lifts
-
అమ్మాచిని మించి దైవం ఉన్నదా!
మనం చిన్నవయసులో ఉన్నప్పుడు అమ్మ ఎత్తుకుంటుంది. కుంచెం నడవడం వచ్చిన తరువాత కూడా ఎత్తుకోమని అమ్మ దగ్గర మారాం చేసేవాళ్లం. అలాంటి అమ్మను ఎత్తుకోవడాన్ని మించిన అదృష్టం ఏం ఉంటుంది! కేరళకు చెందిన రోజన్ పరంబిల్ స్విట్జర్లాండ్‌లో ఉద్యోగం చేస్తాడు. అయిదు సంవత్సరాల తరువాత సొంత ఊరు వచ్చాడు. వయసు పైబడి, బలహీనంగా కనిపిస్తున్న అమ్మాచి(అమ్మ)ను చూసి చాలా బాధేసింది. ఎంతో కాలంగా ఇంటి నాలుగు గోడలకే పరిమితమైన అమ్మకు బయటిగాలి తాకేలా ట్రిప్ ప్లాన్ చేశాడు. ఈ చిరు ప్రయాణంలో వారు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. రకరకాల జ్ఞాపకాలను కలబోసుకుని తెగ నవ్వుకున్నారు. నచ్చిన చోట ఆగి సెల్ఫీలు తీసుకున్నారు. గతంలో ఒకసారి రోజన్ తన తల్లిని స్విట్జర్లాండ్ తీసుకువెళ్లి యూరప్‌లోని రకరకాల ప్రదేశాలు చూపెట్టాడు. తల్లిలో అప్పుడు కనిపించిన ఎనర్జీ ఇప్పుడు మరోసారి కనిపించింది. ట్రిప్ కోసం రోజన్ తన తల్లిని భుజాల మీద మోస్తూ కారు దగ్గరికి తీసుకువెళుతున్న వీడియో వైరల్ అయింది. నెటిజనులను కదిలించేలా చేసింది. -
అదిగదిగో..స్కైవాక్
హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉప్పల్ స్కైవాక్ త్వరలో ప్రారంభం కానుంది. సుమారు రూ.25 కోట్లతో హెచ్ఎండీఏ చేపట్టిన ఈ స్కైవాక్ వందేళ్ల పాటు ఏ మాత్రం చెక్కు చెదరని విధంగా ఎంతో పటిష్టంగా ఏర్పాటు చేశారు. స్కైవాక్ నిర్మాణం కోసం వెయ్యి టన్నులకుపైగా స్ట్రక్చరల్ స్టీల్‌ను వినియోగించినట్లు అంచనా. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద పాదచారులు నలువైపులా సురక్షితంగా రోడ్డు దాటేందుకు ఈ ఆకాశ వంతెన నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇది సుదీర్ఘకాలం మన్నికగా ఉండేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, వైజాగ్ స్టీల్‌తో పాటు జిందాల్ స్టీల్ కంపెనీలకు చెందిన స్ట్రక్చరల్ స్టీల్‌ను వినియోగించారు. పాదచారుల వంతెన నిర్మాణంలో భాగంగా 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు, మరో 4 ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. ఈ స్కైవాక్ కారిడార్ 660 మీటర్ల పొడవు ఉంటుంది. దీని కోసం 37 పిల్లర్లు వినియోగించారు. ఇది భూమి నుంచి 6 మీటర్ల ఎత్తులో ఉంటుంది. స్కైవాక్ బ్యూటిఫికేషన్ కోసం 40 శాతం వరకు రూఫ్ కవరింగ్ ఏర్పాటు చేశారు. ఉప్పల్ చౌరస్తాలో ప్రతి రోజు నాలుగు వైపులా రాకపోకలు సాగించే సుమారు 20 వేల మందికి పైగా పాదచారులు ఈ స్కైవాక్‌ను వినియోగించుకొనే అవకాశం ఉంది. ఉప్పల్ మెట్రో ప్రయాణికులు ఇకపైన మెట్రో కాన్కోర్ నుంచి స్కై వాక్ మీదుగా స్టేషన్‌కు రాకపోకలు సాగించవచ్చు. లిఫ్టులు, మెట్ల మార్గాల పరిసరాల్లో హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ యంత్రాంగం మొక్కలు పచ్చిక బయలతో పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. -
రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్కింగ్.. వట్టి చేతుల్తో కారును పక్కకు జరిపేశాడు..
మహా నగరాల్లో డ్రైవింగ్ చేయడమంటే కత్తి మీద సాములాంటిదే! రహదారులు, ఇరుకైన రోడ్లు ఇలా ఎక్కడ చూసిన కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లే కనిపిస్తాయి. ఇక పార్కింగ్ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాహనాల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో బైక్, కారు పార్కింగ్ చేసేందుకు స్థలమే దొరకడమే కష్టంగా మారింది. ఒకవేళ ఎలాగోలా పార్కింగ్ స్థలం దొరికినా.. కొంతమంది సరిగా తమ వాహనాలను పార్క్ చేయరు. దీంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తుతోంది. తాజాగా కారు పార్కింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్క్ చేసిన కారును ఓ వ్యక్తి తన రెండు చేతులతో అమాంతం ఎత్తి పక్కకు జరిపాడు. అసలేం జరిగిందంటే.. ఇరుకుగా ఉన్న రోడ్డు మీద వరుసగా కొన్ని కార్లు పార్క్ చేసి ఉన్నాయి. వాటిలో మారుతీ సుజుకీ వ్యాగనార్ కారును ఎవరో అడ్డదిడ్డంగా పార్క్ చేశారు. దీంతో అటుగా వెళుతున్న వాహనాలకు ఇబ్బంది ఎదురైంది. కారును దాటుకుంటూ వెళ్లడం కష్టంగా మారింది. దీనిని ఎస్యూవీ కారులో వెళ్తున్న ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే కారులో నుంచి కిందకు దిగి తప్పుగా పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లాడు.. ఎవరి సాయం లేకుండానే దాదాపు 850 కిలోల బరువున్న కారును కేవలం తన రెండు చేతులతో ఎత్తి పక్కకు జరిపాడు. దీనిని మల్టీవీల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ షేర్ చేయడంతో వైరలవుతోంది. View this post on Instagram A post shared by MULTI WHEELS (@multiwheelss) -
ఆంక్షల ఎత్తివేత: అమెరికన్ ఎక్స్‌ప్రెస్ స్పందన
ముంబై: అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలను ఎత్తి వేయడంపై సంతోషం ప్రకటించింది. కొత్త దేశీయ కస్టమర్లను ఆన్‌బోర్డ్‌లో చేరేలా తక్షణమే వీలు కల్పించడం తమకు గణనీయమైన లాభాన్ని చేకూరుస్తుందని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. కీలకమార్కెట్లో పరిమితులను ఎత్తివేయడాన్ని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ స్వాగతించింది తమకు ఇండియా కీలకమైన వ్యూహాత్మక మార్కెట్ అనీ, సాంకేతికత, మౌలిక సదుపాయాలలో తమ స్థానిక ప్రధాన పెట్టుబడుల ఫలితమే ఆర్బీఐ నిర్ణయమని సంస్థ తాత్కాలిక సీఈఓ, సీఓఓ సంజయ్ ఖన్నా వ్యాఖ్యానించారు. ప్రీమియం ఉత్పత్తులు, సేవలకు పెరుగుతున్న డిమాండ్ తీర్చేందుకు అత్యుత్తమ సామర్థ్యంతో ఉన్నామనీ, ఆర్బీఐ నిర్ణయం దేశంలో తమ వ్యాపార వృద్ధికి తోడ్పడు తుందన్నారు. కాగా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్‌పై ఆంక్షలను ఆర్బీఐ బుధవారం ఎత్తివేసింది. కొత్తగా దేశీయ కస్టమర్లను చేర్చుకోవడానికి అనుమతించింది. చెల్లింపుల సమాచారాన్ని నిక్షిప్తం చేసే అంశానికి సంబంధించిన ఆదేశాలను పాటించనందుకు అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌పై ఆర్బీఐ గతంలో ఆంక్షలు విధించింది. పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు చెల్లింపుల పూర్తి సమాచారాన్ని 2018 ఏప్రిల్ నుంచి భారత్‌లోనే నిక్షిప్తం చేయాలన్న నిబంధన ఉంది. -
లిఫ్టులను ప్రభుత్వమే నిర్వహించాలి!
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు త్రాగునీరు, సాగునీరు ఎక్కువగా వచ్చే అవకాశం లేకుండా పోతుందని ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న మొదట్లోనే నల్లగొండ జిల్లా ప్రజలు, అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ క్రమంలో ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు ఎడమ కాల్వపై ప్రత్యేకంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు ఏర్పాటు చేసి లక్ష ఎకరాలకు నీళ్ళు అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ లిఫ్టులు కూడా ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలియపరిచారు. కానీ అది నేటికీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వల్ల లిఫ్టుల ఆయకట్టు రైతులు నష్టపోతూనే ఉన్నారు. ప్రభుత్వం లిఫ్టులు ఏర్పాటు చేయటానికి ముందుకు రాకపోవడం వలన రైతులే స్వయంగా 1970లో కో–ఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసుకొని భూములు బ్యాంకుల్లో కుదువ పెట్టి అప్పులు తీసుకుని 18 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు చేపట్టి 1980–81 వరకు నడిపించారు. తర్వాత వీటిని నిర్వహించడం తమ వల్ల కాదనీ, ప్రభుత్వమే నిర్వహించాలనీ పెద్ద ఎత్తున రైతులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దాని ఫలితంగా ఆనాటి ప్రభుత్వం ఐడీసీ డిపార్ట్మెంట్కు ఆ లిఫ్టుల నిర్వహణ బాధ్యతను అప్పగించింది. తర్వాత కాలంలో అంచెలంచెలుగా మొత్తం 54 లిఫ్టులు ఎడమ కాల్వపై ఐడీసీ ద్వారా ఏర్పాటు చేశారు. ఆనాడు లిఫ్టులకు కరెంటు సప్లై సరిగ్గా లేక సగం ఆయకట్టుకు కూడా నీళ్ళు అందని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో రైతుల ఇబ్బందులను గమనించి నాగార్జున సాగర్ నుండి నడిగూడెం మండలంలో ఉన్న చివరి లిఫ్టు వరకూ రైతులందరినీ వెంట తీసుకొని 2007లో సీపీఎం పాదయాత్ర నిర్వహించింది. నాతో పాటు నంద్యాల నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్య, మరికొంత మంది నాయకులూ పాల్గొన్న ఈ పాదయాత్ర వారం రోజుల పాటు సాగింది. ఇది ప్రభుత్వం మీద బలమైన ఒత్తిడి కలుగజేసింది. ఫలితంగా... సెపరేట్ ఫీడర్ లైన్ నిర్మాణం జరిగి 18 గంటలు కరెంట్ సప్లై అయ్యే విధంగా ఏర్పాటు జరిగింది. అయినా తర్వాత కాలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లిఫ్టులు నడపలేని పరిస్థితి వచ్చింది. 2013–14లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునికీ కరణ పనులకు వరల్డ్ బ్యాంక్ అందించిన 4 వేల కోట్లలో రూ. 100 కోట్లు కేటా లిఫ్టుల మరమ్మతులకు కేటాయించారు. ఈ నిధులతో 50 శాతం పనులు మాత్రమే చేపట్టి వదిలేశారు. తర్వాత లిఫ్టుల నిర్వహణ బాధ్యతను ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్కు, తర్వాత ఐబీ డిపార్ట్మెంట్కు అప్పగించారు. బాధ్యత ఏ శాఖకు ఇచ్చినా శాశ్వత సిబ్బందిని మాత్రం నియమించలేదు. పైగా ఐబీ శాఖకు ఈ లిఫ్టులపై కనీస అవగాహన లేదు. ఈనాడు ఈ లిఫ్టులన్నీ పరిశీలిస్తే మోటార్లు, స్టార్టర్లు, కాల్వలు, తూములు దెబ్బతిని రైతులు నడపలేని పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలోనూ; 2014, 2018 ఎన్నికల ప్రచార సభల్లోనూ; వారి ఎన్నికల మ్యానిఫెస్టోలో సాగర్ ఎడమ కాల్వపై ఉన్న లిఫ్టులన్నింటినీ ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వమే నడిపిస్తుందని హామీ ఇచ్చారు. కానీ అమలు మర చారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వపై ఉన్న లిఫ్టులను ప్రభుత్వమే నడిపించాలి. యుద్ధ ప్రాతిపదికపైన మరమ్మతులు చేపట్టాలి. బావుల, కాల్వల పూడికలు; తూములు, మోటార్లు, షట్టర్లు, ప్యానల్ బోర్డులు, పంపులు, పైప్ లైన్స్ తదితర పనులు చేపట్టాలి. లిఫ్టుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించాలి. లిఫ్టుల నిర్వహణ బాధ్యత ఐడీసీకి అప్పజెప్పాలి. వీరి న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో నల్లగొండ ఐబీసీఈ ఆఫీసు ముందు నేడు (జూన్ 27) ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. (క్లిక్: శాస్త్రశోధనల గొంతు నొక్కితే ఎలా?) - జూలకంటి రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం నాయకుడు -
అసోంలో 15 నుంచి కరోనా ఆంక్షల ఎత్తివేత
గౌహతి: రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలన్నింటినీ ఫిబ్రవరి 15 నుంచి ఎత్తేయాలని అసోం నిర్ణయించింది. కరోనా విజృంభణ, కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం హిమంత బిశ్వశర్మ సోమవారం మీడియాకు వెల్లడించారు. వచ్చే రెండు నెలల వ్యవధిలో స్కూలు బోర్డు పరీక్షలు, మున్సిపల్ తదితర ఎన్నికలు షెడ్యూల్ మేరకే జరుగుతాయని చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే స్టూడెంట్లంతా వ్యాక్సిన్ రెండు డోసులు విధిగా వేసుకోవాలన్నారు. ‘‘ఇక రాత్రి కర్ఫ్యూలుండవు. షాపింగ్, సినిమా మాల్స్ పూర్తి సామర్థ్యంతో నడుస్తాయి. పెళ్లిళ్లు, వేడుకలను రాత్రిళ్లు కూడా జరుపుకోవచ్చు. వాటిలో పాల్గొనే వాళ్లంతా విధిగా రెండు డోసులూ వేసుకోవాలి. మాస్కు ధరించాలి.’’ అని వివరించారు. దేశంలో 83,876 కేసులు దేశవ్యాప్తంగా సోమవారం 83,876 కొత్త కరోనా కేసులు, 895 మరణాలు నమోదయ్యాయి. మరణాల్లో 515 కేరళలో, 66 మహారాష్ట్రలో జరిగాయి. ఒమిక్రాన్ విజృంభణ తర్వాత గత 32 రోజుల్లో రోజువారీ కరోనా కేసులు లక్ష కంటే తగ్గడం ఇదే తొలిసారి. దేశంలో మొత్తం కరోనా కేసులు 4,2,72,014కు, మరణాలు 5,02,874కు చేరాయి. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 11,08,938కి తగ్గాయి. కోవిడ్ రికవరీ రేటు 96,19 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ పేర్కొంది. -
ముంబైలో పవర్ కట్
ముంబై: ముంబై సోమవారం విద్యుత్ అంతరాయంతో స్తంభించింది. ఉదయం 10 గంటలపుడు సంభవించిన ఈ పరిణామంతో లోకల్ రైళ్లు ఎక్కడివక్కడే ఆగాయి. భవనాల్లో లిఫ్టులు మధ్యలోనే ఆగిపోయాయి. కోవిడ్ కారణంగా ‘వర్క్ ఫ్రం హోం’ విధానంలో లక్షలాది మంది ఇళ్లలో ఉండి అందించాల్సిన సేవలకు అంతరాయం ఏర్పడింది. కోవిడ్, ఇతర అత్యవసర రోగులకు చికిత్స అందించే ఆస్పత్రుల కోసం డీజిల్ జనరేటర్లను యంత్రాంగం తరలించాల్సి వచ్చింది. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగిన యంత్రాంగం మధ్యాహ్నం 12 గంటలకు సేవలను క్రమక్రమంగా పునరుద్ధరించగలిగింది. కాగా, ఈ ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విద్యుత్, తదితర శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, విద్యుత్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమావేశమై, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. విద్యుత్ అంతరాయం ఘటనపై తక్షణం పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశించారు. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ(ఎంఎస్ఈటీసీఎల్)కు చెందిన కల్వా– ఖర్ఘార్ సబ్స్టేషన్లలో మెయింటెనెన్స్ పనులు జరుగుతున్న సమయంలో ఉదయం 10 గంటల సమయంలో అంతరాయం ఏర్పడిందని విద్యుత్ మంత్రి నితిన్ తెలిపారు. లోడ్ భారమంతా మోస్తున్న రెండో సర్క్యూట్లో లోపం తలెత్తడమే ఇందుకు కారణమన్నారు. కల్వా సబ్‌స్టేషన్ వరకు విద్యుత్‌ను తీసుకువచ్చే బాధ్యత రాష్ట్ర విద్యుత్ సంస్థది కాగా, అక్కడి నుంచి టాటా, అదానీ సంస్థలు నగరానికి సరఫరా చేస్తుంటాయన్నారు. ముంబైతోపాటు సబర్బన్‌లోని థానే, పన్వెల్, డోంబివిలి, కల్యాణ్‌లో విద్యుత్ అంతరాయం తలెత్తింది. కంపెనీలు, సంస్థల్లో మాదిరిగా బ్యాక్–అప్ సౌకర్యం లేని ఇళ్లలోని లక్షలాది మంది ఉద్యోగుల ‘వర్క్ ఫ్రం హోం’ సేవలకు తీవ్ర అవరోధం కలిగింది. ముంబైలో కరోనా కేసులు పెరిగిపోతున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయడంతో కోవిడ్ వైద్య కేంద్రాల్లోని వారి కోసం డీజిల్ జనరేటర్లను, సినిమా షూటింగ్‌ల కోసం వాడే మొబైల్ డీజిల్ జనరేటర్లను తెప్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పని చేయించేందుకు ఏర్పాటు చేసిన రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒకటి పనిచేయడం ఆలస్యం కావడమే ఇందుకు కారణమని ఓ అధికారి వివరించారు. -
శాంసంగ్‌కు ఊరటనిచ్చిన డీజీసీఏ
న్యూఢిల్లీ: గెలాక్సీ నోట్ 7 , నోట్ 2 బ్యాటరీ పేలుళ్ల ప్రమాదాలతో చిక్కుల్లో పడిన కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ కు డీజీసీఏ భారీ ఊరట నిచ్చింది. భారత విమానాల్లో ఉపయోగించే శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లపై విధించిన నియంత్రణలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ఎత్తివేసింది. అయితే సెస్టెంబర్ 15 తరువాత కొన్ని గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని వివరించింది. అంతకుముందు కొనుగోలు చేసిన నోట్ 7 ఫోన్లపై నిషేధాజ్ఞలు యధావిధగా అమలవుతాయని రెగ్యులేటరీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా గెలాక్సీ నోట్ 7 చార్జింగ్ సమయంలో బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్ ఇబ్బందుల్లో పడింది. ఈ పేలుళ్లను ధృవీకరించిన సంస్థ వీటిని రీకాల్ చేసింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ దేశీయ విమానాల్లో ఈ ఫోన్ల వాడకంపై నిషేధాజ్క్షలు విధించింది. మరోవైపు ఇటీవల చెన్నై విమానాశ్రయంలో ఇండిగో విమానం లాండ్ అవుతున్న సందర్భంగా నోట్2 స్మార్ట్ ఫోన్ కారణంగా పొగలు వ్యాపించడం ఆందోళన రేపింది. ఈనేపథ్యంలో డీజీసీఏ నోటీసులు జారీ చేయడంతో శాంసంగ్ అధికారులే డీజీసీఏ అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. -
రైల్వే స్టేషన్లలో మరిన్ని సౌకర్యాలు
సాక్షి, ముంబై: ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎమ్మార్వీసీ) నగరవ్యాప్తంగా ముఖ్య రైల్వేస్టేషన్లలో 68 ఎస్కలేటర్లు, 30 లిఫ్టులను అమర్చేందుకు యోచిస్తోంది. మరో రెండేళ్లలో ప్రయాణికులకు ఇవి అందుబాటులోకి రానున్నట్లు ఎమ్మార్వీసీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఏడు ఎస్కలేటర్లు ఉన్నాయి. నగర శివారు ప్రాంతాల్లో మరో రెండేళ్లలో అదనంగా 38 ఎస్కలేటర్లను ఏర్పాటుచేయడానికి ఎమ్మార్వీసీ పూనుకుంది. ఇదిలా వుండగా వెస్టర్న్ రైల్వేలో 21 ఎస్కలేటర్లు, అదేవిధంగా ఎనిమిది లిఫ్టుల ఏర్పాటుకు యోచించగా, సెంట్రల్ రైల్వే తొమ్మిది ఎస్కలేటర్లు, 18 లిఫ్టులను ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదించింది. చాలా మంది ప్రయాణికులు హడావుడిగా రైలు పట్టాలు దాటుతూ తమ ప్రాణాలు పోగొట్టుకుంటుండడంతో వీటిని అరికట్టే ఉద్దేశంతోనే ముఖ్య రైల్వేస్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మార్వీసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ రాకేష్ సక్సేనా తెలిపారు. రైల్వే ఆవరణలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్లు ఎక్కేందుకు ముఖ్యంగా వయోధికులు, వికలాంగులు చాలా ఇబ్బందులకు లోనవుతుంటారు. దాంతో వారిలో చాలామంది తమ ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. కాగా ఈ ఎస్కలేటర్లను ప్రాధాన్యత ప్రతిపాదికన నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్గించడంలో ఖర్చుకు వెనుకాడబోమని ప్రయాణికుల సంఘటన సభ్యుడు అశోక్ దాతర్ తెలిపారు. కాగా ఎమ్మార్వీసీ ‘ట్రెస్ పాస్ కంట్రోల్’ ప్లాన్‌లో భాగంగా ఏప్రిల్ చివరివరకు 26 ఎస్కలేటర్లు, ఎనిమిది లిఫ్టులను నిర్మించనుంది. అంతేకాకుండా అంధేరీ, గోరేగావ్ స్టేషన్లలో ఒక్కోచోట ఆరేసి ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులను నిర్మించనుందని సక్సేనా వివరించారు. సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే సంయుక్తంగా ఈ ప్రాజెక్టు కోసం రైల్వే బోర్డును అదనంగా నిధులు అందించాల్సిందిగా కోరాయి. ఏప్రిల్ చివరి వరకు రద్దీ స్టేషన్లలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ‘ట్రెస్ పాస్ కంట్రోల్ ప్లాన్’ ప్రాజెక్టు కింద ఏడాది వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తని ఎస్కలేటర్లను అమర్చనున్నట్లు సక్సేనా తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 12 స్టేషన్లలో ర్యాంపులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. కాగా, వెస్టర్న్ రైల్వేలోని ముంబై సెంట్రల్లో 5 ఎస్కలేటర్లను ఏర్పాటుచేయగా దాదర్‌లో రెండు ఎస్కలేటర్లు, అదేవిధంగా రెండు లిఫ్టులు, బాంద్రాలో నాలుగు ఎస్కలేటర్లు, అంధేరీలో ఏడు ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులు, బోరివలిలో ఎనిమిది ఎస్కలేటర్లు, నాలుగు లిఫ్టులు, భయందర్‌లో నాలుగు ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులు ఏర్పాటుచేయనున్నామన్నారు. కాగా సెంట్రల్ రైల్వేలోని దాదర్‌లో మూడు ఎస్కలేటర్లు, ఆరు లిఫ్టులు, కుర్లాలో నాలుగు ఎస్కలేటర్లు, ఘాట్కోపర్లో రెండు ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులు, విక్రోలీలో ఒక్క ఎస్కలేటర్, ఠాణేలో నాలుగు ఎస్కలేటర్లు, మూడు లిఫ్టులు, కల్యాణ్‌లో నాలుగు ఎస్కలేటర్లను మరో రెండేళ్లలో సిద్ధం చేయనున్నట్లు సక్సేనా తెలిపారు. -
‘యశోద’లో కూలిన లిఫ్ట్
ఐదుగురికి గాయాలు బంధువుల ఆందోళన రాంగోపాల్‌పేట్, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో రన్నింగ్‌లో ఉన్న ఓ లిప్టు 8వ అంతస్తు నుంచి కిందకు పడిపోవడంతో ఐదు మందికి గాయాలయ్యాయి. అదష్టవశాత్తు ఆ లిప్టులో పేషంట్లు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగినా ఆస్పత్రి వర్గాలు స్పందించకపోవడంతో కొద్దిసేపు ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో బయటి భాగంలో ఇటీవల ఓ లిప్టును నిర్మించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో 8వ అంతస్తులో లిఫ్ట్‌లోకి 15మంది రోగుల బంధువులు ఎక్కారు. లిప్టు ఆపరేటర్ 9వ అంతస్తుకు తీసుకుని వెళ్లాడు. అప్పటికే ఓవర్ లోడ్ అయింది. దానికి తోడు మరో ఆరు మంది సిబ్బంది అందులో ఎక్కారు. అక్కడి నుంచి లిప్టు కిందకు వస్తూ 8వ అంతస్తుకు రాగానే పట్టుతప్పి కిందకు పడిపోయింది. దీంతో లిప్టులో ఉన్న వారందరు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అక్కడ సిబ్బంది లిప్టు డోర్ తీసి లోపలున్న వారిని బయటకు తీశారు. అల్వాల్‌కు చెందిన వీణారెడ్డి(36), ఆమె తల్లి భారతి(60) సైనిక్‌పురికి చెందిన లక్ష్మి(55) ఆమె కుమారుడు ప్రభుదాస్(25), మహారాష్ర్టకు చెందిన అమర్జిత్ యాదవ్(25)లకు గాయాలయ్యాయి. వీణారెడ్డి నడుముకు గాయాలు కావడంతో ఆమె లేవలేని పరిస్థితిలో ఉంది. అలాగే లక్ష్మి ఎడమకాలుకు, ప్రభుదాస్‌కు రెండు కాళ్లకు, అమర్జిత్ యాదవ్ వీపు వెనుక భాగంలో గాయాలయ్యాయి. భారతికి స్వల్ప గాయాలు కావడంతో అప్పటికప్పుడే పంపించారు. ముగ్గురికి మాత్రమే దెబ్బలు తగిలాయని.. అందరివీ స్వల్ప గాయాలని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు. బంధువుల ఆందోళన.. ఉద్రిక్త పరిస్థితి రోగుల బంధువులకు గాయాలు కావడంతో వారి సంబంధీకుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీనికి తోడు యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సెక్యురిటీ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వారు ఆస్పత్రి వర్గాలతో గొడవకు దిగారు. గాయాలపాలైన వారిని చూసేందుకు వచ్చిన వారికి ఓ సెక్యూరిటీ గార్డు ‘ముగ్గురు నలుగురు చచ్చారా’ అంటూ మాట్లాడటంతో గొడవ పెద్దదైంది. సెక్యురిటీ గార్డుపై కొంతమంది చేయి చేసుకున్నారు. పోలీసులకు సమాచారం లేదు. లిప్టు ప్రమాదానికి గురై ఐదు మంది గాయాలపాలైతే సిబ్బంది కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. మూడు గంటల తర్వాత మీడియా మొత్తం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎవరూ పట్టించుకోవడం లేదు:అమర్జిత్ యాదవ్ అమ్మ ఇక్కడ చికిత్స పొందుతుంటే చూడటానికి వచ్చాను. లిఫ్ట్ కిం దపడి దెబ్బలు తగిలి రెండు గంటలైంది. ఏ డాక్టరూ పట్టించుకోలే దు. కనీసం ఒక్క టాబ్లెట్ కూడా ఇవ్వలేదు. చాలా నొప్పిగా ఉంది. నాపైనే కేసు పెడతామన్నారు:ప్రభుదాస్ దెబ్బ తగిలి ట్రీట్మెంట్ చేయమంటుంటే.. అతి చేస్తే నీపైనే ఉల్టా కేసు పెడతామని బెదిరిస్తున్నారు. రెండు కాళ్లకు దెబ్బ తగిలి నొప్పి పెడుతుంటే ఇంత వరకు ఏ ట్రీట్మెంట్ చేయలేదు. మా అమ్మ కాలికి దెబ్బ తగిలింది. లిప్టులో నాణ్యత లేదు:వెంకటరెడ్డి బంధువు యాజమాన్యం అత్యాశతో బయట లిప్టు ఏర్పాటు చేసింది. అది ఫిల్లర్లతో నిర్మించాల్సి ఉన్నా కేవలం ఐరన్ రాడ్‌తో కట్టారు. దీనికి తోడు బంధువులకు దెబ్బతగిలి తామొస్తే చచ్చారా అంటూ మాట్లాడుతున్నారు. సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.