ఎప్పుడూ బిజీగా ఉండే దేశాధినేతలు చిత్ర విచిత్రమైన దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? వారు ర్యాంప్ వాక్ చేయడమేంటి అనుకుంటున్నారా? ఇదంతా నిజంగా కాదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేసిన చమత్కారం ఇది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌లతో సహా పలు దేశాధినేతలు భవిష్యత్ దుస్తులలో ర్యాంప్‌పై నడుస్తున్నట్లు ఏఐ రూపొందించిన వీడియోను చూపిస్తూ టెక్ బిలియనీర్ ఇలాన్ మస్క్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "ఇది ఏఐ ఫ్యాషన్ షో సమయం" అంటూ ఈ వీడియోకు మస్క్ క్యాప్షన్ ఇచ్చారు. ఇది అత్యధికంగా 35 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించింది.
నిమిషానికి పైగా నిడివిగల ఈ వీడియోలో ప్రధాని మోదీ, కమలా హారిస్, జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్, టిమ్ కుక్, ఉత్తర కొరియాకు చెందిన కిమ్ జోంగ్ ఉన్, నాన్సీ పెలోసి, జి జిన్‌పింగ్, జస్టిన్ ట్రూడో, బిల్, హిల్లరీ క్లింటన్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, బెర్నీ సాండర్స్, బిల్ గేట్స్, ఇలాన్ మస్క్ ర్యాంప్ మీద నడుస్తున్నట్లు కనిపిస్తారు. పనిలో పనిగా మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని కూడా ఇందులో చమత్కారంగా ప్రస్తావించారు.
High time for an AI fashion show pic.twitter.com/ra6cHQ4AAu
— Elon Musk (@elonmusk) July 22, 2024
Comments
Please login to add a commentAdd a comment