bare hands
-
రాక్షస అనకొండ..అలా.. ఎలా సామీ: వైరల్ వీడియో
మామూలు పాము అంటేనే ఆమడ దూరం పారిపోతాం. ఇక అనకొండను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. వన్య ప్రాణ సంరక్షణ కార్యకర్తలు, జూ సంరక్షకులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. ఎంతటి క్రూర మృగాలైనా వాటిని మచ్చిక చేసుకుని, వాటితో స్నేహంగా ఉంటారు. కానీ ఒక భారీ అనకొండను నిర్భయంగా ఉత్తి చేతులతో అలా అలవోకగా, మేనేజ్ చేసిన వీడియో తాజాగా నెట్టింట్ సందడి చేస్తోంది. అతని అసాధారణ సాహసానికి, నైఫుణ్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ విడియో వైరల్‌గా మారింది. ఫ్లోరిడాలోని మియామికి చెందిన జూ కీపర్ మైక్ హోల్స్టన్ Instagramలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. తనను తాను ది రియల్ టార్జాన్, ది కింగ్ ఆఫ్ ది జంగిల్ అని చెప్పుకునే హోల్స్టన్ తరచుగా వన్యప్రాణులకు సంబంధించిన చాలా ఆసక్తికరమైన వీడియోలను చాలా షేర్ చేస్తూ ఉంటాడు. ఇది కూడా అలాంటిదే. నీటిలో దాగి వున్న ఈ భారీ అనకొండను జాగ్రత్తగా సమీపించి, మెల్లిగా వెళ్లి, చటుక్కున దాని తలను ఒడిసిపట్టుకోవడంతో ఈ వీడియో మొదలవుతుంది. సాధారణంగా అనకొండ ఎంత బలిష్టమైన వారినైనా తన పట్టుతో లొంగదీసుకుంటుంది. కానీ తన నైపుణ్యంతో బలీయమైన అనకొండను పట్టుకోవడం, దానిపై నియంత్రణ సాధించడం,చివర్లో దాని ముద్దు పుట్టుకోవడం విశేషంగా నిలిచింది. దీన్ని లొంగదీసుకున్న వైనం అందర్నీ షాక్‌కు గురిచేస్తుంది. ఈ వీడియోను ఆ సాంతం గుడ్లప్పగించి, ఉత్కంఠగా చూస్తారు. వాట్ యాన్ ఎక్స్పిడిషన్ వెనిజులాకు మాన్స్టర్ అనకొండను విజయవంతంగా పట్టుకున్నాం అనే క్యాప్షన్‌తో దీన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 5 రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో 11.2 మిలియన్లకు పైగా వ్యూస్‌లను సాధించింది. మూడు లక్షలకు కమెంట్లను సాధించింది. బహుశా ఈ గ్రహం మీద అత్యంత ధైర్యవంతుడు అంటూ కమెంట్లు వెల్లువెత్తాయి. View this post on Instagram A post shared by Mike Holston (@therealtarzann) Homie caught a huge anaconda! 👀 @therealtarzann Download the Topmixtapes app for Android to stay updated: https://t.co/vpyvPCzn45 Download the Topmixtapes app for iOS to stay updated: https://t.co/tk3g7a7reZ pic.twitter.com/1P7IH2YREb — TopMixtapes.com (@topmixtapescom) November 16, 2023 -
రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్కింగ్.. వట్టి చేతుల్తో కారును పక్కకు జరిపేశాడు..
మహా నగరాల్లో డ్రైవింగ్ చేయడమంటే కత్తి మీద సాములాంటిదే! రహదారులు, ఇరుకైన రోడ్లు ఇలా ఎక్కడ చూసిన కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లే కనిపిస్తాయి. ఇక పార్కింగ్ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాహనాల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో బైక్, కారు పార్కింగ్ చేసేందుకు స్థలమే దొరకడమే కష్టంగా మారింది. ఒకవేళ ఎలాగోలా పార్కింగ్ స్థలం దొరికినా.. కొంతమంది సరిగా తమ వాహనాలను పార్క్ చేయరు. దీంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తుతోంది. తాజాగా కారు పార్కింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్క్ చేసిన కారును ఓ వ్యక్తి తన రెండు చేతులతో అమాంతం ఎత్తి పక్కకు జరిపాడు. అసలేం జరిగిందంటే.. ఇరుకుగా ఉన్న రోడ్డు మీద వరుసగా కొన్ని కార్లు పార్క్ చేసి ఉన్నాయి. వాటిలో మారుతీ సుజుకీ వ్యాగనార్ కారును ఎవరో అడ్డదిడ్డంగా పార్క్ చేశారు. దీంతో అటుగా వెళుతున్న వాహనాలకు ఇబ్బంది ఎదురైంది. కారును దాటుకుంటూ వెళ్లడం కష్టంగా మారింది. దీనిని ఎస్యూవీ కారులో వెళ్తున్న ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే కారులో నుంచి కిందకు దిగి తప్పుగా పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లాడు.. ఎవరి సాయం లేకుండానే దాదాపు 850 కిలోల బరువున్న కారును కేవలం తన రెండు చేతులతో ఎత్తి పక్కకు జరిపాడు. దీనిని మల్టీవీల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ షేర్ చేయడంతో వైరలవుతోంది. View this post on Instagram A post shared by MULTI WHEELS (@multiwheelss) -
అమేజింగ్ స్టంట్! నువ్వు గ్రేట్ స్వామీ! ఫిదా అయిన ఎలన్ మస్క్
Man put his hand in molten metal without Injured: ఇంతవరకు ఎన్నో రకాల వైరల్ వీడియోలు చూశాం. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం వామ్మో అని కచ్చితంగా అంటారు. ఎందుకంటే అంతలా ఉంటుంది ఆ ఫీట్. ఆ అమేజింగ్ స్టంట్ చూసి టెస్లా దిగ్గజం ఎలన్ మస్క్ సైతం స్ఫందించారు. వివరాల్లోకెళ్తే...ఒక వ్యక్తి కరిగిన ద్రవ లోహం అత్యంత వేడిగా ఉంటుంది. అలాంటి లోహ ద్రవాల వద్ద పనిచేసేవాళ్లు సైతం ఆ ఉష్టోగ్రతను తట్టుకోలేరు. అలాంటిది ఆ వ్యక్తి ఏకంగా కరిగిన ద్రవ లోహంలో నేరుగా చేయి పెట్టి తీశాడు. అయితే ఆ వ్యక్తి చేతి మీద గాయం గానీ కందినట్లు గానీ లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్ తెగ వైరల్ అవుతుంది. మొదట్లో నెటిజన్లు ఇది ఫేక్ వీడియో అనుకున్నారు గానీ ఇది ఒరిజనల్ స్టంటేనని తేలింది. ఈ వీడియోని చూసిన టెస్లా సీఈవో ఎలన్ మస్క్.. వావ్ అద్భుతం అతనికి ఎలాంటి గాయాలు కాలేదు అని అన్నారు. అంతేకాదు ఎవరు ఇలాంటి స్టంట్లు చేయవద్దని సోషల్ మీడియాలో ట్విట్ చేశారు కూడా. అయితే ఈ స్టంట్‌ని లైడెన్‌ఫ్రాస్ట్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. దీని ప్రభావం వల్ల నీటి బిందువులు తక్షణమే ఆవిరైపోకుండా, అత్యంత వేడిగా ఉండే హాబ్పై నృత్యం చేస్తాయి. అంతేకాదు ఆ మనిషి చేయికి గాయం కాకపోవడానికి కారణం అతని చర్మం ఉపరితలం మీద నీరు వేగంగా ఆవిరైపోతోందని, శక్తిమంతమైన తాత్కలిక నీటి ఆవిరి అతని చర్మాన్ని రక్షింస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. A really dramatic example of the Leidenfrost effect the moisture on his skin boils instantly, forming a layer of steam that insulates for a very short time, a temporary barrier between this person and the molten metal pic.twitter.com/USwGCRlj5Q — Science girl (@gunsnrosesgirl3) March 29, 2022 (చదవండి: ఫుడ్ డెలివరీ బాయ్ ఎంట్రీతో రచ్చ రచ్చ అయిన ప్రేమికుల గొడవ...వీడియో వైరల్) -
ఓ తల్లి సాహసం: ఒట్టి చేతులతో చిరుతతో పోరాడి
MP Tribal Woman Fights Leopard With Bare Hands Rescue Her Son: అమ్మ అంటేనే అంతులేని ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం. తనకు ఏం జరిగినా పట్టించుకోదు కానీ బిడ్డకు ఆపద అని తెలిస్తే.. ఆ తల్లి ప్రాణం తల్లడిల్లుతుంది. ఎక్కడా లేని ధైర్యం ఆవహిస్తుంది. ఆది పరాశక్తికి ప్రతిరూపంగా మారి.. ఆపదతో పోరాడుతుంది. ఆ సమయంలో తల్లికి ఎలాంటి ఆయుధాలు అవసరం లేవు.. బిడ్డ మీద ప్రేమ ఒక్కటే ఆమెకు వెయ్యి ఏనుగులు బలాన్ని ఇచ్చి.. పోరాడేలా చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. చంటి బిడ్డను నోట కరుచుకుని.. అడవిలోకి పారిపోయింది చిరుత పులి. బిడ్డ ప్రాణాలు కాపాడటం కోసం ఆ తల్లి పెద్ద యుద్ధమే చేసింది. తన చేతులనే ఆయుధాలుగా మార్చి.. చిరుతతో పోరాడి.. బిడ్డ ప్రాణాలు కాపాడుకుంది ఆ తల్లి. ఆ వివరాలు.. (చదవండి: దేశంలోనే తొలిసారి కనిపించిన అరుదైన ‘గులాబీ’ చిరుత) మధ్యప్రదేశ్, సిధి జిల్లాలోని సంజయ్ టైగర్ జోన్‌లోని ఝరియా అనే గ్రామంలో శంకర్ బైగా, కిరణ్ బైగా తమ పిల్లలతో జీవిస్తున్నారు. ఓ రోజు సాయంత్రం కిరణ్ బైగా తన పిల్లలతో కలిసి ఆరు బయట ఏర్పాటు చేసిన చలి మంట దగ్గర కూర్చుంది. కిరణ్ ఒడిలో ఓ పాప ఉండగా, మరో ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. ఇంతలో అడవిలో నుంచి వచ్చిన చిరుతపులి ఒక్కసారిగా వీరిపై దాడి చేసి.. కిరణ్ బైగా ఎనిదేళ్ల కొడుకు రాహుల్‌ని నోట కరుచుకుని అడవిలోకి పరిగెత్తింది. జరిగిన సంఘటనతో కిరణ్ బైగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. వెంటనే తేరుకుని మిగిలిన పిల్లలను ఇంట్లో ఉంచి.. రాహుల్‌ని కాపాడుకోవడం కోసం అడవిలోకి పరుగు తీసింది. అప్పటికే చీకటి పడింది. ఎదురుగా ఏం కనిపించడం లేదు. చిరుత బిడ్డను తీసుకుని పొదల్లో దూరింది. ఏం చేయాలో కిరణ్బైగాకు పాలు పోలేదు. కానీ తన బిడ్డ ప్రాణం ఆపదలో ఉన్న విషయం ఆమెను వెంటాడింది. (చదవండి: బాయ్‌ఫ్రెండ్ మాట్లాడటం లేదని పోలీసులకు ఫిర్యాదు.. కట్ చేస్తే) చేతికి దొరికిన కర్ర తీసుకుని అడవిలో ముందుకు వెళ్లింది. అప్పటికే కిరణ్ బైగా ధైర్యాన్ని చూసి చిరుత కాస్త జంకింది. ఈ క్రమంలో ఆమె బిడ్డను వదిలేసింది. వెంటనే కిరణ్ అక్కడకు పరిగెత్తి.. బిడ్డను తన పొత్తిళ్లలోకి తీసుకుంది. అంతసేపు కిరణ్ బైగాను చూసి జంకిన చిరుత.. ఉన్నట్టుండి ఆమె మీద దాడి చేయసాగింది. వెంటనే అప్రమత్తమైన కిరణ్ బైగాను బిడ్డను కాపాడుకుంటూనే.. ఒట్టి చేతలతో చిరుతతో పోరాడసాగింది. అప్పటికే విషయం తెలుసుకున్న గ్రామస్తులు కిరణ్, ఆమె బిడ్డ కోసం వెతుకుతూ.. అడవిలోకి వచ్చారు. జనాలను చూసిన చిరుత అడవిలోకి పరుగు తీసింది. ఈ దాడిలో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన ఫారెస్ట్ అధికారులు కిరణ్బైగా సాహసాన్ని ప్రశంసించి.. తక్షణ సాయం కోసం ఆమెకు వెయ్యి రూపాయలు ఇచ్చారు. బిడ్డ ప్రాణం కోసం కిరణ్ బైగా చేసిన సాహసంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. The woman of the village saved her little child from the leopard, this would have been the mother of real India (the land of Shivaji Maharaj) Not like today's gentle mother who is busy eating pizza burger and her lust, who shouts help me help me every time. #IndianMother pic.twitter.com/o5V0VRhvtZ — Odd-Purush (Odd Man) (@prevaildatruth) December 1, 2021 చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ -
వైరల్: తేనెటీగలతో సాహసం.. 21 మిలియన్ల వ్యూస్!
‘తేనేటీగలు’ లేకపోతే మనుషుల మనుగడ కష్టం. జీవ జాతుల్లో అంత్యంత ముఖ్యమైన విలువైన జీవి ఏదంటే.. ‘తేనెటీగ’ అని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. మనుషులకి రోగాలు వ్యాప్తి చేయని ఏకైక జీవి కూడా తేనెటీగనే.. వాటి తేనె తుట్టిలను కదిలిస్తే తప్పించి.. అవి సాధారణంగా మనుషులపై దాడి చేయవు. అయితే తాజాగా ఓ మహిళ ఒట్టి చేతులతో తేనెతుట్టిలను తొలగించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రొఫెషనల్ బీకీపర్స్ ఎరికా థాంప్సన్ ఒట్టి చేతులతో ఓ అపార్టుమెంట్లో గుంపుగా ఉన్న తేనెటీగలను తొలగించింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో షేర్ చేయగా 21 మిలియన్ల మంది నెటిజన్లు వీక్షించారు. అంతేకాదండోయ్ 4 లక్షల మంది లైక్ కొట్టి.. కామెంట్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..‘‘మీరు గొప్ప పని చేశారు. చాలా ధన్యవాదాలు! ఇది చాలా ఉత్తేజకరమైనది.’’ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ “నేను ఈ యువతి వీడియోను రెండోసారి చూస్తున్నాను. ఆమె నైపుణ్యాలను ఆరాధిస్తాను.’’ అంటూ రాసుకొచ్చారు. కాగా ఆమె సాహసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. (చదవండి: వైరల్ వీడియో: ఈ సూపర్ హీరోకి నెటిజన్ల ఫిదా) -
చేత్తో చేపలు పట్టేస్తున్నాడు!
-
చేత్తో చేపలు పట్టేస్తున్నాడు!
ఎప్పుడైనా సరదాగా చేపలు పట్టాలంటే ఏం చేస్తాం?. ఓ గాలం దానికి ఏర ఇలా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని వేటకు బయల్దేరుతాం. కానీ, అమెరికాలోని అలబామాలో నివసిస్తున్న రాబర్ట్ మాత్రం ఒట్టి చేతులతో చేపల వేటకు బయల్దేరతాడు. చిన్న చేపను ఎరగా చూపి పెద్ద చేపను పట్టేస్తాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. చిన్న చేపను ఎరగా చూపిన రాబర్ట్.. పెద్ద చేప దాన్ని తినడానికి నోరు తెరిచింది. అంతే తన వేళ్లతో చేపను గట్టిగా పట్టుకుని బయటకు తెచ్చేశాడు రాబర్ట్. ఆ తర్వాత మళ్లీ దాన్ని తిరిగి నీటిలోకి వదిలేశాడు. మరి చేపలను చేతితో పట్టే టెక్నిక్ మీరు కూడా చూసేయండి. -
అస్ట్రేలియాలో 14ఏళ్ల బాలుడి సాహసం