టెస్లా కారును ఇలా కూడా వాడొచ్చా? మస్క్‌కు మతిపోయే వీడియో! | Man Installs Buggy Wheels On A Tesla And Drives It Upside Down | Sakshi
Sakshi News home page

టెస్లా కారును ఇలా కూడా వాడొచ్చా? మస్క్‌కు మతిపోయే వీడియో!

Published Wed, Dec 27 2023 9:28 PM | Last Updated on Wed, Dec 27 2023 9:36 PM

Man Installs Buggy Wheels On A Tesla And Drives It Upside Down - Sakshi

టెస్లా.. అమెరికాకు చెందిన ప్రసిద్ధ కార్ల కంపెనీ. మల్టీ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ ప్రీమియం ఎలక్ట్రిక్‌ కార్లను తయారు చేస్తుంది. అయితే టెస్లా కారుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

ఈ వీడియోలో టెస్లా కారును చిత్రంగా మాడిఫై చేశారు. కారు నాలుగు చక్రాలను పీకేసి 10 అడుగుల బగ్గీ చక్రాలను అమర్చారు. దీంతో ఆ కారు  అస్తవ్యస్తమైన రోడ్డుపైనా రయ్‌ అని దూసుకెళ్తోంది. అంతేకాదు కారు తలకిందులుగా కూడా నడుస్తూ ఆశ్చర్యపరుస్తోంది. 

నాన్‌ ఏస్తటిక్‌ థింగ్స్‌ (non aesthetic things @PicturesFoIder) పేరుతో ఉన్న ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్‌ మారింది. గంటల వ్యవధిలోనే 1.37 కోట్లకుపైగా వ్యూస్‌ వచ్చాయి. యాజర్లు తమకు తోచినవిధంగా కామెంట్స్‌ చేశారు. మాడిఫై చేసిన రకరకాల కార్ల వీడియోలను, మీమ్స్‌ను జోడించారు. కాగా కారును మాడిఫై చేసి వీడియో రూపొందించింది ఓ యూట్యూబర్‌ అని తెలుస్తోంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement