ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి తన కొత్త వ్యాగన్ఆర్ కారును "ఆల్ న్యూ అవతార్"లో లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ న్యూ వ్యాగన్ఆర్ అడ్వాన్స్ డ్ కె-సిరీస్ డ్యూయల్ జెట్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ, డ్యూయల్ వీవీటి ఇంజిన్ సహాయంతో పనిచేస్తుంది. ఇది 1.0ఎల్, 1.2ఎల్ పవర్ ట్రైన్ ఆప్షన్ లలో వస్తుంది. న్యూ వ్యాగన్ ఆర్ 1.01ఎల్ ఇంజిన్ వేరియంట్ ప్రారంభ ధర రూ.5,39,000 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) కాగా, ఖరీదైన మోడల్ రూ.7,10,00(ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)కు లభ్యం కానుంది. మారుతి సుజుకి కొత్త వ్యాగన్ఆర్ కారుని కూడా రూ.12 300 నెలవారీ సబ్ స్క్రిప్షన్ ఫీజుతో సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు.
కొన్నేళ్లుగా 2.7 మిలియన్లకు పైగా వినియోగదారులు వ్యాగన్ఆర్ కార్లను కొనుగోలు చేసినట్లు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ కొత్త వ్యాగన్ఆర్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్‌తో పాటు డ్యూయల్-టోన్ గ్రే మెలాంజ్ ఫ్యాబ్రిక్‌తో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో సిస్టమ్‌తో వస్తుంది. 4 స్పీకర్లతో కూడిన ప్రీమియం ఆడియో సిస్టమ్, ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ 1.0-లీటర్ కే10సీ పెట్రోల్ అండ్ 1.2-లీటర్ కే12ఎన్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ అండ్ 5-స్పీడ్ ఏఏంటీ గేర్‌బాక్స్‌తో పనిచేస్తాయి.
ఐడియల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీతో వచ్చిన ఈ కొత్త డ్యుయల్ జెట్ ఇంజన్ 25.19 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. త్వరలో ఈ మోడల్ సీఎన్‌జీ వెర్షన్‌తో కూడా లాంచ్ చేయనున్నారు. మారుతి వ్యాగన్ఆర్ 2022 ఫేస్‌లిఫ్ట్ గతం కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. హిల్ హోల్డ్ అసిస్ట్(స్టాండర్డ్), డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు(స్టాండర్డ్), బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సెక్యూరిటీ అలారం, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, బజర్‌తో సీట్ బెల్ట్ రిమైండర్, సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఫోర్స్ లిమిటర్, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్ అండ్ చైల్డ్ ప్రూఫ్ రియర్ డోర్ లాక్‌తో సహా 12 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లు ఉంటాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు టాటా టియాగో, హ్యుందాయ్ సాంట్రోతో పోటీపడుతుంది.
(చదవండి: ఎన్‌ఎస్‌ఈ కుంభకోణం కేసులో అదిరిపోయే ట్విస్ట్.. అతడే "అదృశ్య" యోగి!)
Comments
Please login to add a commentAdd a comment