WagonR
-
రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్కింగ్.. వట్టి చేతుల్తో కారును పక్కకు జరిపేశాడు..
మహా నగరాల్లో డ్రైవింగ్ చేయడమంటే కత్తి మీద సాములాంటిదే! రహదారులు, ఇరుకైన రోడ్లు ఇలా ఎక్కడ చూసిన కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లే కనిపిస్తాయి. ఇక పార్కింగ్ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాహనాల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో బైక్, కారు పార్కింగ్ చేసేందుకు స్థలమే దొరకడమే కష్టంగా మారింది. ఒకవేళ ఎలాగోలా పార్కింగ్ స్థలం దొరికినా.. కొంతమంది సరిగా తమ వాహనాలను పార్క్ చేయరు. దీంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తుతోంది. తాజాగా కారు పార్కింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్క్ చేసిన కారును ఓ వ్యక్తి తన రెండు చేతులతో అమాంతం ఎత్తి పక్కకు జరిపాడు. అసలేం జరిగిందంటే.. ఇరుకుగా ఉన్న రోడ్డు మీద వరుసగా కొన్ని కార్లు పార్క్ చేసి ఉన్నాయి. వాటిలో మారుతీ సుజుకీ వ్యాగనార్ కారును ఎవరో అడ్డదిడ్డంగా పార్క్ చేశారు. దీంతో అటుగా వెళుతున్న వాహనాలకు ఇబ్బంది ఎదురైంది. కారును దాటుకుంటూ వెళ్లడం కష్టంగా మారింది. దీనిని ఎస్యూవీ కారులో వెళ్తున్న ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే కారులో నుంచి కిందకు దిగి తప్పుగా పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లాడు.. ఎవరి సాయం లేకుండానే దాదాపు 850 కిలోల బరువున్న కారును కేవలం తన రెండు చేతులతో ఎత్తి పక్కకు జరిపాడు. దీనిని మల్టీవీల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ షేర్ చేయడంతో వైరలవుతోంది. View this post on Instagram A post shared by MULTI WHEELS (@multiwheelss) -
ఫార్చునర్ కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకున్న లెక్చరర్..
లక్నో: తాను అడిగిన ఫార్చునర్ కారును కట్నంగా ఇవ్వలేదని పెళ్లినే రద్దు చేసుకున్నాడు ఓ ప్రభుత్వ కళాశాల లెక్చరర్. ఈ వివాహం తనకు వద్దని పెళ్లికుతూరుకు మెసేజ్ చేసి చెప్పాడు. దీంతో ఆమె కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. పెళ్లికొడుకుపై కేసు పెట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ ఘాజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. పెళ్లికొడుకు పేరు సిద్ధార్థ్ విహార్. ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయింది. అయితే తనకు కట్నంగా ఫార్చునర్ కారు ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం వాగన్ఆర్ కారును బుక్ చేశారు. ఈ విషయం తెలిసిన పెళ్లికొడుకు కుటుంబసభ్యులు తమకు ఫార్చునర్ కారే కావాలని పట్టుబట్టారు. కానీ పెళ్లికూతురు కుటుంబం మాత్రం వాగన్ఆర్ మాత్రమే ఇప్పిస్తామని చెప్పింది. దీంతో ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు వధువుకు మేసేజ్ ద్వారా తెలియజేశాడు వరుడు. మరో ఘటనలో పెళ్లికొడుకు నచ్చలేదని.. అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్ ఇటావాలో కూడా ఓ పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. పెళ్లిమండపంలో దండలు మార్చుకున్న తర్వాత ఓ పెళ్లికూతురు అనూహ్యంగా పెళ్లి రద్దు చేసుకుంది. అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. పెళ్లి చూపుల్లో తాను చూసిన అబ్బాయి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న అబ్బాయి వేరని వధువు చెప్పింది. ఈ అబ్బాయి నల్లగా ఉన్నాడని, తనకు నచ్చలేదని పేర్కొంది. ఇక చేసేదేమీ లేక పెళ్లికొడుకు కుటుంబం కూడా పెళ్లిని రద్దు చేసుకునేందుకు అంగీకరించింది. అయితే తాము పెళ్లికూతురుకు పెట్టిన నగలు తిరిగి ఇవ్వలేదని వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లి ఏర్పాట్లకు రూ.లక్షలు ఖర్చు అయ్యాయని తెలిపారు. చదవండి: స్వలింగసంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు -
హల్చల్ చేస్తోన్న మారుతి సుజుకీ వ్యాగన్ఆర్ నయా మోడల్..! ధర ఎంతంటే..?
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పోర్ట్‌ఫోలియోలో సరికొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఈ కారు వ్యాగన్ఆర్ టూర్ హెచ్3గా పిలవనున్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ టూర్హెచ్3 సరికొత్త డిజైన్‌తో రానుంది. ఈ కారులో హ్యాచ్‌బ్యాక్ బాడీ కలర్ బంపర్స్, వీల్ సెంటర్ క్యాప్ అండ్ బ్లాక్-అవుట్ ఓఆర్వీఎంను అమర్చారు. కారు ఇంటీరియర్ విషయానికి వస్తే...ఇందులో ఫ్రంట్ క్యాబిన్ ల్యాంప్స్, టికెట్ హోల్డర్‌తో డ్రైవర్ సైడ్ సన్‌వైజర్, ఫ్రంట్ అండ్ రియర్ హెడ్రెస్ట్ ఉన్నాయి. అంతేకాకుండా సైడ్ ఆటో డౌన్ ఫంక్షన్, మాన్యువల్ ఏసీ, వెనుక పార్శిల్ ట్రే, రిక్లైనింగ్ అండ్ ఫ్రంట్ స్లైడింగ్ సీట్లు కలిగిన ఫ్రంట్ పవర్ విండోలతో రానుంది. గతంలో మారుతి సుజుకి పలు వేరియంట్లకు టూర్ వెర్షన్ మోడల్స్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు డిజైర్, ఎర్టిగా టూర్ వెర్షన్ మోడల్స్‌కు మారుతి సుజుకీ వ్యాగన్ఆర్ కూడా వచ్చి చేరింది. వ్యాగన్ఆర్ టూర్ హెచ్3 పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో రానుంది. పెట్రోల్ వేరియంట్ ధర రూ. 5.39 లక్షలు కాగా, సీఎన్జీ వేరియంట్ రూ. 6.34 లక్షలుగా ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే..! మారుతి సుజుకి వ్యాగన్ఆర్ టూర్ హెచ్3 కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీ టెక్నాలజీతో ఎబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్స్, స్పీడ్ లిమిటింగ్ ఫంక్షన్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, సెంట్రల్ డోర్ లాకింగ్‌తో రానుంది. ఇంజిన్ విషయానికి వస్తే..! మారుతి సుజుకి వ్యాగన్ఆర్ టూర్ హెచ్3 పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో రానుంది. పెట్రోల్ పవర్ ట్రైన్‌తో..1.0-లీటర్, 3-సిలిండర్, K10C పెట్రోల్ ఇంజన్‌తో 5,500rpm వద్ద 64bhp శక్తిని, 3,500rpm వద్ద 89Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇది మారుతి సుజుకి డ్యూయల్‌జెట్ సాంకేతికతను ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌తో పొందుతుంది. దీంతో ఈ కారు 25.4km/l మైలేజ్‌ను అందిస్తుంది. సీఎన్జీ వేరియంట్లో డ్యూయల్ జెట్ సాంకేతికత లేదు. ఈ వెర్షన్ 5,300rpm వద్ద 56bhp శక్తిని, 3,400rpm వద్ద 82Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో రానుంది. ఈ వేరియంట్ గరిష్టంగా 34.73km/kg మైలేజ్‌ను అందించనుంది. చదవండి: హల్చల్ చేస్తోన్న టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..! లాంచ్ ఎప్పుడంటే..? -
సరికొత్త అవతారంలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారు..!
ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి తన కొత్త వ్యాగన్ఆర్ కారును "ఆల్ న్యూ అవతార్"లో లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ న్యూ వ్యాగన్ఆర్ అడ్వాన్స్ డ్ కె-సిరీస్ డ్యూయల్ జెట్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ, డ్యూయల్ వీవీటి ఇంజిన్ సహాయంతో పనిచేస్తుంది. ఇది 1.0ఎల్, 1.2ఎల్ పవర్ ట్రైన్ ఆప్షన్ లలో వస్తుంది. న్యూ వ్యాగన్ ఆర్ 1.01ఎల్ ఇంజిన్ వేరియంట్ ప్రారంభ ధర రూ.5,39,000 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) కాగా, ఖరీదైన మోడల్ రూ.7,10,00(ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)కు లభ్యం కానుంది. మారుతి సుజుకి కొత్త వ్యాగన్ఆర్ కారుని కూడా రూ.12 300 నెలవారీ సబ్ స్క్రిప్షన్ ఫీజుతో సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. కొన్నేళ్లుగా 2.7 మిలియన్లకు పైగా వినియోగదారులు వ్యాగన్ఆర్ కార్లను కొనుగోలు చేసినట్లు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ కొత్త వ్యాగన్ఆర్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్‌తో పాటు డ్యూయల్-టోన్ గ్రే మెలాంజ్ ఫ్యాబ్రిక్‌తో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో సిస్టమ్‌తో వస్తుంది. 4 స్పీకర్లతో కూడిన ప్రీమియం ఆడియో సిస్టమ్, ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ 1.0-లీటర్ కే10సీ పెట్రోల్ అండ్ 1.2-లీటర్ కే12ఎన్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ అండ్ 5-స్పీడ్ ఏఏంటీ గేర్‌బాక్స్‌తో పనిచేస్తాయి. ఐడియల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీతో వచ్చిన ఈ కొత్త డ్యుయల్ జెట్ ఇంజన్ 25.19 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. త్వరలో ఈ మోడల్ సీఎన్జీ వెర్షన్‌తో కూడా లాంచ్ చేయనున్నారు. మారుతి వ్యాగన్ఆర్ 2022 ఫేస్‌లిఫ్ట్ గతం కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. హిల్ హోల్డ్ అసిస్ట్(స్టాండర్డ్), డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు(స్టాండర్డ్), బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సెక్యూరిటీ అలారం, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, బజర్‌తో సీట్ బెల్ట్ రిమైండర్, సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఫోర్స్ లిమిటర్, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్ అండ్ చైల్డ్ ప్రూఫ్ రియర్ డోర్ లాక్‌తో సహా 12 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లు ఉంటాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు టాటా టియాగో, హ్యుందాయ్ సాంట్రోతో పోటీపడుతుంది. (చదవండి: ఎన్ఎస్ఈ కుంభకోణం కేసులో అదిరిపోయే ట్విస్ట్.. అతడే "అదృశ్య" యోగి!) -
పండుగ సెంటిమెంట్, కార్లను తెగకొనేస్తున్నారు
ముంబై: పండుగ సీజన్ సెంటిమెంట్ కలిసిరావడంతో ఆగస్టులో వాహన విక్రయాలు పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం,హోండా కంపెనీలు అమ్మకాల్లో స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. చదవండి : ఫెస్టివల్ బొనాంజా ఆఫర్..సర్వీస్, ప్రాసెసింగ్ చార్జీల ఎత్తివేత మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు ఐదు శాతం పెరిగి 1,30,699 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే ఆగస్ట్‌లో 1,24,624 వాహనాలను విక్రయించింది. అయితే దేశీయ విక్రయాలు 6% తగ్గి 1,10,080 యూనిట్లకు పరిమితమైంది. అంతర్జాతీయంగా సెమికండెక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని కంపెనీ తెలిపింది. ఇదే నెలలో హ్యుందాయ్ మోటార్ 12 శాతం వృద్ధిని సాధించి మొత్తం 59,068 వాహనాలను విక్రయించింది. గతేడాది ఆగస్టులో 35,420 యూనిట్లు అమ్మిన టాటా మోటార్స్.., ఈ ఆగస్టులో 53 శాతం వృద్ధిని సాధించి 54,190 వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 17 శాతం పెరిగి 15,973 యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. థార్, ఎక్స్‌యూవీ 300, బోలెరో నియో, బొలెరో పిక్–అప్ కార్ల బుకింగ్స్ కలిసొచ్చాయని ఎంఅండ్ఎం కంపెనీ సీఈఓ విజయ్ నాక్రా తెలిపారు. కియా మోటార్స్ ఇండియా వాహన విక్రయాలు 55 శాతం వృద్ధిని సాధించి మొత్తం 16,750 యూనిట్ల అమ్మింది. గతేడాదిలో ఇదే నెలలో విక్రయాలు 10,845 యూనిట్లు. ‘‘ఆటో కంపెనీలు పండుగ సీజన్‌ను స్థిరమైన విక్రయాలతో ప్రారంభించాయి. రానున్న రోజుల్లో కస్టమర్ల నుంచి బుక్సింగ్ మరింత పెరగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమికండక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపుతున్న వేళ డిమాండ్‌కు తగ్గట్లు వాహనాలను అందుబాటులో ఉంచడం ఆటో పరిశ్రమకు సవాలుగా మారవచ్చు’’ అని నిస్సాన్ మోటార్ ఎండీ రాకేష్ శ్రీవాస్తవ తెలిపారు. -
సరికొత్త మార్పులతో మారుతి సుజకీ వ్యాగన్ఆర్...!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సరికొత్తగా వ్యాగన్ఆర్ ఎక్స్ట్రా ఎడిషన్‌ను మార్కెట్లలోకి లాంచ్ చేసింది. ఈ కారు 1L లేదా 1.2L ఇంజిన్, ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో లభ్యమవుతుందని తెలుస్తోంది. వ్యాగన్ఆర్ ఎక్స్ట్రా కారు లిమిటిడెట్ ఎడిషన్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది స్టాండర్డ్ వ్యాగన్ఆర్ వేరియంట్‌కు 13 కొత్త అప్గ్రేడ్లతో రానుంది. కారు ఇంటీరియర్స్, ఎక్స్‌టిరియర్స్ గణనీయంగా మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాగన్ఆర్ కారును సుమారు రూ. 22,990 అదనంగా చెల్లించడంతో అప్‌గ్రేడ్ అవుతుంది. కారులో స్టైలింగ్‌లో భాగంగా కారు వెనుక బంపర్ ప్రొటెక్టర్, సైడ్ స్కర్ట్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, బాడీసైడ్ మౌల్డింగ్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, అప్పర్ గ్రిల్ క్రోమ్ గార్నిష్, వెనుక డోర్‌కు క్రోమ్ గార్నిష్, నంబర్ ప్లేట్ సరికొత్తగా అమర్చారు. అంతేకాకుండా డిజిటల్ ఎయిర్ ఇన్‌ఫ్లేటర్, ట్రంక్ ఆర్గనైజర్, కార్ ఛార్జర్ ఎక్స్టెండర్ సౌకర్యాలను కలిగి ఉంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ రెండు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. 1.0 లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్ 67 బిహెచ్పి సామర్థ్యంతో 90 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఫోర్ సిలిండర్ పెట్రోల్ 1.2 లీటర్ ఇంజన్ 82 బీహెచ్పీ సామర్థ్యంతో 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. భద్రత పరంగా కారులో ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) తో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఫ్రంట్ సీట్ బెల్ట్స్ రిమైండర్, రియర్ పార్కింగ్ సెన్సార్లను అమర్చారు. -
మార్కెట్లోకి కొత్త ‘వ్యాగన్ఆర్’
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. తన వ్యాగన్–ఆర్ శ్రేణిలో నూతన వెర్షన్‌ను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కారును ‘బిగ్ న్యూ వ్యాగన్ఆర్’గా అభివర్ణించిన సంస్థ.. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మరో ఆప్షన్లో భాగంగా 1–లీటర్ ఇంజిన్‌ను కూడా అందుబాటులో ఉంచింది. 1.2 లీటర్ ఇంజిన్ కారు ధరల శ్రేణి రూ.4.89 లక్షలు–రూ.5.69 లక్షలు. 1–లీటర్ ఇంజిన్ ధరల శ్రేణి రూ.4.19 లక్షలు–రూ.4.69 లక్షలు కాగా, ఈ విభాగంలోని ఆటోమేటెడ్ గేర్ షిఫ్ట్ ధర రూ.5.16 లక్షలు. హై టెన్షన్ స్టీలును వాడడం వల్ల నూతన వేరియంట్లో శబ్దం, కుదుపులు తక్కువగా ఉంటాయని కంపెనీ తెలిపింది. ‘ఈ కారు కేవలం ఫ్యామిలీనే కాకుండా, యువ కొనుగోలుదారులను కూడా మంచి చాయిస్ కానుంది.’ అని సంస్థ సీఈఓ కెనిచి అయుకవా మాట్లాడుతూ.. వ్యాఖ్యానించారు. జీఎస్టీ గణనీయంగా తగ్గాలి: ప్రస్తుతం ఆటోమొబైల్స్‌పై 28% జీఎస్టీ రేటు, ఇందుకు అదనంగా 15% సెస్ అమల్లోఉండగా.. ఇవి తగ్గాల్సిన అవసరం ఉందని కెనిచి అయుకవా అన్నారు. జీఎస్టీ తగ్గడం వల్ల పరిశ్రమ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. -
విక్రయాల్లో మారుతీ మెరుపులు
న్యూఢిల్లీ : దేశీయ ప్యాసెంజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ జూలై నెల అమ్మకాల్లో ఓ వెలుగు వెలిగింది. అమ్మకాల్లో 13.9శాతం దూసుకెళ్లి 1,25,778 యూనిట్లను రికార్డుచేసినట్టు గణాంకాల్లో పేర్కొంది. సియాజ్, బాలెనో, ఈకో, విటారా బ్రీజా వాహనాలు ఈ అమ్మకాల వృద్ధికి ఎక్కువగా దోహదం చేశాయని కంపెనీ తెలిపింది. ఇప్పటివరకూ అత్యధిక అమ్మకాలు నమోదుచేసిన నెలగా జూలైనే నిలిచినట్టు మారుతీ వెల్లడించింది. ప్రతి రెండు కార్లలో ఒకటి కచ్చితంగా అమ్ముడుపోయినట్టు తెలిపింది. 151.3శాతం స్ట్రాంగ్ యుటిలిటీ వెహికిల్ విక్రయాల్లో కొత్తగా లాంచ్ అయిన మారుతీ విటారా దూసుకెళ్లింది. ఎగుమతుల పరంగా చూసినా కంపెనీకి పాజిటివ్ వృద్ధే నమోదుచేసినట్టు వెల్లడించింది. గత కొన్ని నెలలుగా పడిపోయిన ఎగుమతులు 0.3 శాతం పెరిగి 11,38 యూనిట్లుగా రికార్డు అయ్యాయి. అయితే జూన్‌లో సుబ్రోస్ ప్లాంటులో నెలకొన్న అగ్రిప్రమాదం కారణంగా ఆ ప్లాంట్ ను తాత్కాలికంగా మూసివేయడంతో కంపెనీ తన వాల్యుమ్ వృద్ధి శాతంలో కొంత పడిపోయింది. మారుతీ చిన్న కార్లు ఆల్టో, వాగన్-ఆర్ లు అమ్మకాల్లో కొంత నిరాశపర్చాయి. అవి 7.2 శాతం పడిపోయి 354,051 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. రిట్జ్, బెలానో, స్విప్ట్, సెలెరియో, డిజైర్లు 4.1శాతం పెరిగి 50,362గా రికార్డు అయ్యాయి. జూలై నెలలో నమోదైన మారుతీ అమ్మక గణాంకాలతో ఆ కంపెనీ షేర్లు మార్నింగ్ ట్రేడింగ్‌లో రయ్ మని దూసుకెళ్లాయి. 2.10 శాతం పెరిగి, రూ.4,871 రికార్డు ధరను తాకాయి. -
మారుతీ కొత్త కారు స్టింగ్రే
న్యూఢిల్లీ: మారుతీ సుజుకి కంపెనీ కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో కొత్త మోడల్, స్టింగ్రేను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. 998 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో మూడు వేరియంట్లలో లభించే ఈ కారు ధరలను రూ. 4.1 లక్షలు నుంచి రూ. 4.67 లక్షల రేంజ్లో(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతమున్న వ్యాగన్ ఆర్ కారు కంటే ఈ కారు ధర రూ. 20,000 అధికం. త్వరలో సీఎన్జీ మోడల్‌ను కూడా అందించనున్నది. కారు ప్రత్యేకతలు 3 సిలిండర్ ఇంజిన్‌తో కూడిన ఈ కారు 20.5 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని అంచనా. ఈ సెగ్మెంట్ కార్లలో ఏ కంపెనీ కారుకు లేనటువంటి ప్రాజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఈ కారులో ఉన్నాయి. ఇక హై ఎండ్ మోడల్లో అడ్జెస్టబుల్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ రియర్ వ్యూ మిర్రర్స్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, రెండు ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ వంటి ప్రత్యేకతలున్నాయి. వాహనాల అమ్మకాలు మందకొడిగా ఉన్నప్పటికీ, వినియోగదారులు మారుతీ కార్లను కొనడాన్ని కొనసాగిస్తున్నారని మారుతీ సుజుకి ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవ చెప్పారు. యువ వినియోగదారులు లక్ష్యంగా, కొత్త మోడళ్లను అందించే వ్యూహంలో భాగంగా స్టింగ్రే కారును మార్కెట్లోకి తెచ్చామని పేర్కొన్నారు.