హైదరాబాద్: రెస్టారెంట్ ఆన్ వీల్స్‌లో భాగంగా దక్షిణమధ్య రైల్వే ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డు ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద అద్భుతమైన రైల్ కోచ్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఉత్తర, దక్షిణాది వంటకాలతో అన్ని వర్గాల పర్యాటకులను ఆకట్టుకొనేవిధంగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ రెస్టారెంట్‌కి వెళితే కదులుతున్న ట్రైన్‌లో కూర్చొని నచ్చిన రుచులను ఆస్వాదిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో హుస్సేన్‌సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన ఈ కోచ్ రెస్టారెంట్ సందర్శకులకు సరికొత్త అనుభూతిని కలుగజేస్తుందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
టూరిస్ట్ హబ్‌గా నెక్లెస్‌రోడ్డు...
ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు ప్రాంతాలు అంతర్జాతీయ పర్యాటక హంగులను సంతరించుకున్నాయి. ప్రతి రోజు వేలాది మంది సందర్శకులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు తరలివస్తున్నారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో పర్యాటకుల రద్దీ లక్షల సంఖ్యలో ఉంటుంది. నెక్లెస్‌రోడ్డులో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన కోచ్ రెస్టారెంట్ సైతం పర్యాటకప్రియులను ఆకట్టుకోనుంది. వినియోగంలో లేని ఒక కోచ్‌లో ఈ కొత్త రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ రైల్ కోచ్ రెస్టారెంట్‌ను ఐదు సంవత్సరాల కాలానికి నగరానికి చెందిన మెసర్స్ బూమరాంగ్ సంస్థకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఐదేళ్లపాటు వీరే నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment