![Why Auto Rickshaws Have 3 Wheels; Check The Details](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/auto.jpg.webp?itok=bT3Rr1Oc)
దశాబ్దాల చరిత్ర ఉన్న.. ఆటో రిక్షా ఎన్ని అప్డేట్స్ పొందినా మూడు చక్రాలతోనే వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా.. పట్టణ ప్రాంతాల్లో కూడా విరివిగా అందుబాటులో ఉన్న ఆటోలకు ఇతర వాహనాలకు మాదిరిగా ఎందుకు నాలుగు చక్రాలు ఉండవు?, మూడు చక్రాలు ఉండటానికి కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బ్యాలెన్స్ చేయడం సులభం
నాలుగు చక్రాల వాహనాల కంటే.. మూడు చక్రాల వాహనాలను బ్యాలెన్స్ చేయడం కొంత సులభం అని ఓ ఐఐటీ ప్రొఫెసర్ వివరించారు. అంతే కాకుండా.. దీనిని రూపొందించడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువని అన్నారు.
ఖర్చు మాత్రమే కాకుండా.. ఇంజినీరింగ్ వర్క్ కూడా తక్కువే. నాలుగు చక్రాల వాహనం కన్నా మూడు చక్రాల వాహనం చిన్నదిగా రూపొందుతుంది. అలాంటప్పుడు ఎటువంటి ఇరుకు ప్రాంతంలో ప్రయాణించడానికైనా, కొద్దిపాటి ప్రాంతంలో పార్క్ చేయడానికైనా అనువుగా ఉంటుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే పట్టణాల్లో ఆటోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
మూడు చక్రాల వాహనం వలన ఇంధన వినియోగం కూడా భారీగా అవదు. ఆటోను నడిపించేందుకు ఇంజనుకు తక్కువ శక్తి సరిపోతుంది. కాబట్టి ఆటోలను నడిపేవారు కూడా దీని నిర్వహణకు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మొత్తం మీద ఈ కారణాల వల్లనే ఆటో మూడు చక్రాలను మాత్రమే కలిగి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment