wheels
-
ధ్యానం.. ఆవాహనం
ఒత్తిడి సహా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే జ్ఞానం ఉన్నా ధ్యానమార్గం వైపు ప్రయాణించే తీరిక, సమయం లేక ఇబ్బంది పడుతున్నవారి సమక్షానికి ధ్యానమే తరలివస్తోంది. నగరంలోని ఐటీ కంపెనీలు, ఆస్పత్రులు, కళాశాల ప్రాంగణాల్లో ఉచితంగా ధ్యానాభిరుచిని పరిచయం చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా నగరంలో మెడిటేషన్ ఆన్ వీల్స్‌కు శ్రీకారం చుట్టింది ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయ.. విహారం నుంచి ఆహారం దాకా కాదేదీ ఆ‘వాహనానికి’ అనర్హం అన్నట్టు సిటీలో ‘వీల్స్’ వీరవిహారం చేస్తున్నాయి. అదే క్రమంలో నగరంలో మెడిటేషన్ ఆన్ వీల్స్ అందుబాటులోకి వచ్చింది. కొన్ని నెలలుగా 3వేల మందికి పైగా తమ ధ్యాన చక్రాలు పలకరించాయని అంటున్నారు ఆధ్యాత్మిక వేదిక ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు. ధ్యాన మార్గం వైపు మళ్లించేందుకు..నగరంలో చదువుతో మొదలుపెడితే... ఉద్యోగాలు, వ్యాపకాల వంటివన్నీ ఒత్తిడి కారకాలుగా మారుతున్నాయి. ఈ ఒత్తిడి అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతోంది. దీనికి అత్యుత్తమ పరిష్కారం ధ్యానం.. అయితే సమయాభావం కావచ్చు, తగినంత అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు... చాలా మంది ఈ పరిష్కారాన్ని అందుకోలేకపోతున్నారు. వారి కోసమే ఈ మెడిటేషన్ ఆన్ వీల్స్‌ను డిజైన్ చేశామని వీరు చెబుతున్నారు. ఆధ్యాత్మిక తోవ... ఈ వాహనంతో పాటు బ్రహ్మకుమారీ సంస్థ సభ్యులు కొందరు ప్రయాణిస్తుంటారు. నగరవాసుల అభ్యర్థన మేరకు వారు కోరుకున్న ప్రాంతానికే వెళ్లి వాహనం ద్వారా ధ్యానం చేసే అవకాశాన్ని కలి్పస్తారు. దీనికి ఎటువంటి ఫీజూ చెల్లించనవసరం లేదు. ఆ వాహనానికి అవసరమైన పార్కింగ్ సమకూరిస్తే చాలు. కనీసం 2 గంటల నుంచి అత్యధికంగా 4 గంటల దాకా సేవలు అందిస్తారు. వాహనంలో ఒక్కో బ్యాచ్‌కు 10 మంది వరకూ హాజరు కావచ్చు. ధ్యానం అనంతరం వారి అనుభూతిని తెలుసుకుని, ఆసక్తి, అవసరాన్ని బట్టి వారికి ఆ తర్వాత ఉచిత ధ్యాన తరగతుల్లో పాల్గొనేందుకు అవకాశం కలి్పస్తారు. ఐటీ కంపెనీ నుంచి గేటెడ్ కమ్యూనిటీ దాకా.. నగరంలో చుట్టుపక్కల ఉన్న ఏ విద్యా సంస్థ అయినా, ఐటీ కంపెనీ అయినా, గేటెడ్ కమ్యూనిటీ అయినా కార్పొరేట్ సంస్థలైనా...ఏవైనా సరే ఈ ధ్యాన వాహన సేవలు కావాలంటే బ్రహ్మకుమారీస్ను సంప్రదించవచ్చు. అవసరమైతే మరికొన్ని అదనపు రోజులు కూడా వాహనాన్ని అందుబాటులో ఉంచుతారు. కులమతాలకు అతీత సేవ... మెడిటేషన్ ఆన్ వీల్స్ అనేది దేశంలోనే తొలిసారి. ఈ వాహనం ద్వారా కులమతాలకు అతీతమైన «ఉచిత ద్యాన సేవ అందించనున్నాం. ఇప్పటికే గత 8నెలలుగా మూడు నుంచి నాలుగువేల మందికి మా వాహన సేవలు అందాయి. దేశవ్యాప్తంగా కూడా దీన్ని విస్తరించాలని యోచిస్తున్నాం. –శివాణి, బ్రహ్మకుమారీస్ -
టెస్లా కారును ఇలా కూడా వాడొచ్చా? మస్క్‌కు మతిపోయే వీడియో!
టెస్లా.. అమెరికాకు చెందిన ప్రసిద్ధ కార్ల కంపెనీ. మల్టీ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుంది. అయితే టెస్లా కారుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో టెస్లా కారును చిత్రంగా మాడిఫై చేశారు. కారు నాలుగు చక్రాలను పీకేసి 10 అడుగుల బగ్గీ చక్రాలను అమర్చారు. దీంతో ఆ కారు అస్తవ్యస్తమైన రోడ్డుపైనా రయ్ అని దూసుకెళ్తోంది. అంతేకాదు కారు తలకిందులుగా కూడా నడుస్తూ ఆశ్చర్యపరుస్తోంది. నాన్ ఏస్తటిక్ థింగ్స్ (non aesthetic things @PicturesFoIder) పేరుతో ఉన్న ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ మారింది. గంటల వ్యవధిలోనే 1.37 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. యాజర్లు తమకు తోచినవిధంగా కామెంట్స్ చేశారు. మాడిఫై చేసిన రకరకాల కార్ల వీడియోలను, మీమ్స్‌ను జోడించారు. కాగా కారును మాడిఫై చేసి వీడియో రూపొందించింది ఓ యూట్యూబర్ అని తెలుస్తోంది. Man puts 10ft buggy wheels on a Tesla and drives it upside down pic.twitter.com/1jGkvsYEjT — non aesthetic things (@PicturesFoIder) December 26, 2023 -
సాగర తీరంలో.. కోచ్ రెస్టారెంట్
హైదరాబాద్: రెస్టారెంట్ ఆన్ వీల్స్‌లో భాగంగా దక్షిణమధ్య రైల్వే ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డు ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద అద్భుతమైన రైల్ కోచ్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఉత్తర, దక్షిణాది వంటకాలతో అన్ని వర్గాల పర్యాటకులను ఆకట్టుకొనేవిధంగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ రెస్టారెంట్‌కి వెళితే కదులుతున్న ట్రైన్లో కూర్చొని నచ్చిన రుచులను ఆస్వాదిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో హుస్సేన్‌సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన ఈ కోచ్ రెస్టారెంట్ సందర్శకులకు సరికొత్త అనుభూతిని కలుగజేస్తుందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. టూరిస్ట్ హబ్‌గా నెక్లెస్‌రోడ్డు... ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు ప్రాంతాలు అంతర్జాతీయ పర్యాటక హంగులను సంతరించుకున్నాయి. ప్రతి రోజు వేలాది మంది సందర్శకులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు తరలివస్తున్నారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో పర్యాటకుల రద్దీ లక్షల సంఖ్యలో ఉంటుంది. నెక్లెస్‌రోడ్డులో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన కోచ్ రెస్టారెంట్ సైతం పర్యాటకప్రియులను ఆకట్టుకోనుంది. వినియోగంలో లేని ఒక కోచ్‌లో ఈ కొత్త రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ రైల్ కోచ్ రెస్టారెంట్‌ను ఐదు సంవత్సరాల కాలానికి నగరానికి చెందిన మెసర్స్ బూమరాంగ్ సంస్థకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఐదేళ్లపాటు వీరే నిర్వహిస్తారు. -
అబ్బో క్రియేటివిటి.. సైకిల్ టైర్లు ఇలా కూడా ఉంటాయా!
-
పాత వాణిజ్య వాహన వ్యాపారంలోకి అశోక్ లేలాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ పాత వాణిజ్య వాహనాల విక్రయంలోకి ప్రవేశించింది. ఈ మేరకు మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్‌తో చేతులు కలిపింది. అశోక్ లేలాండ్ తయారీ పాత వాహనం ఇచ్చి కొత్తది కొనుగోలు, పాత వాహన విక్రయానికి మహీంద్రాకు చెందిన 700లకుపైగా పార్కింగ్ కేంద్రాలు వేదికగా మారనున్నాయి. పాత వాహనాల మార్కెట్‌ను క్రమబద్ధీకరించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని అశోక్ లేలాండ్ తెలిపింది. -
కాసులు కురిపిస్తున్న వ్యాపారం, ఇప్పుడు.. ఎప్పుడూ.. ఎవర్‌గ్రీనే !
డాబాగార్డెన్స్(విశాఖ): మామ్మూళ్ల బెడద లేదు. కరెంటు.. ఇంటి అద్దె ఖర్చు లేదు. ఒకే వ్యాపారం చేయాలన్న ఒత్తిడి లేదు. నచ్చిన చోట మెచ్చిన వ్యాపారం. టిఫిన్ సెంటర్ నుంచి షర్బత్ బండి వరకు.. వినియోగదారులకు మెచ్చే ఆహారం. మొబైల్ బిజినెస్ ఇప్పుడు.. ఎప్పుడూ.. ఎవర్గ్రీన్ ట్రెండ్. పట్టణీకరణ పెరగడంతో సాటి మానవుడి అవసరాలు, ఆలోచనల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. బిజీబిజీ జీవనంలో శుచి, శుభ్రతతో ఉన్న వస్తువులు తమ వాకిట్లో లేదా తాము విధులు నిర్వహించే చోట, ఆఫీసుకు వెళ్లే మార్గంలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. జీవనం యాంత్రికం అయిపోవడంతో హోటళ్లు, షాపులకు వెళ్లే సమయం చాలా మందికి దొరకడం లేదు. దీంతో వినియోగదారుల అవసరాలకు తగిన విధంగానే వ్యాపారులు తమ వ్యాపార పద్ధతులను మార్చుకున్నారు. వాహనాల్లో మొబైల్ హోటళ్లు, షర్బత్‌లు సిద్ధం చేస్తున్నారు. పచ్చళ్లు, కాయగూరలు, విద్యుత్ బల్బులు, స్వీట్లు, దుస్తులు, కొబ్బరి బొండాలు, ఐస్‌క్రీంలు, పలు రకాల పండ్లు కూడా ఆటోల ద్వారా విక్రయిస్తున్నారు. దీని వల్ల వినియోగదారుల చెంతకే ఆహార పదార్థాలు చౌకైన ధరలకు అందడం ఒక విషయమైతే.. వ్యాపారులు కూడా ఒకే చోట ఉండి అ క్కడి పరిస్థితుల మీదనే ఆధార పడకుండా ఎక్కడ, ఏ సమయంలో వ్యాపారం జరుగుతుందంటే అక్కడ వాలిపోతున్నారు. ఫలితంగా వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం నగరంలో గజం స్థలం ధర చుక్కలంటడం, పైగా రోడ్డు పక్కన తోపుడు బండి పెట్టుకుందామన్నా పలు విధాల ఒత్తిళ్లు, మామ్మూళ్లు బెడద ఎక్కువైపోయింది. వీటన్నింటిని నుంచి విముక్తితో పాటు కరెంటు, ఇంటి అద్దె వంటి తదితర ఇబ్బందులు లేకపోవడంతో ఈ మొబైల్ వ్యాపారమే చాలా భేషుగ్గా ఉందని వ్యాపారులు అంటున్నారు. వినియోగదారులు అయితే హోటల్‌కు వెళ్లి వేచి ఉండాల్సిన పని లేకుండా పనులకు వెళ్లే దారిలోనే టిఫిన్ కానిచ్చేస్తున్నారు. పండ్లు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాపారాలు జీవీఎంసీ పరిధి దక్షిణ నియోజకవర్గంలో కొకొల్లాలు. నగరంలోని సౌత్‌జైల్‌రోడ్డులో ఫుడ్ ఆన్ వీల్స్ ఘుమఘుమలు పంచుతున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా వాటికి బ్రేక్ ఇచ్చారు. ఇక సాయంత్రమైతే చాలు.. చినవాల్తేరు, బీచ్‌రోడ్డు పలు ప్రాంతాల్లో ఫుడ్ ఆన్ వీల్స్.. వందలాది బండ్లు అక్కడకు చేరుకుంటాయి. చేతిలో కార్డు ఉండే చాలు. చక చకా ఏం కావాలో అవి తినొచ్చు. ఏటీఎం డెబిట్/క్రెడిట్ కార్డ్స్‌తో పాటు పేటీఎం, గూగూల్ పే.. ఇలా ఎన్నో రకాలుగా నగదు చెల్లించేయొచ్చు. సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి వరకు (ప్రస్తుతం కర్ఫ్యూ అమల్లో ఉన్నందున రాత్రి 9 గంటల వరకే) ఇక్కడ టిఫిన్, నూడిల్స్, చికెన్ జాయింట్లు..ఫ్రైడ్ రైస్.. అన్ని రకాల చికెన్ వంటకాలతో పాటు చల్లని పానీయాలు కూడా మొబైల్ వ్యాన్ల ద్వారానే లభిస్తున్నాయి. మొత్తానికి ఈ బిజినెస్ ఇటు వినియోగదారులకు.. అటు వ్యాపారులకు ఇద్దరికీ సంతృప్తిని కలిగిస్తోంది. -
పంచర్లు లేని ప్రయాణం
- కొత్తగా మార్కెట్లోకి వచ్చిన టైర్ సీలెంట్ - రాష్ట్రంలోనే తొలిసారి ‘అనంత’లో లాంచింగ్ అనంతపురం : ఇకపై ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులు, లారీలు ఇలా ఏ వాహనాలైనా సరే పంచర్లు కాకుండా ప్రయాణం చేయొచ్చు. రాష్ట్రంలోనే తొలిసారి అనంతపురం నగరానికి చెందిన ఆర్కే ట్రేడర్స్ వారు ‘టైర్ సీలెంట్’ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ప్రొడక్ట్‌ను ఆదివారం ప్రారంభించారు. టైర్ సీలెంట్ వాడుక, పనితనంపై తమిళనాడుకు చెందిన ఇంపోర్టర్ ఆర్.శేఖర్ వివరించారు. టైర్‌సీలెంట్ అనే ద్రావణం ట్యూబ్‌లో నింపడం ద్వారా పంచర్‌కు అవకాశమే ఉండదన్నారు. పైగా ఎంతదూరం ప్రయాణించినా టైర్లు వేడి ఎక్కవన్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇది విజయవంతమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్స్, ఆర్కే ట్రేడర్స్ అధినేతలు వేణుగోపాల్‌రెడ్డి, వెన్నపూస రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాము సుమారు 100కు పైగా వాహనాలను ప్రాక్టికల్‌గా ఉపయోగించామని, మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. టైర్లు అరిగిపోయే వరకు ట్యూబ్‌లు మార్చాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ సందర్భంగా కొన్ని వాహనాలకు సీలెంట్ వేసి ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. ముందుగా టైరులో గాలిమొత్తం తీసి అందులో సీలెంట్ నింపి తిరిగి గాలి పెట్టారు. ఆ తర్వాత టైరులోకి మేకు దింపి కొన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత మేకు తీసేశారు. అయినా గాలి పోలేదు. -
ప్రాణాన్ని బలి తీసుకున్న ఫుట్‌బోర్డు ప్రయాణం
-
చక్రాలే చెయిర్లైతే...
మనసుండాలే కానీ... మనిషి తెలివికి, ప్రతిభకి ఎలాంటి కొలమానం సరిపోదు. ఎందుకంటారా? ఒకసారి పక్కనున్న ఫొటోలను చూస్తే మీకే అర్థమవుతుంది. మొదటగా టైర్లను అసలు ఎందుకు తయారు చేశారు? వాహనాల కోసం. అవునా, మరి అవి పాడయితే ఎలా? వాటిని ఎలాగూ వాహనాలకు అమర్చలేం.. ఇక్కడే మనిషి తెలివి ఉపయోగపడేది. ఆ పాడైన టైర్లను కుర్చీలు, బల్లలు, సెంటర్ టేబుల్స్‌గా తయారు చేసి వాడుకోవచ్చు. కావలసినవి: పాత టైరు, దళసరి కార్డ్‌బోర్డు, నాలుగు కాళ్ల పీట, జనపనార, గ్లూ తయారీ: ముందుగా సెంటర్ టేబుల్ తయారీకి... కార్డ్‌బోర్డు ముక్క టైరు సెంటర్ హోల్ సైజుకు అనుగుణంగా గుండ్రంగా కట్ చేసుకోవాలి. తర్వాత గ్లూతో ఆ కార్డ్బోర్డును టైరుకు అతికించాలి. తర్వాత టైరుకు పూర్తిగా గ్లూను పూయాలి. ఇప్పుడు జనపనారను టైరు చుట్టూ చుట్టాలి. గ్లూ రాశాం కాబట్టి.. చుట్లు ఊడిపోవు. తర్వాత ఈ టైరును నాలుగు కాళ్ల పీటపై పెట్టి అతికించాలి. ఇప్పుడు ఈ సెంటర్ టేబుల్‌ను ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే జనపనార చుట్టకుండా కూడా వీటికి ఏదైనా రంగు వేసి, వాటిపై కార్డ్‌బోర్డు లేదా గ్లాస్ బోర్డు పెట్టి సెంటర్ టేబుల్‌గా వాడుకోవచ్చు. అంతేనా ఫొటోలో కనిపిస్తున్న విధంగా చెయిర్, సోఫాల్లా మార్చుకోవచ్చు. -
360 డిగ్రీల్లో తిరిగే కొత్త కారు
కారు కొనాలనుకున్నవారు... ముందుగా దానికున్న విశిష్ట లక్షణాలను గమనిస్తారు. ముఖ్యంగా అందులోని ఆధునిక పరిజ్ఞానానికీ ప్రాధాన్యతనిస్తారు. అందుకే వాహన ప్రేమికులంతా ఇష్టపడే విధంగా లండన్ కు చెందిన ఓ వ్యక్తి కొత్తరకం కారును సృష్టించాడు. ప్రధానంగా 360 డిగ్రీల్లో చక్రాలు ఏ దిశకైనా తిరిగేలా ఏర్పాటు చేసి, తక్కువ స్థలంలో కూడా కారు అన్నివైపులకూ తిరిగేలా రూపొందించాడు. లండన్ కు చెందిన విలియం లిడ్డియార్డ్.. నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. ఫోర్క్ లిఫ్ట్ వాహనాల్లో వినియోగించే వోమిని డైరెక్షనల్ చక్రాలను పెట్టి, తయారు చేసిన ఆ కారు.. 360 డిగ్రీల్లో ఎటుపక్కకైనా సులభంగా తిరిగేట్టు ఏర్పాటు చేశాడు. అడ్డంగా పార్క్ చేయాల్సి వచ్చినపుడు సైతం ఇబ్బంది పడకుండా పక్కకు జరిపేందుకు వీలుగా కారు వీల్స్ ను రూపొందించాడు. సాధారణ కార్లకు వినియోగించే చక్రాల్లా కాకుండా... తాను వినియోగించిన చక్రాలు ఏ దిశకైనా తిరుగుతాయని, బోల్ట్ ఆన్ ఆప్లికేషన్ ను వినియోగించి ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఈ నూతన ఆవిష్కరణకు నాంది పలికినట్లు లిడ్డియార్డ్ చెప్తున్నాడు. పాత టయోటా కారుకు తాను రూపొందించి కొత్తరకం వీల్స్ ను పెట్టి, ట్రయల్ రన్ వేసిన అతడు.. ఆ వీడియోను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసి, అందుకు సంబంధించిన వివరణ ఇచ్చాడు. సాధారణ కారుకు వేగంలోనూ, పనిచేసే తీరులోనూ ఏమాత్రం తీసిపోదని, అంతకంటే ఎక్కువ నియంత్రణా సామర్థ్యం కూడా కలిగి ఉంటుందని చెప్తున్నాడు. విలియమ్స్ కొత్త ప్రయోగం.. ఇప్పుడు యూట్యూబ్ లో లక్షలకొద్దీ వ్యూయర్లను ఆకట్టుకుంటోంది. అతడు పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే నాలుగు లక్షలమంది వరకూ తిలకించడం ఎంతో ఆనందంగా ఉందని, తన నూతన ఆవిష్కరణ 'లిడ్డర్డ్ వీల్స్' కు సోషల్ మీడియా సహాయపడుతుందని ఆశిస్తున్నాడు. తన కొత్త సృష్టిని ఏదైనా కంపెనీ ప్రోత్సహిస్గే వారితో కలసి అభివృద్ధి పరిచి, కొత్తరకం కారును మార్కెట్లోకి తేవాలని ఎదురు చూస్తున్నాడు. మార్కెట్లో ప్రవేశ పెడితే తన వీల్స్ కు ఎంతో డిమాండ్ వస్తుందని ధీమాగా చెప్తున్నాడు.