్చితంగా అంటారు. ఎందుకంటే అంతలా ఉంటుంది ఆ ఫీట్‌. ఆ అమేజింగ్‌ స్టంట్‌ చూసి టెస్లా దిగ్గజం ఎలన్‌ మస్క్‌ సైతం స్ఫందించారు.

వివరాల్లోకెళ్తే...ఒక వ్యక్తి కరిగిన ద్రవ లోహం అత్యంత వేడిగా ఉంటుంది. అలాంటి లోహ ద్రవాల వద్ద పనిచేసేవాళ్లు సైతం ఆ ఉష్టోగ్రతను తట్టుకోలేరు. అలాంటిది ఆ వ్యక్తి  ఏకంగా కరిగిన ద్రవ లోహంలో నేరుగా చేయి పెట్టి తీశాడు. అయితే ఆ వ్యక్తి చేతి మీద గాయం గానీ కందినట్లు గానీ లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌ తెగ వైరల్‌ అవుతుంది. మొదట్లో నెటిజన్లు ఇది ఫేక్‌ వీడియో అనుకున్నారు గానీ ఇది ఒరిజనల్‌ స్టంటేనని తేలింది.

ఈ వీడియోని చూసిన టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌.. వావ్‌ అద్భుతం అతనికి ఎలాంటి గాయాలు  కాలేదు అని అన్నారు. అంతేకాదు ఎవరు ఇలాంటి స్టంట్‌లు చేయవద్దని సోషల్‌ మీడియాలో ట్విట్‌ చేశారు కూడా. అయితే ఈ స్టంట్‌ని లైడెన్‌ఫ్రాస్ట్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. దీని ప్రభావం వల్ల నీటి బిందువులు తక్షణమే ఆవిరైపోకుండా, అత్యంత వేడిగా ఉండే హాబ్‌పై నృత్యం చేస్తాయి. అంతేకాదు ఆ మనిషి చేయికి గాయం కాకపోవడానికి కారణం అతని చర్మం ఉపరితలం మీద నీరు వేగంగా ఆవిరైపోతోందని, శక్తిమంతమైన తాత్కలిక నీటి ఆవిరి అతని చర్మాన్ని రక్షింస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

(చదవండి: ఫుడ్‌ డెలివరీ బాయ్‌ ఎంట్రీతో రచ్చ రచ్చ అయిన ప్రేమికుల గొడవ...వీడియో వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement