టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అధినేత ఎలాన్ మస్క్ కార్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డ్‌లను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం 9 లక్షల టెస్లా కార్లపై అమ్మకాలు జరపగా.. వచ్చే ఏడాది నాటికి వాటి సంఖ్య 1.3 మిలియన్లకు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారనే నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. గత కొద్ది కాలంగా రాయితీల విషయంలో కేంద్రంతో చర్చలు జరుపుతుండగా...ఈ ఏడాది చివరిలో నాలుగు మోడళ్లకార్లలోని ఓ మోడల్‌ను విడుదల చేయనున్నారు.
వెడ్ బుష్ సెక్యూరిటీ రిపోర్ట్ ప్రకారం.. చిప్ సమస్య, ఉత్పత్తుల విషయంలో ఇతర ఆటోమొబైల్ సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. కానీ టెస్లా అందుకు భిన్నంగా కార్ల ఉత్పత్తుల్ని పెంచుతుందని తన కథనంలో పేర్కొంది. లాస్ ఏంజిల్స్ సంస్థ డాన్ ఐవ్స్ విశ్లేషకుడు.. ఈ ఏడాది చివరి నాటికి టెస్లా 9లక్షల ఎలక్ట్రిక్ వాహనాల్ని డెలివరీ చేస్తుందని, వచ్చే ఏడాది నాటికి 1.3 మిలియన్ వాహనాల్ని అమ్మే సామర్ధ్యం టెస్లాకు ఉందని చెప్పారు. అంతేకాదు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని, రాబోయే రోజుల్లో ఎలాన్ మస్క్ టెస్లా కార్ల అమ్మకాల్లో ప్రథమ స్థానంలో ఉంటారని తెలిపారు.
చైనా ప్యాసింజర్ కార్ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. టెస్లా చైనాలో ఆగస్టు నెలలోనే 44,264 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ఇందులో 31,379 యూనిట్లు ఇతర మార్కెట్లకు ఎగుమతి చేయబడ్డాయి. జూలైలో 8,621 యూనిట్లు, ఆగస్ట్ నెలలో 12,885 యూనిట్లతో కార్ల అమ్మకాల్ని పెంచింది. కాగా ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా మొత్తం వాహనాలలో 3 శాతం ఎలక్ట్రిక్ వాహనాలున్నాయి. వాటి సంఖ్య 2025 నాటికి 10 శాతానికి పెంచవవచ్చని మార్కెట్ నిపుణుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.
చదవండి: అప్పుడే అయిపోలేదు.. ఇప్పుడే మొదలైంది
Comments
Please login to add a commentAdd a comment