Viral: ఈ ఇద్దరూ చిందేసినా రికార్డులే! | Donald Trump Elon Musk Dance AI Video Viral | Sakshi
Sakshi News home page

ట్రంప్‌-మస్క్‌ చిందేస్తే.. ఎక్స్‌ను కుదిపేస్తున్న వీడియో

Published Thu, Aug 15 2024 4:39 PM | Last Updated on Thu, Aug 15 2024 5:45 PM

Donald Trump Elon Musk Dance AI Video Viral

Musk Trump Viral: ఒకరేమో అపరకుబేరుడిగా.. ఏదో ఒక సంచలనంతో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి. ఇంకొకరేమో అధ్యక్ష ఎన్నికల్లో నిలబడి.. హత్యాయత్నం జరగడంతో మరోసారి విస్తృతస్థాయిలో చర్చనీయాంశంగా మారిన మాజీ అధ్యక్షుడు. ఇద్దరూ ఇద్దరే.  ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది?.

ఎలోన్‌ మస్క్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ను మొన్నీ మధ్యే తన ఎక్స్‌లో ఇంటర్వ్యూ చేశాడు. సాంకేతిక కారణాలతో ఆలస్యంగా ఆ ఇంటర్వ్యూ జరగడం, అదే టైంలో సైబర్‌ దాడి జరిగిందన్న ఆరోపణల నడుమే ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది  ఆ ఇంటర్వ్యూ విన్నారు. లేకుంటే.. రికార్డులు బద్ధలైపోయి ఉండేవేమో. అయితే.. ఈ ఇద్దరూ కలిసి డ్యాన్స్‌ వేస్తే ఎలా ఉంటుంది?.

ఇదేం డెడ్‌పూల్‌ వర్సెస్‌ వోల్వరిన్‌లాంటి మల్టీస్టారర్‌ కాదులేండి. ఏఐ జమానాలో ఏదైనా సాధ్యమే కదా. బీ గీస్‌ ఐకానిక్‌ సాంగ్‌ స్టేఇన్‌ ఎలైవ్‌ (Stayin Alive) పాటకు ట్రంప్‌, మస్క్‌లు కలిసి చిందులేశారు. ఆ ఎడిట్‌ వీడియోను ఉటా సెనేటర్‌ మైక్‌లీ ఎక్స్‌తో పోస్ట్‌ చేశారు. 36 సెకన్ల ఆ క్లిప్‌ను తన ఖాతాలో షేర్‌ చేసిన మస్క్‌.. ‘హేటర్స్‌ బహుశా దీన్ని ఏఐ  అంటారేమో’ అంటూ వ్యంగ్యంగా సందేశం ఉంచారు. ఇంకేం.. మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది ఆ వీడియో.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement