
మహా నగరాల్లో డ్రైవింగ్ చేయడమంటే కత్తి మీద సాములాంటిదే! రహదారులు, ఇరుకైన రోడ్లు ఇలా ఎక్కడ చూసిన కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లే కనిపిస్తాయి. ఇక పార్కింగ్ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాహనాల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో బైక్, కారు పార్కింగ్ చేసేందుకు స్థలమే దొరకడమే కష్టంగా మారింది. ఒకవేళ ఎలాగోలా పార్కింగ్ స్థలం దొరికినా.. కొంతమంది సరిగా తమ వాహనాలను పార్క్ చేయరు. దీంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తుతోంది.
తాజాగా కారు పార్కింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్క్ చేసిన కారును ఓ వ్యక్తి తన రెండు చేతులతో అమాంతం ఎత్తి పక్కకు జరిపాడు. అసలేం జరిగిందంటే.. ఇరుకుగా ఉన్న రోడ్డు మీద వరుసగా కొన్ని కార్లు పార్క్ చేసి ఉన్నాయి. వాటిలో మారుతీ సుజుకీ వ్యాగనార్ కారును ఎవరో అడ్డదిడ్డంగా పార్క్ చేశారు.
దీంతో అటుగా వెళుతున్న వాహనాలకు ఇబ్బంది ఎదురైంది. కారును దాటుకుంటూ వెళ్లడం కష్టంగా మారింది. దీనిని ఎస్‌యూవీ కారులో వెళ్తున్న ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే కారులో నుంచి కిందకు దిగి తప్పుగా పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లాడు.. ఎవరి సాయం లేకుండానే దాదాపు 850 కిలోల బరువున్న కారును కేవలం తన రెండు చేతులతో ఎత్తి పక్కకు జరిపాడు. దీనిని మల్టీవీల్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ షేర్ చేయడంతో వైరలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment