కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలో ఇటీవల టెస్లా కంపెనీ కారు ఘోర ప్రమాదానికి గురైంది. టెస్లా వై మోడల్‌కు చెందిన కారు డ్రైవర్ అతి వేగం కారణంగా.. ముందు ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం కారు ఏడుసార్లు పల్టికొట్టింది. అయినప్పటికీ డ్రైవర్‌తో సహా కారులోని వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. చిన్న గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో కారు గంటకు 100 మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో ఆరు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనకు సంబంధించిన వీడియోను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మద్యం లేదా డ్రగ్స్ తీసుకొని ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు
టెస్లా కారు ప్రమాదంపై కంపెనీ అధినేత ఎలన్ మస్క్ స్పందించారు. ప్రయాణికుల భద్రతే తమ కార్ల రూపకల్పనలో ప్రాథమిక లక్ష్యమని తెలిపారు. ప్రమాదంపై నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. టెస్లా తమ కస్టమర్ల గురించి చాలా శ్రద్ద వహిస్తుందని, ప్రయాణికుల భద్రతను వారు మరింత మెరుగుపరుస్తూ ఉన్నారని పేర్కొంటున్నారు.
🚨TESLA FLIPPED 7 TIMES IN CRASH: NO ONE DIED!
Footage of an accident showing a Tesla Model Y flying through the air after a crash at high speeds.
In what looks almost miraculous, no one inside the car was seriously hurt. pic.twitter.com/pk0VdVuYAA— Mario Nawfal (@MarioNawfal) June 25, 2024
Safety is our primary design goal
— Elon Musk (@elonmusk) June 25, 2024
Comments
Please login to add a commentAdd a comment