మెడిటేషన్ ఆన్ వీల్స్‌కు శ్రీకారం
ఒత్తిడి సహా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే జ్ఞానం ఉన్నా ధ్యానమార్గం వైపు ప్రయాణించే తీరిక, సమయం లేక ఇబ్బంది పడుతున్నవారి సమక్షానికి ధ్యానమే తరలివస్తోంది. నగరంలోని ఐటీ కంపెనీలు, ఆస్పత్రులు, కళాశాల ప్రాంగణాల్లో ఉచితంగా ధ్యానాభిరుచిని పరిచయం చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా నగరంలో మెడిటేషన్ ఆన్ వీల్స్‌కు శ్రీకారం చుట్టింది ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయ..
విహారం నుంచి ఆహారం దాకా కాదేదీ ఆ‘వాహనానికి’ అనర్హం అన్నట్టు సిటీలో ‘వీల్స్’ వీరవిహారం చేస్తున్నాయి. అదే క్రమంలో నగరంలో మెడిటేషన్ ఆన్ వీల్స్ అందుబాటులోకి వచ్చింది. కొన్ని నెలలుగా 3వేల మందికి పైగా తమ ధ్యాన చక్రాలు పలకరించాయని అంటున్నారు ఆధ్యాత్మిక వేదిక ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు.
ధ్యాన మార్గం వైపు మళ్లించేందుకు..
నగరంలో చదువుతో మొదలుపెడితే... ఉద్యోగాలు, వ్యాపకాల వంటివన్నీ ఒత్తిడి కారకాలుగా మారుతున్నాయి. ఈ ఒత్తిడి అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతోంది. దీనికి అత్యుత్తమ పరిష్కారం ధ్యానం.. అయితే సమయాభావం కావచ్చు, తగినంత అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు... చాలా మంది ఈ పరిష్కారాన్ని అందుకోలేకపోతున్నారు. వారి కోసమే ఈ మెడిటేషన్ ఆన్ వీల్స్‌ను డిజైన్ చేశామని వీరు చెబుతున్నారు.
ఆధ్యాత్మిక తోవ...
ఈ వాహనంతో పాటు బ్రహ్మకుమారీ సంస్థ సభ్యులు కొందరు ప్రయాణిస్తుంటారు. నగరవాసుల అభ్యర్థన మేరకు వారు కోరుకున్న ప్రాంతానికే వెళ్లి వాహనం ద్వారా ధ్యానం చేసే అవకాశాన్ని కలి్పస్తారు. దీనికి ఎటువంటి ఫీజూ చెల్లించనవసరం లేదు. ఆ వాహనానికి అవసరమైన పార్కింగ్ సమకూరిస్తే చాలు. కనీసం 2 గంటల నుంచి అత్యధికంగా 4 గంటల దాకా సేవలు అందిస్తారు. వాహనంలో ఒక్కో బ్యాచ్‌కు 10 మంది వరకూ హాజరు కావచ్చు. ధ్యానం అనంతరం వారి అనుభూతిని తెలుసుకుని, ఆసక్తి, అవసరాన్ని బట్టి వారికి ఆ తర్వాత ఉచిత ధ్యాన తరగతుల్లో పాల్గొనేందుకు అవకాశం కలి్పస్తారు.
ఐటీ కంపెనీ నుంచి గేటెడ్ కమ్యూనిటీ దాకా..
నగరంలో చుట్టుపక్కల ఉన్న ఏ విద్యా సంస్థ అయినా, ఐటీ కంపెనీ అయినా, గేటెడ్ కమ్యూనిటీ అయినా కార్పొరేట్ సంస్థలైనా...ఏవైనా సరే ఈ ధ్యాన వాహన సేవలు కావాలంటే బ్రహ్మకుమారీస్‌ను సంప్రదించవచ్చు. అవసరమైతే మరికొన్ని అదనపు రోజులు కూడా వాహనాన్ని అందుబాటులో ఉంచుతారు.
కులమతాలకు
అతీత సేవ...
మెడిటేషన్ ఆన్ వీల్స్ అనేది దేశంలోనే తొలిసారి. ఈ వాహనం ద్వారా కులమతాలకు అతీతమైన «ఉచిత ద్యాన సేవ అందించనున్నాం. ఇప్పటికే గత 8నెలలుగా మూడు నుంచి నాలుగువేల మందికి మా వాహన సేవలు అందాయి. దేశవ్యాప్తంగా కూడా దీన్ని విస్తరించాలని యోచిస్తున్నాం.
–శివాణి, బ్రహ్మకుమారీస్
Comments
Please login to add a commentAdd a comment